దేశంలో ప్రజలకు భీమా పట్ల అవగాహన, పేద, మధ్య తరగతి వారికి ధీమా కలిపించడమే ఉద్దేశించిన ప్రధాన మంత్రి జీవిత భీమా పథకాలకు సరిగ్గా రెండు సంవత్సరాల కాలం పూర్తికావస్తోంది. ఏ కారణం చేత మృతిచెందినా నామినీకి 2 లక్షల రూపాయలు అందించే ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి పథకానికి గానూ ఏడాదికి ఒకసారి ఏకమొత్తంలో రూ.330 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి 18 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారు ఎవరైనా అర్హులు. ఇక జీవన్ సురక్ష విషయానికొస్తే ప్రమాదాల కారణంగా ప్రమాదవశాత్తు మరణం సంభవించినా లేదా పూర్తి వైకల్యం కలిగినా రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లిస్తారు. పాక్షిక వైకల్యానికి గురవుతే ఒక లక్ష రూపాయల నష్ట పరిహారాన్ని అందిస్తుంది కూడా. ఈ పథకంలో సభ్యత్వానికి వార్షిక ప్రీమియం కేవలం 12 రూపాయలే. ఇందులో చేరటానికి 18 నుంచి 70 సంవత్సరాల వయసు వారు అర్హులు.
జీవన జ్యోతి, జీవన్ సురక్ష పథకాల్లో చేరడానికి ఏదేని బ్యాంకు పొదుపు ఖాతాదారులకు మాత్రమే అవకాశముంది. సంవత్సర కాలం వ్యవధిగా ఉన్న ఈ భీమా పథకాలు 1 జూన్ నుంచి 31 మే వరకు వర్తిస్తాయి. గతంలో రిజిష్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ పథకాలను రెన్యూవల్ చేసుకోవాడానికి సమయం ఆసన్నమైంది. చాలా బ్యాంకులు మే 26 నుంచి 31వ తేదీల్లో ప్రిమీయం జమ చేసుకుంటారు. ఈ పథకాల్లో చందాదారులుగా చేరిన సమయంలో అగ్రీమెంట్ ననుసరించే సదరు ప్రీమియం సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుంచి 'ఆటో డెబిట్' అవుతుంది. అందకుని ప్రీమియం మొత్తం మీ ఖాతాలో సకాలంలో ఉండేలా చూసుకోవాలి. పథకాల పునరుద్ధరణలో ఎలాంటి సందేహాలున్నా వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించాలి. ఖాతాదారులు సకాలంలో స్పందించి ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా పథకాలతో ఎంతో ధీమాగా ఉండాలి.

* Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)
- Accidental Death, Disability Cover Insurance
प्रधान मंत्री सुरक्षा बीमा योजना
** Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)

- Life Insurance
प्रधान मंत्री जीवन ज्योति बीमा योजना
प्रधान मंत्री जीवन ज्योति बीमा योजना
No comments:
Post a Comment