జూన్ 21: ప్రపంచ సంగీత దినోత్సవం | వరల్డ్ మ్యూజిక్ డే | World Music Day


'సంగీత దినోత్సవం' మొదటగా ఫ్రాన్స్ లో 1982 వ సంవత్సరం జూన్ 21న ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఇదే రోజున ప్రపంచ దేశాల్లో సంగీత ప్రియులు ఇలా 'మ్యూజిక్ డే'ని జరుపుకుంటున్నారు.

మన దేశంలో శాస్త్రీయ సంగీతానికి మక్కువ ఎక్కువ. అలాగే పాశ్చాత్య సంగీతాలైన పాప్, రాక్, వెస్ట్రన్ మ్యూజిక్ వగైరాలను  కూడా నేటి యువతరం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సంగీతం ఏదైనా ఇవన్నీ సంగీత ప్రియులను మైమరిపిస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. హ్యప్పీ వరల్డ్ మ్యూజిక్ డే..!

21 June: International Yoga Day | యోగా డే | ప్రపంచ యోగా దినోత్సవం


ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి ఎవరి నోట విన్నా యోగా డే ప్రస్తావనే. జూన్ 21న 200లకు పైగా దేశాల్లో రెండు వందల కోట్లకు పై చిలుకు మంది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. 2014 సంవత్సరం సెప్టెంబరులో జరిగిన సర్వప్రతినిధి సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు ఇంటర్నేషనల్‌ యోగాడేని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. వేద కాలానికి ముందే పుట్టిన యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మనసు, శరీరం మనకు నచ్చినవిధంగా పనిచేయాలంటే వాటి రెండింటినీ ఏక కాలంలో అదుపులోకి తెచ్చుకోగలగాలి. అలా అనుకూలంగా మరల్చగలిగే శక్తి కేవలం యోగాకి ఉంది. అందుకే యోగాభ్యాసం ఎంతైనా అవసరం. దీనకి సులభమైన ఆసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు లాంటివి అవసరం అవుతాయి.

శ్వాస క్రియలో మనం పీల్చే గాలి పరిమాణం పెరిగితే జీవకణాలకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. తద్వారా జీవకణాలు శక్తివంతమవుతాయి. ప్రాణాయామంతో పాటు శరీర కండరాలు కూడా బాగా బిగించటం వదులు చేయటం ప్రక్రియతో అవి శక్తివంతం అవుతాయి. అలాగే శరీర భాగాలను పైకి క్రిందకు పక్కకు కదిలిస్తుండడం చేత శక్తిని పొందుతాయి. ఆరోగ్యం కాపాడ బడుతుంది. అయితే యోగ సాధనలో సక్రమ ఫలితాలకోసం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే...

ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, శరీరం తేలికగా ఉందని తోచినప్పుడు మాత్రమే యోగాను అభ్యసించాలి. యోగాకి ముందు, వెనుక కనీసం గంట పాటూ ఎలాంటి ఘనపదార్థాలు తీసుకోకూడదు. సరిపడా గోరువెచ్చని నీటిని తాగి కొంత సమయం తరవాత అభ్యాసం మొదలుపెట్టాలి. ప్రాణాయామం చేసేటపుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం మంచిది. యోగాసనాలు వేసేటపుడు సుదీర్ఘంగా, లయబద్ధంగా నాసిక రంధ్రాలతో మాత్రమే శ్వాస పీల్చుకోవాలి.

పాన్ కార్డుకి ఆధార్ అనుసంధానం | Aadhaar-PAN linking must for Income Tax Return filing | Step-by-step Process to Link Aadhaar And PAN Card | How to link your Aadhaar with PAN



పాన్ కి ఆధార్ లింక్
* Aadhar Card compulsory for Bank Account | Opening Bank Account| New Bank Account
* Aadhaar Card mandatory for Income Tax Return | ITR | PAN
* Is Aadhar card necessary for applying fresh passport?
* How To Link Your Aadhaar Card To Mobile Number
* Aadhaar Based Instant e-KYC Verification
* Aadhaar number mandatory for students
* How To Link Aadhaar To Voter Id Card

మీ పిల్లలను ప్రీ-స్కూల్లో చేర్పిస్తున్నారా? I Your child is ready for Preschool I Play School | మీ పిల్లలకు స్కూల్ మారుస్తున్నారా ? I Preparing Your Child for a Move I Switching Schools | మీ పిల్లలకు స్కూల్ మారుస్తున్నారా ? I Preparing Your Child for a Move I Switching Schools





మీ పిల్లలను ప్రీ-స్కూల్లో చేర్పిస్తున్నారా? I Your child is ready for Preschool I Play School  | మీ పిల్లలకు స్కూల్ మారుస్తున్నారా ? I Preparing Your Child for a Move I Switching Schools | మీ పిల్లలకు స్కూల్ మారుస్తున్నారా ? I Preparing Your Child for a Move I Switching Schools

జూన్ 5: ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం | World Environment Day | Connecting People to Nature | Save water! Save Life!

ప్రకృతి దేవోభవ.!










మన పర్యావరణం - మన బాధ్యత
పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు
నరికిన చెట్టు  - నరకానికి మెట్టు
కాలుష్యాన్ని తగ్గించండి - భూమిని కాపాడండి

ఇక సూరీడే దిక్కు! | మే 31: సోలార్‌ డే | World Solar Day | Renewable Energy & Energy Resources of the Future

 
మానవుడికి ప్రకృతి ప్రసాందించిన సహజ వనరులన్నీ ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి. ఇకనైనా మేలుకోకపోతే భవిష్యత్ అగమ్యగోచరమేనని ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. నేడు అనేక దేశాలు  ప్రత్యామ్నాయ ఇంధనవనరులైన సోలార్, విండ్, బయోమాస్ వంటి వాటిపై దృష్టి పెట్టాయి. మన దేశంలోనూ గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్  వంటి రాష్ట్రాలు సౌరశక్తిని విరివిగా వాడకంలోకి తెచ్చాయి.
 
మొదటగా అమెరికా 1978 మే 31న సూర్యదినంగా పాటించింది. అమెరికా శాస్త్రవేత్త డేవిడ్‌ హౌస్‌, సౌర శక్తిని పరిశోధించి రాబోయే వంద సంవత్సరాల వరకూ దేశ అవసరాలన్నింటిని సౌర శక్తి తీరుస్తుందని చెప్పాడు. అంతేకాదు సౌరశక్తితో వివిధ ప్రాజెక్టులను ఎలా నడపవచ్చునో చూపించాడు. భౌగోళికంగా మన దేశం భూమధ్య రేఖకు దగ్గరలో ఉండడం వల్ల మనకు మరిన్ని అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

మన ఆదిత్యుడు శక్తి సామర్థ్యాలు  అంతాఇంతా కావు.  ఒక్క క్షణంలో సూర్యుడి నుంచి విడుదలయ్యే శక్తి మనకు వెయ్యి ఏళ్లు సరిపోయేంత. ఒక అంచనా ప్రకారం ఒక్కో చదరపు మీటర్ కు వెయ్యివాట్లు. భూమికి సూర్యుని నుంచి 174 పెటావాట్ల శక్తిగల సూర్య కిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. మిగతా వేడిమిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. సౌర విద్యుత్‌ కోసం హీట్‌ ఇంజన్‌ నుంచి ఫొటో వోల్టాయిక్‌ ఘటాల నుంచి ఉత్పత్తి చేస్తారు. ప్రపంచ దేశాల ప్రస్తుత విద్యుత్తు అవసరాలు దాదాపు 15 టెరావాట్లు కాగా కేవలం ఐదు  శాతం సౌరశక్తిని అందిపుచ్చుకోగలిగినా ఇది అవసరాలకంటే యాబైరెట్లు  ఎక్కువనే చెప్పాలి.

ప్రపంచ వ్యాప్తంగా విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు, చమురు, గ్యాస్ లోటు రోజురోజుకూ పెరిగిపోతోంది. మన దేశంలో 40కి పైగా ప్రధానమైన థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు లోటుతో మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బొగ్గు దిగుమతి తలకు మించిన భారమవుతోంది. ఖరీదైన బొగ్గు దిగుమతులపై ఆధారపడాల్సి రావడం విద్యుత్ ఛార్జీల పెరుగుదల, సర్ చార్జీల బాదుడుకు దారి తీస్తున్నాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు మరింత సంక్షోభంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరు వేల మెగావాట్ల సామర్ధ్యంతో ప్రాజెక్టులు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. అయినా ఉత్పత్తి 850 మెగావాట్లకు మించడం లేదు. జల విద్యుదుత్పత్తికి కేవలం మూడు, నాలుగు నెలలు కాలం మాత్రమే అనుకూలంగా ఉంటోంది. ఇక దేశంలో అణు విద్యుత్ వాటా కేవలం రెండు శాతం మాత్రమే. అణువిద్యుత్ ప్రాజెక్టుల వల్ల ప్రాణభద్రతపై సందేహాలు వెంటాడుతున్నాయి. అందువల్లే కాలుష్యరహిత సౌరవిద్యుత్ ఉత్పాదనపట్ల ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్ - పలు ఇతర రాష్ట్రాలు ప్రత్యేక విధానాలు అమల్లోకి తెచ్చి సౌరవిద్యుత్ ద్వారా సత్ఫలితాలు సాధిస్తూంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి భారీగా అవకాశాలున్నా 38 మెగావాట్లకే పరిమితమైంది. గుజరాత్ మూడువేల ఎకరాల్లో అతిపెద్ద సౌర పార్కు ఏర్పాటు చేసి 600 మెగావాట్లు ఉత్పత్తి చేయగలుగుతోంది.

సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి మాత్రమేకాకుండా నేరుగా పనిచేసే  సోలార్ వాటర్ హీటర్లు. సోలార్ కుక్కర్లు, సోలార్ లైట్లు తదితర ఉపకరణాలు వాడటంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గించవచ్చు. సోలార్ పరికరాల వినియోగంలో ప్రజలకున్న అనుమానాలు స్వచ్ఛందసంస్థలు, ప్రభుత్వం నివృత్తి చేయాలి.  సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహకాలు అందిస్తూ పెద్ద ఎత్తున సబ్సిడీలతో పాటు బ్యాంక్ రుణాలు అందేలా ప్రభుత్వం చూడాలి. అప్పుడే సోలార్ పవర్ పై పట్టు సాధించవచ్చు. గుజరాత్ రాష్ట్రంలో మాదిరిగా కొత్త గృహాలు నిర్మాణించాలంటే సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటేనే అనుమతి మంజూరు చేయాలి. ఏ ఇంటికి కావాల్సిన కరెంట్ ను ఆ ఇంటిపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ను ఒడిసిపట్టాలని, అలా చేస్తేన అనుమతి అని చట్టం తేవాలి. థానే, అమరావతి, దుర్గాపూర్, నాగ్ పూర్ వంటి నగర కార్పొరేషన్ లు సౌర హీటర్లు వాడితే ఆస్తిపన్ను తగ్గిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అటువంటి విధానాలను ప్రోత్సాహించాలి. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, మార్కెట్ యార్డ్ లు, కోళ్లఫారాలు, డెయిరీ ఫారాలు, ఫామ్ హౌస్ లు, కాల్వలు వంటి అనువైన ప్రదేశాల్లో సౌర ప్యానళ్లు ఏర్పాటు చేయవచ్చు. వాటి ద్వారా రికార్డ్ స్థాయిలో వెయ్యి మెగావాట్లకు పైగా కరెంట్ ను ఉత్పత్తి చేయవచ్చు.  బంజరు భూములు, వృథా భూముల్లో లీజుపై సౌరవిద్యుత్ పార్కులు, ప్రైవేట్ భవనాలపై అద్దె ప్రాతిపదికన యూనిట్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టాలి. ఫలితంగా కరెంట్ గ్రిడ్లపై భారం తగ్గుతుంది. వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించవచ్చు.  ముందున్న చీకట్లను తరిమికొట్టడానికి సౌరవిద్యుత్ మాత్రమే సరైన మార్గం. దీనికోసం స్పష్టమైన విధానం, కార్యాచరణ ప్రణాళిక, చిత్తశుద్ధి అవసరం. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పవర్ ఉత్పత్తిపై దృష్టి సారించాలి.

సంపూర్ణ ఆహారంగా పాల ప్రాశస్త్యత | జూన్ 1 : ప్రపంచ పాల దినోత్సవం | Why is Milk Considered to be a Complete Meal | World Milk Day


పాలు సంపూర్ణమైన ఆహారం. ఇది అక్షరాల నిజం. చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పాలలో వివిధ రకాల పోషక పదార్థాలు విరివిగా లభించడమే దీనికి కారణం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ వారి సిఫారసు మేరకు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 283 గ్రాముల పాలు తీసుకోవాలి. పాలు మానవ శరీరానికి పోషకాల ఖని. ఆవు, గేదె, మేక పాలతో వేరువేరు ప్రమాణాల్లో పోషక పదార్థాలు మనం పొందవచ్చు. ప్రతి వంద గ్రాముల పాలల్లో - ఆవుపాలు 86.6 శాతం, గేదె పాలు 84.2 శాతం వరకు నీరు కలిగి ఉంటుంది. ఆవు పాలల్లో కొవ్వు 4.6 శాతం, మాంసకృత్తులు 3.4 శాతం, పిండి పదార్థాలు 4.9 శాతం, ఖనిజ లవణాలు 0.7 శాతం వుంటాయి. గేదె పాలల్లో 6.6 శాతం కొవ్వు, 3.9 శాతం మాంసకృత్తులు, 5.2 శాతం పిండి పదార్థాలు, 0.8 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి.

ముఖ్యంగా కాలంతో పోటీపడే నేటి మహిళకు, పిల్లలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారం పాలు అని చెప్పాలి. పాలు అతి తేలికగా జీర్ణమవడమేకాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా ఇనుమడింపచేస్తాయి. మహిళలల్లో వయస్సు పెరిగేకొద్ది తగ్గే కాల్షియం తద్వారా దంతాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు సోకడం జరుగుతుంది. అందుకని మహిళలు చిన్న వయస్సు నుంచే పాలను సరిపడా తీసుకోవడం ఎంతైన ఆరోగ్యదాయకం. మానవ శరీర పోషణకు అవసరమయ్యే పౌష్టికాహారాల్లో పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు ప్రధాన పాత్రవహిస్తాయి. ఇవన్నీ సులభంగా పాల ద్వారానే లభిస్తాయని గమనించాలి. వీటితో పాటు పాలల్లో అధికంగా కేసిన్ మాంసకృత్తులు, లాక్టోస్, చక్కెరలు విరివిగా లభిస్తాయి.

తాజా పాలలో, మీగడలో ప్రోటీన్ లు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్ లు శరీరంలోని ధాతువులను, కండరాలను, రక్తాన్ని వృద్ధి పరచడంలో తోడ్పడుతాయి. అంతేకాకుండా వెన్న, నెయ్యిలలో కొవ్వు అధికంగా లభిస్తుంది. ఈ కొవ్వు శరీరానికి కావలసినంత శక్తి ఇస్తుంది. పాలనే కాకుండా, పాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. పాలు, వెన్న, నెయ్యి, పెరుగు లాంటి పాల ఉత్పత్తుల వాడకం వల్ల శరీరానికి అవసరమయ్యే  విటమిన్-ఎ సమృద్ధిగా లభిస్తుంది. దీని వల్ల కళ్ళ దృష్టిని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా రేచీకటి నుండి రక్షణ పొందవచ్చు. పాలు, వెన్న తీసిన పాలు, పెరుగులలో  విటమిన్-బి (రిబోప్లోవిన్) ఎక్కువగా ఉంటుంది. తద్వారా నంజు, గరుకు చర్మం లేకుండా రక్షణ ఏర్పడుతుంది. కంటి చూపును కూడా సరిగా ఉంచుతుంది. అన్నీ వయసుల వారికి ముఖ్యంగా పసిపిల్లలకు, గర్భిని స్త్రీలకు విటమిన్-ఇ ఎంతో అవసరం. చర్మ సౌందర్యానికి, శరీర పోషణకు విటమిన్-ఇ ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్-డి ని వెన్న, మీగడల నుంచి సునాయసంగా పొందవచ్చు. విటమిన్-డి రికెట్స్  అనే కీళ్ల జబ్బు రాకుండా చూస్తుంది. బెరిబెరి జబ్బు రాకుండా సహాయపడే విటమిన్-బి ని కూడా పాలు కలిగి ఉంటాయి. ఎ, బి1, బి2, బి6, సి, డి, ఇ విటమిన్ లతో పాటూ పాంటోథెనిక్ యాసిడ్, నియాసిన్, బయోటిన్ (బీ7), ఫోలిక్ యాసిడ్ మొదలైనవి పాలల్లో విస్తారంగా లభిస్తాయి. మానవశరీర పెరుగుదలకు దోహదపడే కాల్సియం, పాస్ఫరస్, జింక్, మెగ్నీషియం, కాపర్, మ్యాంగనీస్, పొటాషియం, సోడియం క్లోరైడ్, సల్ఫర్, సిలికాన్, క్రోమియం, ఐరన్ మొదలైన ఖనిజ లవణాలు పాలల్లో పుష్కలంగా ఉంటాయి. ఎముకలు, దంతాలకు సంబంధించిన వ్యాధులు వీటి ద్వారా నయమవుతాయి. 



రెండు తెలుగు రాష్ట్రాలు... ఒకే భాష ఒకే జాతి... | జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం | Telangana Formation Day

ఒక పాట సినిమా కోసం రాసింది. యాబై ఆరేళ్లపాటు కోట్ల తెలుగు గొంతుకలు పాడుతూనేఉన్నాయి. మరో పాట ఉధ్యమ శంకారావాన్ని పూరించింది. ముక్కోటి తెలంగాణ గుండెల సవ్వడిని ప్రతిధ్వనించింది. తమిళుడైన శంకరంబాడి తెలుగుతల్లికి అక్షరనిరాజనాలు పడితే, ఓరుగళ్లు గొర్రెల కాపరి అందెశ్రీ తెలంగాణతల్లిని జానపద జావళీలతో కీర్తించాడు. రాష్ట్రాలు వేరైనా ఒకే భాష ఒకే జాతిగా తెలుగువారంతా వెలుగొందాలనేది రెండు ఈ రాష్ట్రగీతాల సారాంశం. 

మా తెలుగు తల్లికి... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గీతం
గీత రచయిత శంకరంబాడి సుందరాచారి.

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!



తెలంగాణా తల్లికి జయజయహే... తెలంగాణా రాష్ట్ర గీతం
గీత రచయిత డాక్టర్ అందెశ్రీ.

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

జానపద జనజీవన జావళీలు జాలువార
జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర
వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి
తరుగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగ
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
www.vantintichitkalu.com

#TelanganaFormationDay

గమ్మత్తుగా చిత్తవుతున్న యువత.. | 31 మే: అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం | Smoking is injurious to health and it causes lung cancer, yet people in general are ignorant of its statutory warnings.


ఫ్యాషన్ ముసుగులో భావిభారతం పొగచూరుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని నిర్వీర్యం చేసే అంశాల్లో పొగాకు వాడకం ఒకటి. ఈ మహమ్మారి ఏటా కొన్ని లక్షల మంది జీవితాలని కబళిస్తుంది. అయినా మన దేశంలో పొగాకును పూర్తిగా నిషేధించే పరిస్థితులు లేవని పొగాకు వాడకం మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడం తప్ప మరే మార్గం లేదంటారు విశ్లేషకులు. అభివృద్ధి చెందిన దేశాలలో పొగత్రాగేవారి సంఖ్య స్థిరంగా ఉండగా అభివృద్ధి చెందుతున్న మనదేశంలో వీరి శాతం రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. అమెరికాలోని వ్యాధి నిరోధక మరియు నియంత్రణ కేంద్రం పొగాకు వినియోగాన్ని నిరోధించగలిగే వ్యాధి కారకాలలో ప్రధానమైనదిగా, ప్రపంచవ్యాప్తంగా సంభవించే అకాల మరణాలకు ముఖ్యమైన కారణంగా పేర్కొంది.

ధూమపానం చేయడం నేడు ఫ్యాషన్ అయిపోయింది. ఎవరింట్లోనైతే పెద్దలు ధూమపానం చేస్తుంటారో ఆ ఇంట్లోని పిల్లలు, గర్భినీ స్త్రీలు, పెంపుడు జంతువుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ధూమపానం చేసేవారికన్నా ఆ చుట్టుపక్కల వారి ఆరోగ్యంపై పొగ ప్రభావం అధికంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొగాకు వినియోగం ఏ రూపంలో ఉన్నా అనారోగ్యానికి గురిచేస్తుంది. అయితే వినియోగించిన విధానాన్ని బట్టి కొంతవరకు తీవ్రతలో మార్పు ఉంటుంది. ఈ శారీరక సమస్యలకు తోడు మానసిక సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తప్పవు.

పొగాకు కొన్ని వందల రకాల హానికర రసాయనాలతో కూడుకున్నదే కాక నికోటిన్, బూడిద, అధికంగా అనర్థాలకు గురి చేసే కార్బన్ మోనాక్సైడ్ దీనిలో ఎక్కువగా ఉంటాయి. పొగాకు ఊపిరితిత్తులను విపరీతంగా ప్రభావితంచేస్తాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మాత్రమేకాకుండా, శరీరంలోని అన్ని అవయవాలను క్రమంగా నాశనం చేస్తుంది. పొగాకు వినియోగం వలన కలిగే నష్టాలలో ముఖ్యమైనవి ఊపిరితిత్తుల కాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు. అంతేకాకుండా ధూమపానం వల్ల నంపుసకత్వం వస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. సహజంగా పురుషులలో ధూమపానం ఎక్కువగా ఉన్నా యుక్త వయస్కులలో ఈ లింగభేదం ఎక్కువగా లేకపోవడం గమనార్హం.

చాలా మంది ధూమపానం యుక్త వయసులో ప్రారంభిస్తారు. ధూమపానం వల్ల అదోరకమైన ఆనందం పొందుతారు. కన్నాళ్లకు ధూమపానం మానివేయడానికి ససేమిరాల మారుతారు. సినిమాల ప్రభావమో, పెద్దలను అనుకరించడమో, సరదాకోసమో, మత్తు కోసమో.... కారణమేదైనా అలవాటైన పొగాకు వాడకం, దానిలోని నికోటిన్ మళ్లీమళ్లీ వినియోగించేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఆధునిక కాలంలో సిగరెట్ తాగేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత సరదా కోసం కాల్చుతూ క్రమంగా దానికి బానిసలవుతున్నారు. నగరాల్లో మహిళలు సిగరెట్లు, పల్లెటూర్లలో కొంతమంది మహిళలు చుట్టలు తాగుతుండటం గమనిస్తున్నాం. ఇలా ఏదోఒక రకంగా పొగాకు ఉత్పత్తుల వాడకం పెరుగుతూనే ఉంది. తొలుత సరదాగా మొదలై అనంతరం ప్రాణాలను మింగేసే ఈ దురలవాటును ప్రజలు వదల్లేక పోతున్నారు. పొగాకుకు బానిసలై తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పొగాకును వాడటం వల్ల భారతదేశంలో రోజుకు సుమారు 2500 మంది చనిపోతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది.

పొగాకు ఉత్పత్తులకు బానిసై ఒక్కసారిగా మానడం కష్టమే అంటున్నారు వైద్య నిపుణులు. పైగా అలా మాన్పించినా నష్టమే జరుగుతుందంటారు. అయితే గుట్కా నమిలే వాళ్లు వాటికి క్రమంగా దూరం అవడం కోసం నికోటిన్ తక్కువ మోతాదులో ఉండి, హానికర పదార్థాలు లేని చూయింగ్‌గమ్, చాక్లెట్లను ఆశ్రయించాలి. అలాగే ధూమపానం అలవాటుకు దూరం కావడం కోసం టార్‌ఫ్రీ, హానికర పదార్థాలు లేని ఎలక్ట్రానిక్ సిగరెట్లు వాడడం ఉపయోగకరం అని సూచిస్తున్నారు.

పొగాకు వినియోగం వల్ల కలిగే నష్టాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31వ తేదీని ధూమపాన వ్యతిరేక దినంగా ప్రకటించింది. 1953 నుండి ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ మంతటా ‘నో స్మోకింగ్‌ డే’ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. పొగాకు రాహిత సమాజంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 18 సంవత్సరాల వయస్సులోపువారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడం ప్రభుత్వం నిషేధించింది. సిగరెట్ అండ్ అదర్ టబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ లోని సెక్షన్ 4 బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదని స్పష్టం చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించడం తద్వారా పొగతాగే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సి ఉంది.

World No Tobacco Day | International Child Labour and Drug Abuse Day | International Day against Drug Abuse and Illicit Trafficking | మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం