సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దు | VantintiChitkalu

దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం..
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే..
నిజానికి గత నెల 28 (మార్చి 28, 2020)న రాత్రి 8:30 నుంచి 9:30 వరకు ఎర్త్ అవర్ లో విశ్వమంతా పాల్గొనేది. కానీ మాయదారి మహమ్మారి కరోనా (కోవిడ్-19) కారణంగా ప్రపంచం అంతా లాక్ డౌన్ దిశగా వెళ్ళిన సంగతి అందరికి తెలిసిందే.

గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇంచుమించు గత రెండు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం మార్చి మాసంలోని చివరి శనివారం ప్రపంచంలోని అనేక దేశాలు ఎర్త్ అవర్ (ప్రపంచ వాతావరణ దినోత్సవం)లో పాల్గొంటున్నాయి. అంటే విద్యుద్దీపాలే  కాకుండా అన్నీ గృహోపకరణాలు, వ్యాపార, పారిశ్రామిక విద్యుత్ అవసరాలు.. వగైరా అన్నీ గంట పాటు నిలిపివేస్తున్నట్టే కదా..

అప్పుడెప్పుడు తలెత్తని సమస్య ఈ రోజు మన దేశ ప్రధాని పిలుపుమేరకు రాత్రి 09:09 గంటలకు తొమ్మిది నిమిషాలపాటూ కేవలం ఇళ్ళలోని లైట్లు మాత్రమే తీసివేస్తే వస్తుందా.. విద్యుత్తు వ్యవస్థకు ఏదో జరిగిపోతుందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దు.

హ్యాండ్ శానిటైజర్ వాడిన వెంటనే గ్యాస్ స్టవ్, దీపాలు.. వెలిగించడం చేయకూడదు. ఇది అత్యంత ప్రమాదకరం. కారణం ఏంటంటే చాలా శానిటైజర్లలో అధిక శాతం స్పిరిట్, ఆల్కాహాల్‌ ఉండడమే. స్పిరిట్‌ కి ఇట్టే మండే గుణం ఉంటుంది. తగు జాగ్రత్తలతో ఈ రోజు తమ ఇళ్ల ముందు లేదా బాల్కనీల్లో దీపాలు వెలిగిస్తారుగా..