రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. | తొలకరి వచ్చేస్తోంది.. | Why Does First Rain Smell Sweet?


ఈ నెల 30, 31వ తేదీ కల్లా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం నెలకొన్నందున అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుగానే కేరళను తాకుతాయని నిపుణులు అంచనావేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండతీవ్రత, వడగాడ్పులు కొనసాగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ వాతావరణం మరో నాలుగు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది.

సాధారణంగా మే 30,31 ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకి తదనంతరం ఏపిలోకి ప్రవేశిస్తాయి. ఇక తొలకరి వర్షాలు రాగానే రైతులు పూర్తి స్థాయిలో ఏరువాకలో నిమగ్నం అవుతారు.




No comments: