పాలులేని హిమక్రీములు! PART-1 | How Bad is Ice Cream for your Health?



గొంతులోకి చల్లచల్లగా గరళం - పాలులేని హిమక్రీములు!

రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. | తొలకరి వచ్చేస్తోంది.. | Why Does First Rain Smell Sweet?


ఈ నెల 30, 31వ తేదీ కల్లా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం నెలకొన్నందున అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుగానే కేరళను తాకుతాయని నిపుణులు అంచనావేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండతీవ్రత, వడగాడ్పులు కొనసాగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ వాతావరణం మరో నాలుగు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది.

సాధారణంగా మే 30,31 ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకి తదనంతరం ఏపిలోకి ప్రవేశిస్తాయి. ఇక తొలకరి వర్షాలు రాగానే రైతులు పూర్తి స్థాయిలో ఏరువాకలో నిమగ్నం అవుతారు.




ఇంటి ముంగిట పూదోటతో.. PART-4 | Best Front Door Flower Pots | Front House Landscaping

పాము విషంతో ఎయిడ్స్ కు చెక్ | Snake Venom Can Cure AIDS | vantinti chitkalu


ఎయిడ్స్ నివారణకు రామాంతాపూర్, హైదరాబాద్ హోమియో కళాశాల వైద్యులు మందు కనిపెట్టారు. పాము విషంతో తయారు చేసిన క్రొటాలస్ హరిడస్ ఔషదంతో ఎయిడ్స్ కు చెక్ పెట్టచ్చని చెప్తున్నారు. ఈ హోమియో మందు గతంలో ఆఫ్రికాలో లక్షల మందిని పొట్టనపెట్టుకున్న ఎబోలా వ్యాధిని సమూలంగా నివారించడంలో ఉపయోగపడింది. ఇప్పుడు హోమియోపతి వైద్యులు రెండేళ్లుగా 30 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై ప్రయోగించి ఎయిడ్స్ నివారణలోనూ పూర్తిగా సఫలీకృతులయ్యారు. అలాగే ౩ వేల మంది రోగులకు వ్యాధి తీవ్రత తగ్గగా,  11 వేల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారన్నారు. దీంతో ఆసుప‌త్రికి ఎయిడ్స్ రోగుల తాకిడి పెరిగింది.

హ్యూమన్‌ ఇమ్యునో డెఫిషి యెన్సీ వైరస్‌ మనిషిలో పూర్తిగా రోగనిరోధక శక్తిని  క్షీణింపచేస్తుంది, ఇతర వ్యాధులకు కారణమయ్యేలా చేసే పరిస్థితినే అక్వైర్డ్‌ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్‌ అంటారు. హెచ్‌ఐవి శరీరంలోనికి ప్రవేశించిన వెంటనే ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. ఇతర వ్యాధులన్ని ఒకేసారి కబలించి ఒక్కసారిగా వ్యాధి లక్షణాలు బహిర్గతం అవుతాయి. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, విశృంఖల లైంగిక సంబంధాలు, పలువురు కలసి ఒకే సిరంజితో మాదక ద్రవ్యాలను వాడడం, రక్తమార్పిడి.. ఇలా హెచ్‌ఐవి వ్యాప్తి చెందుతుంది.

రెండు దశాబ్దాల క్రితం భారత్‌లో ఎయిడ్స్ దుష్ప్రభావం ఎక్కువగా ఉన్నా, సమర్థవంతంగా ఎదుర్కొని ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎయిడ్స్ నిరోధానికి ఎక్కువ శాతం ఔషధాల సరఫరాలో భారత్ కీలక భూమిక పోషిస్తోంది. భారత దేశంలోని ఫార్మాస్యూటికల్ సంస్థలు తయారుచేసిన చౌక జెనెరిక్ ఔషధాలే వర్ధమాన దేశాల్లో హెచ్‌ఐవీ చికిత్సకు వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఇంకా చౌకగా హెచ్‌ఐవి, ఎయిడ్స్ ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. 


# ఎయిడ్స్ కు నివారణ ఒక్కటే మార్గం | హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ కు మందు లేదు | Prevention is Better than Cure | HIV / AIDS

రోహిణి కార్తెకి ముందే రోళ్ళు పగిలిపోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త..! | Rohini Karte Sunstroke


ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఇప్పటికే పలు చోట్ల 45 నుంచి 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోరోహిణి కార్తె రాకుండానే రోళ్లు, రోకళ్ళు పగులుతున్నాయి. ఇక 'రోహిణి కార్తె' ఈ నెల 25న ప్రారంభమై జూన్ 8 వరకు ఉంటుంది. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత సాధారణంగా ఈ సమయంలోనే నమోదవుతోంది. దీంతో వడదెబ్బకు గురయ్యే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది. అత్యవసరమైన పనులు ఉంటే తగు జాగ్రత్తలు తప్పని సరి అని వైద్యులు సూచిస్తున్నారు. 

- దాహం వేయకపోయినా సరే నీళ్లు తాగుతూనే ఉండాలి
- శీతల పానీయాలు తాగడం వల్ల దాహం తీరకపోగా మరింతగా పెరుగుతుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళద్దు
- కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి
- మూత్ర విసర్జన పచ్చగా వస్తుంటే ఒంట్లో నీటి శాతం తగ్గిపోయిందని గుర్తించాలి
- వదులుగా ఉండే నూలు దుస్తులు , తెలుపు, లేతరంగులవి మాత్రమే ధరించాలి
- కిటికీలకు, తలుపులకు వట్టివేళ్ళ చాపలు, దుప్పట్లు వంటివి కట్టి వాటిపై నీళ్లు చల్లుతూ ఉండడం వల్ల గదులు చల్లబడతాయి
- ఇంట్లోకి గాలి వీచేలా చూసుకోవాలి


- వడదెబ్బకు గురైతే..  వెంటనే నీడలోకి తరలించాలి
 దుస్తులు వదులు చేసి గాలి బాగా ఆడేలా చూడాలి
 చల్లని నీళ్లతో తుడవాలి, ఐస్ వాటర్ అయినా వాడుకోవచ్చు
 సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి

17 మే: ప్రపంచ రక్తపోటు దినోత్సవం - ఒక అవగాహణ | How do you lower your Blood Pressure (Hypertension)


ఆరోగ్యవంతుడికి బాడీ టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్ రేటు, బ్లడ్ ప్రెజర్.. ఇలా అన్నీ అవధిలో ఉండాలి. ఇందులో ఏది అవధిని మించి పెరిగినా, తగ్గినా అనారోగ్యమే. రక్తపు పోటు అవధిని మించి పెరిగితే దానిని అధిక రక్తపోటు(hypertension)గా పరిగణిస్తారు. అధిక రక్తపోటు వలన హార్ట్ ఎటాక్, గుండెజబ్బులు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, బ్రేయిన్ స్ట్రోక్‌.. వచ్చే ప్రమాదముంది. వంశపార్యపరంగానే కాక ధూమపానం, మద్యపానం, అధిక బరువు, అధిక కోలెస్ట్రాల్‌, ఉప్పు ఎక్కువగా వాడడం వలన అధిక రక్తపోటు వస్తుంది. బీపి చెక్ చేయించుకున్నప్పుడు స్ఫిగ్మోమానోమిటర్‌ పై సాదరణ రక్తపోటు 120-80గా ఉండాలి. రక్తపోటు 140-90 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే రక్తపోటు తగ్గించు కోవటానికి మందులు కచ్చితంగా వాడవలసి ఉంటుంది. రక్తపోటు 180-140 అంతకంటే ఎక్కువకు చేరితే శరీరంలోని ప్రధానమైన అవయవాలు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గర్బవతులలో అధిక రక్తపోటు వలన తల్లికి, బిడ్డకు ప్రమాదం. వ్యాయామం, యోగా, ధ్యానం.. ఇలా చేస్తూ ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం ఉత్తమం. అలాగే పూర్తిగా ధూమపానం, మద్యపానంలకు దూరంగా ఉండాలి.

రక్తపోటు నియంత్రణలో ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తినే తిండిలో పుష్కలంగా కాయగూరలు, ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పప్పు దినుసులు, కొవ్వు తక్కువ ఉన్న పాలు, మజ్జిగ.. వగైరా ఉండాలి. అలాగే ఆహారంలో ఉప్పు తగ్గించాలి. సాధ్యమయినంత వరకు ఉప్పుని మితంగా వాడటం అలవర్చుకోవాలి.

ఫలాల రారాజు మామిడి పండు | ఫలరాజా పై అపోహలెందుకు? మామిడితో ఆరోగ్యం | The King of Fruits: The Health Benefits of Mangoes | బిగ్ బాస్ | Bigg Boss | vantintichitkalu | వంటింటిచిట్కాలు



ఆయా సీజన్లలో లభించే పండ్లను తీసుకోవడం ద్వారా ఆ సీజన్‌లో ఏర్పడే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని అందరికి తెలిసిందే. సమ్మర్ లో దొరికే ఫలాల రారాజు మామిడి పండ్లను చూస్తే నోరూరనిదెవరికి, అయినా అవి ఆరగించడానికి అపొహలెందుకు.

వేసవిలో విరివిరిగా దొరికే మామిడి పండ్లలో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండి వడదెబ్బ తగలకుండా కాపాడడంతో పాటు శరీరానికి కావలసినంత శక్తినిస్తాయి. అంతే కాకుండా శరీరం చల్లబరిచేలా చేస్తాయి. మామిడిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. దీనితో క్యాన్సర్లకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్‌-సి, పెక్టిన్‌, పీచు, సీరం కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంలో తోడ్పడతాయి. విటమిన్లు, పోషకాలు అధికంగా ఉన్న కారణంగా మామిడి పండు తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇందులోని పీచు పదార్థాలు జీర్ణక్రియ బాగా జరగడానికి, సుఖవిరేచనం అవడానికి తోడ్పడుతాయి. అంతేకాకుండా ఈ పీచు అదనపు కేలరీలను దహించడం ఫలితంగా బరువు తగ్గడంలో దోహదం చేస్తుంది. మామిడిలోని తక్కువ గ్లెసిమిక్‌ ఇండెక్స్‌ వల్ల శరీరంలో షుగర్‌స్థాయి పెరగదు. విటమిన్‌-సి, విటమిన్‌-ఎ, పలు రకాల కెరటోనాయిడ్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇందులో అధికంగా ఐరన్‌ ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి దీనివల్ల సహజంగా ఐరన్‌ సమకూరుతుంది. అలాగే శరీరంలో కాల్షియం స్థాయి మెరుగుపడుతుంది.

కంటి సంరక్షణలో, చర్మ సౌందర్యం ఇనుమడింప చేయడంలోనూ మామిడి మేటి. దీనికి కారణం విటమిన్‌-ఎ మామిడిలో సమృద్దిగా ఉండడమే. మంచి కంటిచూపును కలిగించడమే కాకుండా కళ్లు పొడిబారకుండా కాపాడుతుంది. రేచీకటిని నివారిస్తుంది. మామిడి గుజ్జు, పాలు, తేనె కలిపి పేస్టులా తయారు చేసి స్క్రబ్‌లాగా వాడుకోవచ్చు. ఇక చర్మం లేతగా, మృదువుగా మారడం తధ్యం. శరీరంపై స్వేద గ్రంధులు శుభ్రపడి తద్వారా శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్ధీకరిస్తాయి.


మానసికానందాన్నిచ్చే పెరటి పూదోటలు.. PART-1 I Beautiful Blooming Houseplants








మానసికానందాన్నిచ్చే పెరటి పూదోటలు
ప్రకృతి సోయగాలు - పెరటి మొక్కల ఎంపిక ఎలా.. 
Beautiful Blooming Houseplants

హరిత హరివిల్లు -  మన బాధ్యత
Our Responsibility Towards Plants

PC: సాన్వీ

బెల్లీ ఫ్యాట్‌కు.. ఐదు రోజుల్లో చెక్ I How to Get a Flatter Stomach in 5 Days

ఎంసెట్‌ పరీక్ష నేడే.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. I EAMCET Today - One-Minute Late, No-Entry Rule Applies


ఇంజనీరింగ్@10AM
మెడికల్, అగ్రికల్చర్@2:30PM

ఎంసెట్ విద్యార్థులకు కొన్ని సూచనలు:-  
- పరీక్ష సమయానికి వీలైనంత ముందే నిర్ధేశిత కేంద్రానికి చేరుకోవాలి.
- హాలులోనికి గంట ముందు అనుమతిస్తారు.
- నిమిషం ఆలస్యమైనా హాలులోకి అనుమతించరు.
- విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్ తప్పక తీసుకురావాలి.
- పరీక్ష గదిలో ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్‌టికెట్‌పై అభ్యర్థి సంతకం చేయాలి
- ఓఎంఆర్ షీట్‌ పూరించడంలో తగు సూచనలు తప్పనిసరి.
- ఓఎంఆర్ షీట్‌పై ఏ కోడ్ ఉంటే అదే కోడ్ ఉన్న క్వశ్చన్ పేపర్ వచ్చిందో లేదో సరిచూసుకోవాలి.
- పరీక్ష సమయం పూర్తయ్యే వరకు విద్యార్థులను బయటకు అనుమతించరు.


ముల్తాని మట్టి బ్యూటీ I Multani Mitti Face Packs for Glowing Skin I मुल्तानी मिट्टी

జీవిత భీమాతో బతుకు ధీమా! | Social Security Schemes |


 

దేశంలో ప్రజలకు భీమా పట్ల అవగాహన, పేద, మధ్య తరగతి వారికి ధీమా కలిపించడమే ఉద్దేశించిన ప్రధాన మంత్రి జీవిత భీమా పథకాలకు సరిగ్గా రెండు సంవత్సరాల కాలం పూర్తికావస్తోంది. ఏ కారణం చేత మృతిచెందినా నామినీకి 2 లక్షల రూపాయలు అందించే ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి పథకానికి గానూ ఏడాదికి ఒకసారి ఏకమొత్తంలో రూ.330 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి 18 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారు ఎవరైనా అర్హులు. ఇక జీవన్ సురక్ష విషయానికొస్తే ప్రమాదాల కారణంగా ప్రమాదవశాత్తు మరణం సంభవించినా లేదా పూర్తి వైకల్యం కలిగినా రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లిస్తారు. పాక్షిక వైకల్యానికి గురవుతే ఒక లక్ష రూపాయల నష్ట పరిహారాన్ని అందిస్తుంది కూడా. ఈ పథకంలో సభ్యత్వానికి వార్షిక ప్రీమియం కేవలం 12 రూపాయలే. ఇందులో చేరటానికి 18 నుంచి 70 సంవత్సరాల వయసు వారు అర్హులు.

జీవన జ్యోతి, జీవన్ సురక్ష పథకాల్లో చేరడానికి ఏదేని బ్యాంకు పొదుపు ఖాతాదారులకు మాత్రమే అవకాశముంది. సంవత్సర కాలం వ్యవధిగా ఉన్న ఈ భీమా పథకాలు 1 జూన్  నుంచి 31 మే వరకు వర్తిస్తాయి. గతంలో రిజిష్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ పథకాలను రెన్యూవల్ చేసుకోవాడానికి సమయం ఆసన్నమైంది. చాలా బ్యాంకులు మే 26 నుంచి 31వ తేదీల్లో ప్రిమీయం జమ చేసుకుంటారు.  ఈ పథకాల్లో చందాదారులుగా చేరిన సమయంలో అగ్రీమెంట్ ననుసరించే సదరు ప్రీమియం సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుంచి 'ఆటో డెబిట్' అవుతుంది. అందకుని ప్రీమియం మొత్తం మీ ఖాతాలో సకాలంలో ఉండేలా చూసుకోవాలి. పథకాల పునరుద్ధరణలో ఎలాంటి సందేహాలున్నా వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించాలి. ఖాతాదారులు సకాలంలో స్పందించి ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా పథకాలతో ఎంతో ధీమాగా ఉండాలి.

* Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) 
   - Accidental Death, Disability Cover Insurance
   प्रधान मंत्री सुरक्षा बीमा योजना
 

** Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) 
     - Life Insurance
     प्रधान मंत्री जीवन ज्योति बीमा योजना

ఇదేం 'నీట్'.. ఈ దుర్యోదన దుశ్శాసన దుర్వినీతి లోకంలో.. I Remove Bra, No Jeans, Remove Mangalsutra I Dress Code Shocks Students At NEET

వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నేషనల్‌ ఎలిజబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్టు(NEET). ఈ పరీక్షకు హాజరు కావడానికి డ్రెస్‌ కోడ్‌ అమలుతో దేశవ్యాప్తంగా హాజరైన పలువురు అభ్యర్ధులకు దారుణ అనుభవాలు ఎదురయ్యాయి.  ఇది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పాలిటి 'పరీక్షా'కాలం..
 
  
                

మెంతి కూర - ఆరోగ్య ప్రయోజనాలు I Health Benefits of Fenugreek I मेथी I Vendhaya Keerai I வெந்தயம் I ಮೇಥಿ I ഉലുവ





#మెంతి కూర - ఆరోగ్య ప్రయోజనాలు I Health Benefits of Fenugreek I मेथी I Vendhaya Keerai I வெந்தயம் I  ಮೇಥಿ I ഉലുവ

మే 7: ప్రపంచ నవ్వుల దినోత్సవం I Happy World Laughter Day!

  

నవ్వు ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం రోగం.. అన్నారు మన పెద్దలు. నవ్వులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఇంటర్నెట్ లోనో, మొబైల్ ఫోనులోనో జోక్స్ చెప్పుకోవడం అందరికి ఉత్సాహం కలిగిస్తుంది. కార్టూన్లు, హాస్య కథలు చదవడం, టీవీలో కామెడీ బిట్లు చూడడం మానసిక ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడతాయి. చిన్న పిల్లలతో సంభాషణ వల్ల కూడా మానసికొల్లాసం కలుగుతుంది. మనస్పూర్తిగా నవ్వే నవ్వు నలుగురి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. నవ్వు వల్ల మనుషుల మధ్య ఉండే మనస్పర్థలు తొలగిపోతాయి. దానివల్ల పలువురి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది.

సమ్మర్‌ హలీడేస్‌ - పిల్లలకు ఆట విడుపు I స్వామి కార్యం - స్వకార్యం | Summer Holidays

ఇటీవల అష్టలక్ష్మీ దేవాలయం, కొత్తపేట  బ్రహ్మోత్సవాల  కార్యక్రమాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో కూచిపుడి నృత్యాలు చేస్తున్న చిన్నారులు..

  

  

  

  

వాడకం మీకు తెలుసా.. I Toothpaste can do so many things other than cleani...

పెంపుడు జంతువులను ప్రేమించండిలా.. | మే 6: ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం I Pet Animals are Good for Health I Pets Love


కొద్దిపాటి సంరక్షణకే  పెంపుడు జంతువులు ఎలాంటి  ఒడంబడిక లేకుండా ప్రేమని, విశ్వాసాన్నీ మనపై కనబరుస్తాయి.  కుక్క, పిల్లి, చేపలు, పక్షులు - మనం పెంచే  పెట్స్ ఏవైనా వాటిని ప్రేమగా చూసుకోవడం మరవద్దు. వాటిని మనం పట్టించుకుంటున్నామా లేదా అన్న విషయాన్ని ముఖ్యంగా కుక్కలైతే ఇట్టే పట్టేయగలవు. ఒంటరితనాన్ని పారదోలి మనకు చేదోడువాదోడుగా ఉండి సంతోషాన్ని, వ్యయామాన్ని తద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించే పెంపుడు జంతువులపై వారాంతాల్లో, సెలవు రోజుల్లో మరింత శ్రద్ధ వహించాల్సిందే.

- కాస్త సమయాన్ని వెచ్చించి పెంపుడు జంతువుల నివాసాల్ని, ఉపయోగించే వస్తువులను శుభ్రపరచాలి. వాటికి ఇష్టమైతే స్నానం చేయించాలి. విశేషమైన అలంకారాలకు అవి అనుమతిస్తే ఆ ముచ్చటనీ తీర్చుకోవచ్చు.
- పెంపుడు కుక్కని రోజూకంటే కాస్త ఎక్కువ నడకకు తీసుకెళ్లాలి. అదీ కొత్త ప్రాంతం అయితే మరీ మంచిది. ఇలా చేయడం వల్ల 'స్వామికార్యం-స్వకార్యం' చందంగా దానితో పాటూ మనకి మానసికొల్లాసం కలుగుతుంది.
- కుందేలు, చేపలు, పక్షులు -ఇలా ఏ పెట్స్ నైనా కాస్త విశాలంగా తిరుగాడే సౌకర్యాన్ని కలిగించాలి.
- ఎప్పటిలాగానే కాకుండా సెలవు దినాల్లో కొంగ్రొత్త పదార్ధాలతో విందు ఏర్పటుచేయాలి.
- మార్కెట్ లో లభించే వివిధరకాలైన ఆటబొమ్మలు, వాటి పెంపకంలో అవసరమయ్యే వస్తువులు, విడిభాగాలు కొనిపెట్టి వాటిని మచ్చిక చేసుకోవాలి.
- వాటిని ఎప్పుడూ కొట్టడం, తిట్టడం కాకుండా సరియైన ప్రవర్తన, శిక్షణతో మెలిగేలా చూసుకోవాలి.

అంత అల్లారుముద్దుగా పెంచుకునే జంతువులకు ముందు జాగ్రత్తగా టీకామందులు వేయించడం, క్రమం తప్పకుండా వాటిని పశు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళడం మరవద్దు.

చిటికెలో... 44 I Amazing Health Benefits and Uses of Jamun Fruit I Black...

ముఖ్యమైన దినోత్సవాలు I Important National and International Days and Dates | vantintichitkalu | వంటింటిచిట్కాలు

ముఖ్యమైన దినోత్సవాలు
 

జనవరి
జనవరి 1: రహదారి భద్రతా దినోత్సవం
జనవరి 1: గ్లోబల్ ఫ్యామిలీ డే
జనవరి 1: సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం
జనవరి 2: ప్రపంచ శాంతి దినోత్సవం
జనవరి 3: మహిళా టీచర్స్ డే
జనవరి 4: వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం - లూయీస్ బ్రెయిలీ జయంతి
జనవరి 5: సైనిక దినోత్సవం
జనవరి 9: ప్రవాస భారతీయ దివస్ - 1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కి వచ్చిన రోజు
జనవరి 10: ప్రపంచ నవ్వుల దినోత్సవం - చార్లీచాప్లిన్ జన్మదినం
జనవరి 11: జాతీయ విద్యాదినోత్సవం
జనవరి 12: జాతీయ యువజన దినోత్సవం - స్వామీ వివేకానంద జయంతి
జనవరి 15: వరల్డ్ రిలిజియన్ దినోత్సవం
జనవరి 15: సైనిక దినోత్సవం
జనవరి 17: ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం | ఎన్నికల సంఘం స్థాపక దినోత్సవం
జనవరి 21: మణిపూర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం
జనవరి 21: మేఘాలయ రాష్ట్ర అవతరణ దినోత్సవం
జనవరి 21: త్రిపుర రాష్ట్ర అవతరణ దినోత్సవం
జనవరి 23: సుభాష్‌చంద్రబోస్ జయంతి
జనవరి 23: దేశభక్తి దినోత్సవం
జనవరి 25: జాతీయ ఓటర్ల దినోత్సవం
జనవరి 25: ఇండియా టూరిజం దినోత్సవం
జనవరి 25: ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవం
జనవరి 26: ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవం
జనవరి 29: జాతీయ పత్రికా దినోత్సవం
జనవరి 30: అమరవీరుల సంస్మరణ దినం
జనవరి 30: గాంధీజీ వర్థంతి
జనవరి 30: కుష్టువ్యాధి నివారణ దినోత్సవం
జనవరి 31: వీధి బాలల దినోత్సవం

ఫిబ్రవరి
ఫిబ్రవరి 1: భారత తీర రక్షక దళ దినోత్సవం
ఫిబ్రవరి 1: అంతర్జాతీయ మరణశిక్ష వ్యతిరేక దినోత్సవం
ఫిబ్రవరి 3: జాతీయ రక్షణ దినోత్సవం
ఫిబ్రవరి 2: వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం | ప్రపంచ చిత్తడి నెలల దినోత్సవం
ఫిబ్రవరి 4: వరల్డ్ క్యాన్సర్ డే
ఫిబ్రవరి 4: జాతీయ భద్రతా దినోత్సవం
ఫిబ్రవరి 4: శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవం
ఫిబ్రవరి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఫిబ్రవరి 11: ప్రపంచ వివాహ దినోత్సవం
ఫిబ్రవరి 12: జాతీయ ఉత్పాదనా దినోత్సవం
ఫిబ్రవరి 12: గులాబీల దినోత్సవం
ఫిబ్రవరి 14: ఇంటర్ నేషనల్ కండోమ్ డే
ఫిబ్రవరి 14: ప్రేమికుల దినోత్సవం
ఫిబ్రవరి 20: పిచ్చుకల దినోత్సవం
ఫిబ్రవరి 20: మిజోరామ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం
ఫిబ్రవరి 20: అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం
ఫిబ్రవరి 21: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ఫిబ్రవరి 22: ప్రపంచ స్కౌట్ దినోత్సవం
ఫిబ్రవరి 22: కవలల దినోత్సవం
ఫిబ్రవరి 24: సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం
ఫిబ్రవరి 25: జాతీయ సైన్స్ దినోత్సవం
ఫిబ్రవరి 27: ప్రపంచ నాటక దినోత్సవం
ఫిబ్రవరి 28: జాతీయ సైన్సు దినోత్సవం – రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ

మార్చి 
మార్చి 4: జాతీయ భద్రతా దినోత్సవం
మార్చి 5: అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం
మార్చి 5: ప్రపంచ బధిరుల దినం
మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినం | ప్రపంచ మహిళల దినోత్సవం
మార్చి 9: వరల్డ్ కిడ్నీ డే
మార్చి 10: కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాల డే
మార్చి 15: ప్రపంచ పౌర హక్కుల దినం
మార్చి 15: జాతీయ వినియోగదారుల దినం
మార్చి 18: మానవ హక్కుల దినం
మార్చి 20: సాంఘిక సాధికారత స్మారక దినం
మార్చి 21: అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం
మార్చి 21: ప్రపంచ అటవీ దినం
మార్చి 21: ప్రపంచ అంగ వికలుర దినం
మార్చి 21: ప్రపంచ కవితా దినం
మార్చి 22: ప్రపంచ జల దినోత్సవం
మార్చి 23: అమర వీరుల దినోత్సవం
మార్చి 24: సెంట్రల్ ఎక్సైజ్ డే
మార్చి 24: ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినం
మార్చి 26: బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవం
మార్చి 27: అంతర్జాతీయ నాటక దినోత్సవం
మార్చి 28: నేషనల్ షిప్పింగ్ దినోత్సవం

మార్చి రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం
ఆఖరి శనివారం - ప్రపంచ వాతావరణ దినోత్సవం | Earth Hour

ఏప్రిల్
ఏప్రిల్ 1: ఒరిస్సా రాష్ట్ర అవతరణ దినోత్సవం
ఏప్రిల్ 2: పోలీస్ పతాక దినం
ఏప్రిల్ 2: అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
ఏప్రిల్ 5: నేషనల్ మారిటైమ్ డే
ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య దినం
ఏప్రిల్ 8: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినం
ఏప్రిల్ 10: ప్రపంచ హోమియోపతి డే
ఏప్రిల్ 12: ప్రపంచ రోదసీ దినోత్సవం
ఏప్రిల్ 13: జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవం
ఏప్రిల్ 14: అగ్నిమాపక దినోత్సవం
ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 14: మహిళా పొదుపు దినోత్సవం
ఏప్రిల్ 15: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం
ఏప్రిల్ 16: తెలుగు రంగస్థల దినోత్సవం
ఏప్రిల్ 17: ప్రపంచ హిమోఫిలియా దినం
ఏప్రిల్ 18: ప్రపంచ సాంస్కృతిక దినం
ఏప్రిల్ 21: జాతీయ సమాచార హక్కుల దినం
ఏప్రిల్ 21: జాతీయ పబ్లిక్ రిలేషన్స్ దినం | జాతీయ పౌర సేవల దినోత్సవం | సివిల్ సర్వీసెస్ దినోత్సవం
ఏప్రిల్ 22: ప్రపంచ ధరిత్రి దినోత్సవం
ఏప్రిల్ 23: ప్రపంచ పుస్తకాల దినోత్సవం
ఏప్రిల్ 24: పంచాయతి రాజ్ దినోత్సవం
ఏప్రిల్ 25: ప్రపంచ మలేరియా దినం
ఏప్రిల్ 26: సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం
ఏప్రిల్ 26: ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం
ఏప్రిల్ 28: ప్రపంచ భద్రతా దినోత్సవం
ఏప్రిల్ 28: ప్రపంచ పశుచికిత్సా దినం
ఏప్రిల్ 29: అంతర్జాతీయ నృత్య దినోత్సవం
ఏప్రిల్ 30: బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం | బాలకార్మికుల దినోత్సవం

మే
మే 1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
మే 1: మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం
మే 1: గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవం
మే 3: ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినోత్సవం
మే 4: బొగ్గు గని కార్మిక దినోత్సవం
మే 5: వరల్డ్ అథ్లెటిక్స్ దినోత్సవం
మే 5: అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం
మే 6: ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం
మే 7: ఠాగూర్ జయంతి
మే 8: ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
మే 11: జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం
మే 12: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
మే 12: అంతర్జాతీయ వలస పక్షుల దినం
మే 15: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
మే 17:  వరల్డ్ హైపర్ టెన్సన్ డే | ప్రపంచ అధిక రక్తపోటు దినం
మే 17: ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం
మే 18: ఇంటర్నేషనల్ మ్యూజియమ్స్ డే
మే 21: అంతర్జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం - రాజీవ్‌గాంధీ వర్థంతి
మే 21: ప్రపంచ విభిన్న సంస్కృతుల దినోత్సవం
మే 22: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
మే 24:  కామన్వెల్త్ దినోత్సవం
మే 27: నెహ్రూ వర్థంతి
మే 29: మౌంట్ ఎవరెస్ట్ దినోత్సవం
మే 29: అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం | అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతిస్థాపన దినోత్సవం
మే 30: గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం
మే 30: యు.ఎస్. స్ట్ఫా దినోత్సవం
మే 31: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

మే మొదటి ఆదివారం - నవ్వుల దినోత్సవం
మే తొలి మంగళవారం - ప్రపంచ ఆస్తమా దినోత్సవం
మే రెండో శనివారం - ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య దినోత్సవం
మే రెండవ ఆదివారం - ఇంటర్నేషనల్ మదర్స్ డే | అంతర్జాతీయ మాతృదినోత్సవం

జూన్ 
జూన్ 1: అంతర్జాతీయ బాలల దినోత్సవం
జూన్ 1: ప్రపంచ పాల దినోత్సవం
జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
జూన్ 4: అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం | అణచివేతకు గురైన బాలల దినోత్సవం
జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం
జూన్ 8: ప్రపంచ సముద్ర దినోత్సవం
జూన్ 12: ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం
జూన్ 14: పతాక దినోత్సవం
జూన్ 18: గోవా స్వాతంత్య్ర దినోత్సవం
జూన్ 20: మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం
జూన్ 20: ప్రపంచ శరణార్థుల దినోత్సవం
జూన్ 21: ప్రపంచ సంగీత దినోత్సవం
జూన్ 21: ప్రపంచ యోగా దినోత్సవం
జూన్ 23: ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం
జూన్ 25: ప్రపంచ అవయవ దాన, మార్పిడి దినోత్సవం
జూన్ 26: ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం
జూన్ 28: పేదల దినోత్సవం - పీవీ నర్సింహారావు జయంతి
జూన్ 29: జాతీయ గణాంక దినోత్సవం
జూన్ 30: ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం

జూన్ మూడో ఆదివారం - ఫాదర్స్ డే | తండ్రుల దినోత్సవం

జూలై 
జూలై 1: వైద్యుల దినోత్సవం - డా. బీసీ రాయ్ జయంతి
జూలై 1: వాస్తు దినోత్సవం | ఆర్కిటెక్ డే
జూలై 1:  ప్రపంచ వ్యవసాయ దినోత్సవం
జూలై 1: వన మహోత్సవ వారోత్సవాలు జూలై 1నుండి జూలై 7 వరకు
జూలై 2: ప్రపంచ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవం
జూలై 5: అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం
జూలై 6: ప్రపంచ రేబిస్ దినోత్సవం
జూలై 11: ప్రపంచ జనాభా దినోత్సవం
జూలై 12: నాబార్డ్ స్థాపక దినోత్సవం
జూలై 17: పాఠశాలల భద్రత దినోత్సవం
జూలై 17: అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
జూలై 26: కార్గిల్ విజయోత్సవ దినం | కార్గిల్ విజయ్ దివస్
జూలై 29: ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డే

జూలై తొలి శనివారం - అంతర్జాతీయ సహకార దినోత్సవం

జూలై నాలుగో ఆదివారం - పేరెంట్స్ డే

ఆగస్ట్
ఆగస్టు 1: తల్లిపాల దినోత్సవం
ఆగస్టు 2: ఆంగ్లో ఇండియన్ దినోత్సవం
ఆగస్టు 6: హిరోషిమా దినోత్సవం
ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవం
ఆగస్టు 8: క్విట్ ఇండియా దినోత్సవం
ఆగస్టు 9: నాగసాకి దినోత్సవం
ఆగస్టు 10: డెంగ్యూ వ్యాధి నిర్మూలన దినం
ఆగస్టు 12: లైబ్రేరియన్స్ డే
ఆగస్టు 12: ప్రపంచ యువజన దినోత్సవం
ఆగస్టు 13: లెఫ్ట్‌హ్యాండర్స్ డే
ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 15: పశ్చిమ బెంగాల్ దినోత్సవం
ఆగస్టు 16: ప్రత్యక్ష కార్యాచరణ దినం | డైరెక్ట్ యాక్షన్ డే | గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్
ఆగస్టు 18: అంతర్జాతీయ స్వదేశీవాదుల దినం
ఆగస్టు 19: ప్రపంచ ఫొటోగ్రఫీ దినం
ఆగస్టు 20: సద్భావన దినం - రాజీవ్ గాంధీ జయంతి
ఆగస్టు 20: మలేరియా నివారణ దినం | ప్రపంచ దోమ దినోత్సవం
ఆగస్టు 24: సంస్కృత దినోత్సవం
ఆగస్టు 26: మహిళల సమానత్వం దినం
ఆగస్టు 29: జాతీయ క్రీడల దినోత్సవం – ధ్యాన్ చంద్ జయంతి
ఆగస్టు 29: తెలుగు భాష దినోత్సవం
ఆగస్టు 29: జాతీయ క్రీడా దినోత్సవం

ఆగస్టు 1వ ఆదివారం - ఫ్రెండ్‌షిప్ డే | స్నేహితుల రోజు

సెప్టెంబర్
సెప్టెంబర్ 1: పోషక పదార్థాల వారోత్సవం
సెప్టెంబర్ 2: కొబ్బరికాయల దినోత్సవం
సెప్టెంబర్ 4: అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం (ఆంధ్రప్రదేశ్)
సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ దినం- రాధాకృష్ణన్ జన్మదినం
సెప్టెంబర్ 8: ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం
సెప్టెంబర్ 9: వరల్డ్ ఫస్ట్‌ఎయిడ్ డే
సెప్టెంబర్ 10: హర్యానా రాష్ట్ర అవతరణ దినోత్సవం
సెప్టెంబర్ 10: పంజాబ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం
సెప్టెంబర్ 14: హిందీ దినోత్సవం
సెప్టెంబర్ 15: ఇంజినీర్స్ దినోత్సవం
సెప్టెంబర్ 15: సంచాయక దినోత్సవం
సెప్టెంబర్ 16: ప్రపంచ శాంతి దినోత్సవం
సెప్టెంబర్ 16: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం
సెప్టెంబర్ 17: మహిళల మైత్రీ దినోత్సవం
సెప్టెంబర్ 20: రైల్వే భద్రతాదళ వ్యవస్థాపక దినం
సెప్టెంబర్ 21: బయోస్ఫియర్ దినం
సెప్టెంబర్ 21: అంతర్జాతీయ శాంతి, అహింస దినోత్సవం
సెప్టెంబర్ 21: ప్రపంచ అల్జిమర్స్ దినోత్సవం
సెప్టెంబర్ 22: క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం
సెప్టెంబర్ 22: గులాబీల దినోత్సవం
సెప్టెంబర్ 24: ప్రపంచ నదుల దినోత్సవం
సెప్టెంబర్ 24: ఎన్.ఎస్.ఎస్. దినోత్సవం.
సెప్టెంబర్ 26: చెవిటి వారి దినోత్సవం
సెప్టెంబర్ 27: ప్రపంచ పర్యాటక దినోత్సవం
సెప్టెంబర్ 28: అంతర్జాతీయ సమాచార హక్కుల దినం
సెప్టెంబర్ 28: ప్రపంచ నదుల దినోత్సవం
సెప్టెంబర్ 29: వరల్డ్ హార్ట్ డే | ప్రపంచ హృదయ దినోత్సవం

సెప్టెంబర్ 4వ ఆదివారం - కూతుళ్ల దినోత్సవం

అక్టోబర్

అక్టోబర్ 1: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం
అక్టోబర్ 1: వన్యప్రాణి వారోత్సవాలు
అక్టోబర్ 1: జాతీయ తపాలా దినోత్సవం
అక్టోబర్ 1: స్వచ్ఛంద రక్తదాన దినం
అక్టోబర్ 1: అంతర్జాతీయ సంగీత దినోత్సవం
అక్టోబర్ 1: ప్రపంచ ఆవాస దినోత్సవం
అక్టోబర్ 2: మానవ హక్కుల పరిరక్షణ దినం
అక్టోబర్ 2: గాంధీ జయంతి
అక్టోబర్ 2: గ్రామ్‌స్వరాజ్ డే
అక్టోబర్ 2: ఖైదీల దినోత్సవం
అక్టోబర్ 2: ప్రపంచ జంతువుల దినోత్సవం
అక్టోబర్ 4: ప్రపంచ జంతు సంక్షేమ దినం
అక్టోబర్ 5: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం
అక్టోబర్ 6: ప్రపంచ గృహవసతి దినం
అక్టోబర్ 8: భారత వాయుసేన దినోత్సవం
అక్టోబర్ 8: రాపిడ్ యాక్షన్ దళాల అవతరణ దినోత్సవం
అక్టోబర్ 9: ప్రపంచ పోస్టల్ దినోత్సవం
అక్టోబర్ 9: న్యాయ సేవా దినం
అక్టోబర్ 9: జాతీయ ప్రాదేశిక సైనిక దినోత్సవం
అక్టోబర్ 10: ప్రపంచ మానసిక ఆరోగ్య దినం
అక్టోబర్ 11: జాతీయ బాలికా దినోత్సవం
అక్టోబర్ 14: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
అక్టోబర్ 15: అంతర్జాతీయ అంధుల ఆసరా దినం
అక్టోబర్ 15: గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే
అక్టోబర్ 15: ప్రపంచ కవిత్వ దినం
అక్టోబర్ 16: ప్రపంచ ఆహార దినం
అక్టోబర్ 17: అంతర్జాతీయ దారిద్ర నిర్మూలన దినోత్సవం
అక్టోబర్ 21: పోలీస్ సంస్మరణ దినం
అక్టోబర్ 23: అంతర్జాతీయ పాఠశాల గ్రంథాలయ దినోత్సవం
అక్టోబర్ 24: ఐక్యరాజ్యసమితి దినోత్సవం
అక్టోబర్ 24: ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం
అక్టోబర్ 24: ఇండో-టిబెటియన్ సరిహద్దు దళాల అవతరణ దినోత్సవం
అక్టోబర్ 27: పదాతిదళ దినోత్సవం | ఇన్ఫాంట్రీ డే | శిశుదినోత్సవం
అక్టోబర్ 28: అత్తవార్ల దినోత్సవం
అక్టోబర్ 30: ప్రపంచ పొదుపు దినోత్సవం
అక్టోబర్ 31: జాతీయ సమైక్యత దినోత్సవం
అక్టోబర్ 31: జాతీయ పునరంకిత దినం
అక్టోబర్ 31: ఇందిరాగాంధీ వర్ధంతి

అక్టోబర్  మొదటి శుక్రవారం - వరల్డ్ స్మైల్ డే |  ప్రపంచ నవ్వుల దినోత్సవం
అక్టోబర్ రెండో గురువారం - ప్రపంచ దృష్టి దినోత్సవం
అక్టోబర్ రెండో శుక్రవారం - ప్రపంచ గుడ్డు దినోత్సవం

నవంబర్
నవంబర్ 1: ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
నవంబర్ 1: కర్నాటక  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
నవంబర్ 1: హర్యానా  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
నవంబర్ 1: కేరళ  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
నవంబర్ 1: మధ్యప్రదేశ్  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
నవంబర్ 1: పంజాబ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
నవంబర్ 1: గర్వాల్ రైఫిల్ దినం
నవంబర్ 7: ఎన్.టి.పి.సి. స్థాపన దినోత్సవం
నవంబర్ 7: బాలల సంరక్షణ దినం
నవంబర్ 8: వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే
నవంబర్ 9: లీగల్ సర్వీసెస్ దినం
నవంబర్ 9: ప్రపంచ నాణ్యతా దినోత్సవం
నవంబర్ 10: రవాణా దినం
నవంబర్ 11: వెటరన్స్ డే
నవంబర్ 11: జాతీయ విద్యా దినోత్సవం
నవంబర్ 14: ప్రపంచ మధుమేహ దినోత్సవం
నవంబర్ 14: ప్రపంచ బాలబాలికల దినోత్సవం
నవంబర్ 14: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
నవంబర్ 14: జాతీయ పుస్తక వారోత్సవాలు
నవంబర్ 14: సహకార సంఘాల వారోత్సవాలు
నవంబర్ 17: ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం
నవంబర్ 17: అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం
నవంబర్ 19: ప్రపంచ సాంస్కృతిక
నవంబర్ 19: వారసత్వ దినం
నవంబర్ 19: పౌరుల దినోత్సవం
నవంబర్ 20: యూనివర్సల్ చిల్డ్రన్స్ డే
నవంబర్ 21: ప్రపంచ మత్స్య పరిశ్రమ దినం
నవంబర్ 21: ప్రపంచ టెలివిజన్ దినం
నవంబర్ 25: అంతర్జాతీయ స్ర్తిలపై జరిగే అకృత్యాల వ్యతిరేక దినం
నవంబర్ 25: జాతీయ జంతు సంక్షేమ దినం
నవంబర్ 25: ఎన్‌సిసి దినోత్సవం
నవంబర్ 26: జాతీయ న్యాయ దినోత్సవం
నవంబర్ 26: సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం
నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవం
నవంబర్ 26: జాతీయ పాల దినోత్సవం

డిసెంబర్ 
డిసెంబర్ 1: ప్రపంచ ఎయిడ్స్ దినం
డిసెంబర్ 1: నాగాలాండ్ దినోత్సవం
డిసెంబర్ 1: సరిహద్దు భద్రత దళ ఏర్పాటు దినోత్సవం
డిసెంబర్ 2: ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం
డిసెంబర్ 4: భారత నౌకాదళ దినోత్సవం | జాతీయ నౌకాదళ దినోత్సవం
డిసెంబర్ 5: అంతర్జాతీయ వాలంటీర్స్ దినం
డిసెంబర్ 6: పౌర రక్షణ దినం
డిసెంబర్ 7: సైనికదళాల పతాక దినం
డిసెంబర్ 7: అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం
డిసెంబర్ 8: హోమ్‌గార్డ్స్ ఏర్పాటు దినోత్సవం
డిసెంబర్ 8: జలాంతర్గాముల దినోత్సవం
డిసెంబర్ 9: జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం
డిసెంబర్ 10: అంతర్జాతీయ మానవ హక్కుల దినం
డిసెంబర్ 10: ప్రపంచ జంతువుల హక్కుల దినం
డిసెంబర్ 11: యునిసెఫ్ దినోత్సవం
డిసెంబర్ 11: అంతర్జాతీయ పర్వత దినోత్సవం
డిసెంబర్ 12: అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం
డిసెంబర్ 14: జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
డిసెంబర్ 15: ఇంటర్నేషనల్ టీ డే
డిసెంబర్ 17: పెన్షనర్స్ డే
డిసెంబర్ 18: అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
డిసెంబర్ 18: మైనారిటీ హక్కుల దినం (భారతదేశం)
డిసెంబర్ 19: గోవా విముక్తి దినోత్సవం
డిసెంబర్ 22: ప్రపంచ గణిత దినం
డిసెంబర్ 23: కిసాన్ దినోత్సవం
డిసెంబర్ 24: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
డిసెంబర్ 18: సెంట్రల్ ఎక్సైజ్ డే
డిసెంబర్ 26: జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
డిసెంబర్ 31: వరల్డ్ స్పిరిట్యువల్ డే

సురక్షితమైన విద్యుత్ వినియోగం ఇలా.. I Tips for Using Electrical Appliances I How to Measure Home Power Usage I Electrical Shock & Fire Hazard Safety

మే 1 నుంచి 7 వరకు  విద్యుత్‌ భద్రతా వారోత్సవాలు సందర్భంగా..


చార్జింగ్  పెట్టి మొబైల్ మాట్లాడడం, పాటలు వినడం, ల్యాప్ టాప్ వొళ్ళో పెట్టుకుని పనిచేసుకోవడం, స్విచ్ ఆఫ్ చేయకుండా పవర్ అడాప్టర్లను తొలగించడం, చార్జర్లను అలాగే ప్లగ్ పయింట్ లకే వదిలేయడం... ఇలాంటివన్నీ ఎంత ప్రమాదకరమో తెలియంది కాకపోయినా నేడు పిల్లాపెద్దా అందరికి అలవాటయిపోయింది. ఎవరైనా హెచ్చరించినా నిర్లక్ష్యంగా నవ్వుతూ 'తప్పదండి..' అంటారే కానీ 'తప్పు' తెలుసుకోరు. సోషల్ మీడియాలో వీటి ఫలితంగా సంభవించిన దుర్ఘటనలకు 'లైక్'లు కొట్టడం, 'షేర్'లు చేయడం వరకే కాకుండా నేటి యువత విద్యుత్,విద్యుత్కణ పరికరాల వినియోగంలో తమవంతు జాగ్రత్తలు అవసరమని గుర్తించాలి.

ప్రతిరోజూ దినపత్రికల్లో సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ లేదా చార్జింగులో పెట్టిన ఫోను తీస్తూ, టీవీ ఆన్ చేస్తూ విద్యుత్ షాక్ తగిలి మృత్యువాత పడ్డారని, అధిక విద్యుత్ ప్రవాహంతో టీవీ, ఫ్రిజ్, ఏసి అన్నీ కాలిపోయాయని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదాలతో ఆస్థి, ప్రాణనష్టం జరిగాయని చదువుతాం. కానీ వాటిపై దృష్టి సారించం. ఎందుకు ఇలా జరిగిందో ఆలోచిస్తే విద్యుత్ వినియోగం ఎంత సౌకర్యమో అంత ప్రమాదభరితమని అర్థం అవుతుంది.  సాంకేతికతో పోటీపడుతూ మానవుడికి ఎలక్ట్రిక్, ఎలాక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగింది. విద్యుత్ వాడకంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సరఫరాలో అంతరాయాలే కాకుండా ప్రాణాంతక ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. లోపభూయిష్టమైన విద్యుత్ వైరింగ్, ఇన్సులేషను సరిగాలేని, తడిసిన స్విచ్ లు, ప్లగ్ లు - ఇతర విద్యుత్ గృహోపకరణాల వల్ల విద్యుదాఘాతాలు, ఆస్థినష్టాలు సంభవిస్తాయి. గృహావసరాలకు అనుభవంలేని ఎలక్ట్రీషియన్లు విద్యుత్ వైరింగ్ చేయడం వల్ల, నాణ్యమైన పరికరాలు వాడక పోవడం వల్ల తరచూ షార్ట్ సర్క్యూట్ కు దారితీసి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇళ్లలో సరైన ఎర్తింగ్ లేకపోవడం, అవసరమైనచోట వోల్టేజి స్టెబ్లైజర్ వాడకపోవడం మూలంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద న్యూట్రల్ విఫలం కావడం, ఎర్తింగ్ సరిగా లేకపోవడంతో హై వోల్టేజీ విద్యుత్ సరఫరా అయి ప్రమాదాలు సంభవిస్తాయి. మరోపక్క నాణ్యత లేని పవర్ అడాప్టర్, చార్జర్, బ్యాటరీలు వినియోగించడం వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. చార్జర్ను ప్లగ్లో పెట్టినప్పుడు ఏసీ కరెంటు , డీసీగా మారాలి. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో అందులోని సర్క్యూట్ విఫలమై నేరుగా విద్యుత్ సరఫరా అయి ప్రమాదం జరుగుతుంది. విద్యుత్ తీగలకు ముడులు వేయడం, స్విచ్బోర్డు సరిగా లేకపోవడం వల్ల కూడా విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. ఇళ్లలో ఎర్తింగ్ ను తప్పనిసరిగా చేసుకోవాలి. మొక్కుబడిగా ఎర్తింగ్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా ప్రమాదాలకు నెలవుగా మారుతుంది. సరియైన ఎర్తింగ్ మాత్రమే విద్యుత్ షాక్ తగలకుండా ఉండడంతోపాటు ప్రాణాలు కోల్పోకుండా నియంత్రిస్తుంది. ఎర్తింగ్ కనెక్షన్ తప్పనిసరిగా టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్  ఇతర గృహోపకరణాల పవర్ ప్లగ్లకు ఉండేలా చూసుకోవాలి. ఎక్కడ హైవోల్టేజీ విద్యుత్ సరఫరా జరిగినా ఎర్తింగ్ ద్వారా గ్రౌండ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా విద్యుత్ షాక్, విద్యుత్ ఉపకరణాలు కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.

మరిన్ని జాగ్రత్తలు...
- విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండడానికి, ఎలాంటి ప్రమాదాలకు తావులేని వైరింగ్ పద్ధతులను అవలంభించాలి. హౌజ్ వైరింగ్ చేసే విధానం ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ కు అనుగుణంగా ఉండాలి. సూర్యరశ్మి, వర్షం, తేమ లాంటి వాతావరణ పరిస్థితులకు తట్టుకుని ఎక్కువకాలం మన్నేవిధంగా విద్యుత్ తీగలను ఎన్నుకోవాలి. రాపిడి వల్ల కాని, దెబ్బలనుండి కాని చెక్కుచెదరని ఇన్సులేషన్ కలగి ఉండాలి. 
- అయిదు ఆంపియర్లకు మించిన ఫ్యూజ్ లను విద్యుత్ దీపాల సర్క్యూట్ లో వాడకూడదు.
- సర్క్యూట్ లోని స్విచ్ లన్నింటినీ విద్యుత్ ప్రవహించే (ఫేజ్) వైరులోనే బిగించాలి.
- ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు పిల్లలకు అందనంత ఎత్తులో ఉండాలి.
- వైర్లు కిందకి వెళ్లాడకుండా చూసుకోవడమే కాక, చైల్డ్ సేఫ్టీ బ్లాంకింగ్ ప్లగ్  లని వాడుకోవాలి.
- ఆల్టర్ నేటివ్ కరంట్, డైరక్ట్ కరంట్ సర్క్యూట్ లను విధిగా వేరుగా ఉండేలా చూసుకోవాలి.
- ఒక ప్లగ్ పాయింట్ వద్ద ఒకే ఉపకరణం వాడాలి. ఎక్కువగా వాడితే వేడి అతిగా పెరిగి అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి.
- రెండు వేర్వేరు సబ్ సర్క్యూట్ లను ఏర్పాటు చేసుకుని లోడ్ డిస్ట్రిబ్యూషన్ సమానంగా ఉండేలా చూసుకోవాలి.
- సరియైన ఎర్తింగ్ పద్ధతిలో భాగంగా ప్లగ్ లు, సాకెట్లు తప్పకుండా మూడు పిన్నులు కలవి వాడుకోవాలి.
- గృహవిద్యత్ మొత్తం సరఫరా నిలిపేందుకు మేయిన్ స్విచ్ ను ప్రవేశద్వారం దగ్గర బిగించుకోవాలి.
- ఐ ఎస్ ఐ మార్కుగల, నాణ్యమైన విద్యుత్ పరికరాలను మాత్రమే వాడాలి.
- నాణ్యతగల ఫ్యూజ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డును మెయిన్ బోర్డుకు దగ్గరలోనే అమర్చాలి. ప్రతి విద్యుత్ ప్రసారానికి ఒక కటౌట్ ఉండాలి. 
- మెయిన్ స్విచ్ లు, మీటరు మిగతా వైరింగు ఇంట్లో ఉపయోగించే లోడును భరించగలిగేవగా ఉండాలి. 

ఈ జాగ్రత్తలతో పాటూ విద్యుత్ వినియోగదారుడికి, సరఫరాదారుడికి విద్యుత్ రూల్స్ 1956 ప్రకారం 'ప్రమాదాలు' 'విద్యుత్ అంతరాయం' విషయాల్లో సమాన బాధ్యతలున్నాయని గమనించండి. వినియోగదారుడు ఏ విషయాన్ని గురించైనా విద్యుత్ బోర్డు వారిని వెంటనే సంప్రదించవచ్చు. నిర్లక్ష్యం తగదు.