దసరా శుభాకాంక్షలతో.. | Happy Dussehra | దసరా | ఆయుధ పూజ | బంగారం | పాలపిట్ట | జమ్మి | దుర్గా దేవి పూజా | బతుకమ్మ | బొమ్మలకొలువు | vantintichitkalu

దసరా బంగారం..


నవరాత్రి ఉత్సవాలలో శ్రీ విజయ దుర్గా దేవి పూజా, బతుకమ్మ, బొమ్మలకొలువు.. వీటితో పాటు దసరా రోజు ఆయుధ పూజ, జమ్మిచెట్టు పూజ, పాలపిట్ట దర్శనం ప్రధాన ఆచారాలు. పాండవులు అజ్ఞాత వాస సమయంలో వారి ఆయుధాలను శమీ వృక్షం పై ఉంచారు. ఆ ఆయుధాలు తుప్పు పట్టకుండా ఉండటానికి కారణం శమీ పత్రంలోని ఔషధీ గుణం. జమ్మి ఆకు చర్మ వ్యాధులను నివారిస్తుంది. ఈ ఆకుల రసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నల్లపడుతుంది. ఆయుర్వేద మందులలో శమీవృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు చెట్టు బెరెడు అన్నీ ఉపయోగిస్తారు.

సెప్టెంబర్ 26: చెవిటి వారి దినోత్సవం | International Day of the Deaf | www.vantintichitkalu.com















అపరిశుభ్రమైన నీళ్లలో స్విమ్మింగ్, చెవిలో పిన్నులు, పుల్లలు, ఇయర్‌బడ్స్ పెట్టి తిప్పడం, దుమ్ముధూళి చేరడం, అకస్మాత్తుగా వినిపించే భారీ శబ్దాల వల్ల చెవి లోపలి పోర దెబ్బతినడం వంటివన్నీ వినికిడి సమస్యకు దారితీయవచ్చు. ఎక్కువ శబ్దంతో టీవీలు చూడడం, మొబైల్ ఫోన్ లో గంటల తరబడి మ్యూజిక్ వినడం, సెల్ ఫోన్ రేడియేష‌న్.. వీటి వ‌ల్ల కూడా సమస్య దరిచేరవచ్చు. ఫోన్ కాల్స్ మాట్లాడేట‌ప్పుడు ఒకే చెవివైపు మొబైల్ పెట్టి ఎక్కువ‌సేపు మాట్లాడ‌కూడ‌దు. ఇయ‌ర్‌ఫోన్స్‌ వాడినా గంటకు మించి మాట్లాడడం పనికిరాదు. వాల్యూమ్ మితంగానే ఉండాలి.

చెవిపోటు వ‌చ్చిన‌ప్పుడు చాలా మంది సొంత వైద్యం చేస్తుంటారు. ఇది మ‌రిన్ని స‌మ‌స్యలకు దారి తీయవచ్చు. అందుకే వెంటనే ఈఎన్‌టీ డాక్టర్‌ని త‌ప్పనిస‌రిగా సంప్రదించాలి. సాధారణంగా జలుబు తర్వాత ఎక్కువగా కనిపించే సమస్య చెవి ఇన్ఫెక్షన్. ఇది ముదిరే కొద్దీ చెవిపోటు, జ్వరం, చెవి నుంచి చీము కారే సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే కర్ణబేరి దెబ్బతిని చెవిటి వారిగా మారే ముప్పు ఉంది.


స్నానం చేసే సమయంలో నీళ్లుచెవిలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడడం, సైనస్ ఉంటే వెంటనే చికిత్స తీసుకోవటం ఉత్తమం. గులిమి (వాక్స్) ని తీయకపోవడమే మంచింది. ఆకు పసర్లు, నూనెలు వంటివి చెవిలో పోయకూడదు అని గమనించాలి.
 

సెప్టెంబర్ 22: గులాబీల దినోత్సవం | World Rose Day | Amazing Benefits of Rose for Health and Beauty! | vantintichitkalu | వంటింటిచిట్కాలు

శుభాకాంక్షలతో..


యువతులు అమితంగా ఇష్టపడే పుష్పాల్లో గులాబీలకు ప్రత్యేక స్థానం ఉంది. కొప్పులలో పువ్వులనగానే గుర్తుకొచ్చేవి గులాబీలే. పెళ్ళి, పేరంటాల్లో అమ్మాయిలు 'పూలజడలు' గులాబీలతో కట్టుకుంటారు. స్త్రీల అలంకరణకే కాక గుళ్లు గోపురాలను గులాబీలతో వైభవంగా అలంకరిస్తారు. కేవలం అలంకరణకే పరిమితం కాక గులాబీలు ఆరోగ్య పరిరక్షణలోను, సౌంధర్యపోషణలోను, సుగంధ ద్రవ్యంగాను పనిచేస్తాయి. సులభంగా పెంచుకోదగిన మొక్క కనుక ఏ ఇంటి ముంగిలిలో చూసినా రంగురంగుల గులాబీలు తళుకులతో, సువాసనలు వెదజల్లుతూ ఆహ్లాదపరుస్తూ కనిపిస్తుంటాయి. గుత్తులు గుత్తులుగా చెట్టు నిండుగా అలరారుతూ కన్నుల పండువగా ఉంటాయి. అందానికి మారు పేరుగా ప్రపంచమంతా గుర్తించిన దివ్యమైన గులాబీలు అద్భుతమైన ఔషధగుణాలను కలిగి చక్కని ఆరోగ్యాన్ని ఇనుమడింపజేస్తాయంటే ఆశ్చర్యం కలగకమానదు.

సెప్టెంబరు 21: గురజాడ అప్పారావు గారి జయంతి | Gurajada Apparao Jayanti Celebrations

దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌


దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయి

            పాడి పంటలు పొంగిపొర్లె
            దారిలో నువు పాటు పడవోయి
            తిండి కలిగితే కండ కలుగును
            కండ కలవాడేను మనిషోయి

యీసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుఅగునోయ్‌
జల్దుకుని కళలన్ని నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌


            దేశాభిమానం నాకు కద్దని
            వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
            పూని ఏదైనాను ఒక మేల్‌
            కూర్చి జనులకు చూపవోయ్‌

చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌

            సొంత లాభం కొంత మానుకు
            పొరుగు వానికి తోడుపడవోయ్‌
            దేశమంటే మట్టి కాదోయ్‌
            దేశమంటే మనుషులోయ్‌

బతుకమ్మకు ప్రసాదాలివి.. | Bathukamma-Telangana Floral Festival | ప్రకృతిని ఆరాధించే అపురూపమైన బతుకమ్మ | Saddula Bathukamma | VantintiChitkalu | Health & Beauty Tips in Telugu | Life Hacks | వంటింటి చిట్కాలు

శరన్నవరాత్రులలో బొమ్మలకొలువు | దసరా బొమ్మలకొలువు | Bommala Koluvu | Celebrating Dussehra | Golu Dolls | Dasara Dolls for Navarathri | VantintiChitkalu | వంటింటిచిట్కాలు

బొమ్మలు - వాగ్దేవి
దసరా పండుగ వచ్చింది - సరదాలెన్నో తెచ్చింది.. ఈ ఆనందం, ఉత్సాహాల మధ్య దసరా 'బొమ్మల కొలువు' ఆడపిల్ల ఉన్న ప్రతీ ఇంటా కొలువు తీరింది. దసరా నవరాత్రులలో పది రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలకు తోడు బొమ్మలకొలువు పండగ జరుపుకుంటారు. ప్రతి రోజూ సాయంత్రము పేరంటానికి ముత్తైదువులను, పిల్లలను పిలిచి, అందరికీ తాంబూలము, దక్షిణ ఇవ్వడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.

బొమ్మల కొలువు ప్రారంభించిన సంవత్సరం ఒక వరుస బొమ్మలతో మొదలై ప్రతీ సారి ఒకటి చొప్పున తొమ్మిది మెట్ల వరకు పెంచుతూ వెళతారు. ప్రతీ సంవత్సరము తప్పనిసరిగా ఓ క్రొత్త బొమ్మ కొనడం సంప్రదాయం. అలాగే వచ్చిన వారు కూడా ఒక కొత్త బొమ్మను బహుకరిస్తారు. బొమ్మల కొలువులో ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీలు.. వంటివి కాకుండా మట్టి బొమ్మలు, కొయ్య బొమ్మలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.

సంస్కృతి సంప్రదాయాలు, నీతి కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు పిల్లలకు బోధపడేలా బొమ్మల కొలువును తీర్చిదిద్దుకోవాలి. దేవుని బొమ్మల్లో వినాయకుడు, సీతారాములు, రాదాకృష్ణులు, లక్ష్మిదేవి, సరస్వతిదేవి, పార్వతిదేవి.. పెట్టుకోవచ్చు. ఇక పెళ్ళితంతు బొమ్మలు, హాస్యబొమ్మలు, బామ్మ-తాత, గోపికలు, వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్ల బొమ్మలు,  ప్రయాణ సాధనాలు వంటివి కొలువులో ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తాయి.

బతుకు సారాన్ని తెలియజేస్తూ సాగిపోయే బతుకమ్మ.. | తెలంగాణ గ్రామీణుల 'బతుకమ్మ' సంబురాలు | Telangana floral festival Bathukamma | వంటింటిచిట్కాలు | VantintiChitkalu | Divine & Nature




బతుకమ్మ... ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినా, దేశవిదేశాల్లో ఎంతో వైభవంగా జరుపుకునేందుకు కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాలు, ప్లాస్టిక్ పూలు సిద్ధం చేసుకున్నా ఇది ఒక ఆట మాత్రమే కాదు. ఇది నియమ నిబంధనలతో కూడిన పల్లె పండుగ. వీలైతే రండి! పల్లెకు పోదాం....

మారుతున్న నాగరికతలను పుణికిపుచ్చుకుంటున్నా, అనాదిగా వారసత్వ సంస్కృతిగా వస్తున్న సంప్రదాయాల్ని, పండగల్ని రెట్టించిన ఉత్సాహంతో జరుపుకోవడం ముదావహం. తెలంగాణ జిల్లాల్లోని ప్రతి ఆడపడచు ఎదురు చూసే 'బతుకమ్మ' పండుగ, దసరా పండుగలో భాగంగా నిర్హహించడం విశేషం.

తరతరాల సజీవసంస్కృతులకు ప్రతీకలు, సంప్రదాయాల పట్టుగొమ్మలు పల్లెలు. వారు జరుపుకునే సంబరాలకు ఆర్భాటాలుండవు ఆచారాలు తప్ప! సంస్కృతిని వారు విస్మరించరు. వారిలో సంస్కారం వికటించదు. బ్రతుకును దైవత్వం శాసిస్తుందనేది వారి నమ్మకం. ప్రకృతి శక్తికి , భక్తికి, ఆచారాలకు, సంప్రదాయాలకు దైవత్వాన్ని ముడిపెట్టి - ప్రకృతిని 'తమను వైపరీత్యాలకు గురి చేయవద్దంటూ' ఆరాధనగా వేడుకోవడమే పండుగలు. పడతులు తమ పసుపు కుంకుమలను పదికాలాల పాటు పదిలపరచమని కోరుతూ, కోలాటాలు వేసేది 'బతుకమ్మ పండుగ'.

సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాల మేళవింపుగా సాగే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ కళాత్మకంగా జరగడం ప్రసిద్ధి. గ్రామీన ప్రంతాల్లో పండుగ రాకే ఓ అనిర్వచనీయమైన కళను గ్రామాలకు సంతరించుకుంటుందంటే అతిశయోక్తి కాదు. బతుకమ్మ వేడుకల్ని వివిధ ప్రాంతాల్లో విభిన్నరకాలుగా జరుపుకున్నా, పండుగ ఒక్కటే, ప్రాధాన్యతా ఒక్కటే. మారుమూల పల్లె నుంచి ఓ మోస్తరు పట్టణం దాకా బతుకమ్మ పండుగ జోరుగా సాగుతుంది. "పాడిపంటలను ఉయ్యాలో... చల్లగా చూడమ్మ, బతుకమ్మ ఉయ్యాలో..." అని వేడుకనే పండుగ.

ఏటా ఆశ్వీజ శుద్ధ పాఢ్యమి మొదలుకుని మహానవమి వరకు బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. పండుగ ప్రాశస్త్యత, పుట్టుపూర్వోత్తరాలపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నా "శంకరుని భార్య గౌరీదేవి మహిషాసురిడితో పోరాడి అలసిపోయి ఆశ్వీజ శుద్ధ పాఢ్యమి నాడు మూర్చపోయిందనీ, ఆ మూర్చ నుండి ఆమె తేరుకోవడానికి గ్రామీణులు వివిధ రీతుల్లో గౌరీదేవిని స్తుతిస్తూ పాటలు పాడారనీ, అదే బతుకమ్మ పండుగగా మారిందనే" కథ ప్రముఖంగా వినవస్తుంది. సంధ్యాసమయాన ఆడిపాడే 'బతుకమ్మ'కు పగలంతా హడావిడే. ఈ పండుగ ప్రకృతిరమణీయకతకు విడదీయరాని సంబంధం ఉందనడానికి నిదర్శనంగా బతుకమ్మను అనేక రకాలైన పూలు, ఆకులతో ఆకర్శణీయంగా అలంకరిస్తారు. తంగేడు, గుమ్మడి, చామంతి, గడ్డిపూలు, గునుక - పలు రకాల పూలను సేకరించి సిబ్బి(పల్లెం)లలో గుమ్మడి ఆకులను పరచి వాటిపై గోపురాకారంలో పేర్చుతారు. పేర్చిన పూల మీద 'గౌరమ్మ'(పసుపు ముద్ద)ను పెడతారు.  ఈ బతుకమ్మను తయారు చేసి, వారిలో ఉన్న సృజనాత్మకతను చాటిచెబుతారు.

అన్ని రోజులు బతుకమ్మల్ని ఒకచోట చేర్చి చుట్టూ తిరుగుతూ కోలాటాలు ఆడటం, పాటలు పాడటం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆత్మీయతానురాగాల్ని పరస్పరం కనబరుచుకోవటం  ఈ సందర్భంగా ప్రతి పడతిలోనూ గోచరిస్తుంది. తమ అయిదోతనాన్ని కాపాడమంటూ కోరుకునే భావాలతో కూడిన పాటల్ని రాగయుక్తంగా పాడుతూ, లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ స్త్రీలు ఆనంద సముద్రంలో తేలియాడతారు.

"బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు గౌరమ్మ ఉయ్యాలో..." అంటూ సాగే బతుకమ్మ ఆటలు, పాటలు తెలంగాణ ప్రాంత సంస్కృతికి, సమాజ పరిస్థతులకు, కట్టుబాట్లకు, ఆచార సంప్రదాయాలకు అద్దం పట్టే రీతిలో చైతన్యవంతంగా ఉంటాయి. అంతేకాకుంగా సతీమర్యాదలు, వేదాంతం, పుట్టింటి వారి నిరాదరణ, కొత్త పెళ్లి కూతుర్లకు హితబోధ, ఆలుమగల అలకల ప్రహసనాలు, చూలాలి మురిపాలు, కుటుంబ నియంత్రణ ఆవశ్యకత, అక్షరాస్యతా ప్రాముఖ్యత, కట్నకానుకలు, భర్తల వ్యసనాలు, పాడి పంటలు - ఇతర అంశాలు సహజసిద్ధంగా కళ్ల ముందు ఆవిష్కరిస్తాయి. బతుకమ్మ పాటల్లో ప్రతి చరణం చివర 'ఉయ్యాలో', 'కోల్', 'చందమామ' లాంటి పదాలు ఎక్కువ. బతుకమ్మ పాటలకు పాశ్చాత్య సంగీతాలుండవు. చప్పట్లు, కోలలు, కాళ్ల గజ్జలే సంగీత వాయిద్యాలు. ఈ నెల 20న ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ మహానవమి (సెప్టెంబరు 28) రోజున ముగుస్తుంది. బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమైన ఆరో రోజును 'అర్రెం' పేరుతో సెలవు పాటించడం పరిపాటి. చివరి రోజున జరుపుకునే బతుకమ్మను 'సద్దుల బతుకమ్మ' పండుగగా పేర్కొంటారు. తొమ్మిది రోజుల ఉత్సవాలు ఒకెత్తుకాగా, చివరిరోజున ఉత్సవం ఒకెత్తు. స్త్రీలంతా ఒకరినొకరు పోటీపడి రంగురంగుల పూలతో పేర్చిన నిండైన నిలువెత్తు 'బతుకమ్మల్ని' చేర్చి వాటికి 'జానపదుల్ని' కూర్చి కలిసికట్టుగా పాడతూ గౌరమ్మను పూజించడం శోభాయమానంగా ఉంటుంది. చివరి రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, రకరకాల సద్దులను నైవేద్యాలుగా సమర్పించి బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. అంతటితో తొమ్మది రోజుల ఆటవిడుపుకి తెరపడుతుంది. అదే ఉత్సాహంతో మరో ఏడాది బతుకు సమరానికి సన్నద్ధులవుతారు గ్రామీణులు.
#బతుకమ్మ పండుగ #బతుకమ్మ ఫిల్మోత్సవ్  #బతుకమ్మ వేడుక #సద్దుల బతుకమ్మ #తెలంగాణలో బతుకమ్మ #పండుగ ఉత్సవాలు #నేటి నుంచే బతుకమ్మ సంబురాలు #బతుకమ్మ సాంగ్  #Floral Festival #Bathukamma #ఎంగిలి పూలు #అర్రెం  #పూలపండగ #బతుకమ్మ ప్రసాదాలు

సెప్టెంబర్ 16: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం | International Day for the Preservation of the Ozone Layer | World Ozone Day | VantintiChitkalu | వంటింటి చిట్కాలు


ఓజోన్‌ పొర మానవాళికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుని నుండి వెలువడే కిరణాల్లో అత్యంత ప్రమాద‌క‌ర‌మైన అతినీలలోహిత కిరణాలు కూడా ఉంటాయి. ఇవి భూమిపై నేరుగా పడితే జీవులలోని అతి సున్నితమైన జీవకణాలు నాశనమై కేన్సర్‌, కంటి వ్యాధులు, చర్మరోగాల లాంటివి కలుగుతాయి. దీని వల్ల ఉష్ణోగ్రతలు కూడా పెరిగి పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలను ఓజోన్‌ పొర అడ్డుకుంటుంది. కానీ మనం వాడే రసాయనిక పదార్థాలు వాతావరణంలోకి వ్యాపించడం వల్ల ఓజోన్‌ పొర ధ్వంసం అవుతోంది. దీన్నే ఓజోన్‌ పొరకు రంధ్రం పడడం, ఓజోన్ పొర క్షీణత అంటున్నాం. కాబట్టి ఓజోన్‌ పొరను కాపాడుకోవాల్సిన చర్యలు ఇప్పటికైనా చేపడితేనే జీవరాశికి మనుగడ.
 
ఓజోన్‌ పొర దెబ్బతినడానికి మనం వాడే ఏసీలు, రిఫ్రిజరేటర్లు, కాస్మిటిక్, టాయిలెట్లకు వినియోగించే పదార్థాలే కారణం. ఇలా క్లోరో ప్లూరో కార్బన్‌ (CFCs) లను ఉత్పత్తి చేసే  వీటిని మితంగా వాడాల్సి ఉంది. పర్యావరణ కాలుష్యం, పరిశ్రమల నుంచి వెలువడే విషపూరిత వాయువులను అదుపు చేయాల్సి ఉంది.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ సమష్టిగా సహజ సిద్ధ సంపదను పరిరక్షించుకోవాలి. లేదంటే మానవుడు కాలుష్య కోరల్లో చిక్కి అంతరించిపోయే ప్రమాదం ఉంది. మొక్కలను విరివిగా పెంచాలి.  ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం అయినప్పుడే పర్యావరణ సమతూల్యతను కాపాడుకోవచ్చు.



సంజీవనికి ప్రతిరూపం.. తల్లిపాలు | జాతీయ పోషణ వారోత్సవాలు (సెప్టెంబర్ 1-7) | National Nutrition Week to be observed from 1st to 7th September | VantintiChitkalu | వంటింటి చిట్కాలు



తల్లిపాలు అమృతంతో సమానం. శిశువు సంపూర్ణ అరోగ్యంగా ఉండడానికి, రోగ నిరోధక శక్తిని పొందడానికి తల్లిపాలు కచ్చితంగా పట్టించాల్సిందే. అప్పుడే పుట్టిన పిల్లలకు శక్తితో పాటు, శారీరక అనారోగ్య సమస్యలు, మానసిక పరమైన సమస్యలు దరిచేరవు. తల్లి బిడ్డకు తన చను పాలు ఇవ్వడం వలన బిడ్డ ఆరోగ్యంగా ఎదగడమేకాకుండా తల్లికి కూడా మేలు జరుగుతుంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల వరకు పసి పిల్లలకు తల్లిపాలను పట్టించడం ఎంతైనా అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతోంది.







కావేరీ పుష్కరాలు - విశేషాలు | Kaveri Pushkaralu | Dates : September 12 to 23 | Places, Pushkar Ghats, Temples in Karnataka, Tamilnadu | VantintiChitkalu | వంటింటి చిట్కాలు



పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవ గురువు బృహస్పతి ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు దానికి సంబంధించిన నదీ పుష్కరాలు వస్తాయి. అంటే మేషరాశిలో గంగకు, వృషభ రాశిలో నర్మదకు, మిథునంలో సరస్వతికి, కర్కాటకంలో యమునకి, సింహంలో గోదావరికి, కన్యలో కృష్ణకు, తులలో కావేరికి, వృశ్చికంలో భీమరథికి, ధనస్సులో బ్రహ్మపుత్రకు, మకరంలో తుంగభద్రకు, కుంభంలో సింధునదికి, మీనంలో ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో నదికి ఆధి దైవిక శక్తులు వస్తాయి. ఇప్పుడు స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి.
 
పన్నెండు సంవత్సరాలకొకసారి క్రమంగా ఈ నదులకు పుష్కరోత్సవాలు వస్తూ వుంటాయి. పుష్కర పర్వము ప్రతినదికి సంవత్సర కాలం ఉంటుంది. మొదటి 12 రోజులు ప్రధాన పుష్కర పర్వదినాలుగా పరిగణింపబడుతాయి. దేవగురువైన బృహస్పతి పుష్కరునితో కలిసి తులారాశిలో ఈ ఏడాది ప్రవేశిస్తుంది కావున కావేరీనదికి పుష్కరం వస్తుంది. కావేరీ పుష్కరాలు సెప్టెంబర్‌ 12న మొదలై 23 వరకు జరుగుతాయి. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణాలు చెప్తాయి.

ఈ సందర్భంగా తమిళనాడులోని కావేరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మహాపుణ్యక్షేత్రాలైన శ్రీరంగం, జంబుకేశ్వరం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచెందూరు, చిదంబరం, కుంబకోణం.. వగైరా, కర్నాటక రాష్ట్రంలోని పుణ్యతీర్థాలు అయిన చెన్నకేశవ స్వామి ఆలయం, భగందేశ్వర ఆలయం, విశ్వేశ్వరాలయాలతో పాటు శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, గంజాంలోని నిమిషాంబాలయం, మైసూరు, శ్రావణబెళగొళ, మంజునాథుడు కొలువుదీరిన ధర్మస్థల, వర్నాడు, కుక్కె సుబ్రమణ్యం, ఉడిపి, శృంగేరి శారదా పీఠము, గోకర్ణం లాంటి మహా పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

Festival of River Kaveri that normally occurs once in 12 years. This Pushkaram is observed for a period of 12 days from the time of entry of Jupiter into Tula rasi (Libra)

టీచర్ అంటే.. 'ఆమే' | ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు | టీచర్స్ డే స్పెషల్ | డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి | 5th September : Teachers' Day | అక్టోబర్ 5: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం | October 5: World Teachers' Day | VantintiChitkalu | వంటింటి చిట్కాలు


" గురుబ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ 
        గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః "



ప్పుడే స్కూలు నుంచి వచ్చిన సాన్వీని 'టీచర్' ఏం హోంవర్క్ ఇచ్చారు? అని ప్రశ్నిస్తే గుక్క తిప్పుకోకుండా ఈ రోజు 'సార్'  హోంవర్క్ ఇచ్చారు.. అని జవాబిచ్చింది. ఇలా చాలామంది పిల్లలు ఆడవాళ్లని 'టీచర్'గా, మగవాళ్లను 'సార్'గా పిలుస్తారు. అంటే అతివలకు అంతచక్కగా 'టీచర్' అనే మాట అతికిపోయిందన్నమాట. టీచర్ కు అర్థం మనకు తెలిసిందే అయినా పిల్లలు కేవలం ఆడవారినే 'టీచర్'గా వ్యవహరిస్తారు. పిల్లలు టీచర్... టీచర్... అంటూ అతి సన్నిహితంగా ఉంటూ చదువు పట్ల ఆసక్తి కనబరుస్తుంటారు. మరికొన్ని విద్యాసంస్థల్లో 'సిస్టర్', 'ఆంటీ'లుగా పిలుస్తారు. ఇతర ఉద్యోగాల కంటే 'టీచర్' ఉత్తమమైనదిగా వనితలు ఎంచుకుంటున్నారు. వివిధ రంగాల్లో స్త్రీలు ముందంజ వేస్తున్నా 'టీచర్' వృత్తినే ప్రప్రథమంగా మొదలెట్టింది. ఉద్యోగాలు సులభంగా దొరకడం, సునాయసంగా 'వృత్తి'కి న్యాయం చేకూర్చగలగడం, పాఠాలు చెప్పడం పిల్లలకు కావున దాదాపు ఇంటి వాతావరణం నెలకొని ఉండడం, పనికాలం, పని భారాలు తక్కువగా ఉండడం చేత వనితలు చాలా వరకు 'టీచర్' ఉద్యోగాలపై మోజుకనబరుస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పడంలో తల్లిఒడి ఎంత గొప్పదో తెలియంది కాదు. విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడానికి ప్రాథమిక దశలో 'ఆడ' టీచర్లనే ప్రైవేటు సంస్థలు నియమిస్తున్నాయి. ఆడవారిలో అమ్మతనం, ఆప్యాయత, పిల్లలపట్ల ఆదరణ అన్నిటికి మించి సహనశీలత ఉండడంతో ఉపాధ్యాయవృత్తికి అక్షరాల సరిపోతారనే అభిప్రాయంతో పలు పాఠశాల యాజమాన్యాలు వారికే ప్రధాన్యత ఇస్తున్నాయి. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే 'ఉపధ్యాయ వృత్తి' ఏమంత కష్టతరం కాకపోవడంతో నేటి వనితలు సంతోషంగా చేపడుతున్నారు. హోం ట్యూషన్లకు కూడా గిరాకి పెరగడంతో ఆడవారికి ఆర్ధిక స్వాతంత్ర్యం లభిస్తోంది. జీతాలను ఎక్కువగా ఆశించకుండా పూర్తి బాధ్యతతో వ్యవహరించడం వల్ల వివిధ కాన్వెంట్, కార్పోరేట్  స్కూళ్ల యాజమాన్యాలు స్త్రీలనే ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారు. చాలా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిపై భావిపౌరుల భవిష్యత్ ఆదారపడి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తికి దోహదపడే లక్షణాల్లో విద్యార్థుల పట్ల ప్రేమ, ఆదరణ, దయాస్వభావం కలిగి ఉండడం ప్రధానమైనవి. సరియైన శారీరక, మానసిక ఆరోగ్యం, ఆదర్శవంతమైన మూర్తిమత్వము, ఆత్మవిశ్వాసం, సమగ్రమైన, విస్త్రుతమైన విషయ పరిఙానం, సృజనాత్మకతలు కూడా ఉపాధ్యాయులు కలిగి ఉండాలి. పిల్లల మనస్తత్వం ఒక్కొక్కరిదీ ఒక్కోవిధంగా ఉండడం మూలానా 'అర్థం'చేసుకుని వారి భవితవ్యానికి చక్కని పునాది వేయాలి. 'టీచర్' స్నేహంగా మెలుగుతూ పలు విషయాలపై సమగ్రంగా, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని పిల్లలకు కల్పించాలి. మాను సక్రమమైన దారి పట్టడానికి మొక్కను వంచకూడదు. చక్కని బాట వేస్తే సరిపోతుంది. అలాగే పిల్లలకు మంచి అలవాట్లు, క్రమశిక్షణ నేర్పడంలో 'దెబ్బకు దయ్యం వదులుతుంద'నే ధోరణి పనికిరాదు. 'ఆమె'లోని ప్రేమ, ఓర్పు, నేర్పు, పట్టుదలలు కలసి పిల్లలు అనూహ్యమైన రీతుల్లో పైపైకెగిరి ప్రగతిపథంలో పయనించేలా బంగారు బాట వేస్తాయి. అన్ని ఉద్యోగాలకన్నా ఎక్కువగా సెలవులు 'బడిపంతుళ్ల'కే ఉంటాయి. వేసవి సెలవులు, పండుగలు, రెండవ శనివారాలు, ఆదివారాలు... ఇలా చాలావరకు సెలవులతోనే సంవత్సరాలు గడిచిపోవడంతో ఉద్యోగం చేసినట్టే అనిపించదు. టిటిసి, బి.ఇడి, ఎం.ఇడి ప్రవేశపరీక్షలకు లక్షల అప్లికేషన్లు చేరుతున్నాయంటే వాటి వెనక స్త్రీలు 'టీచర్' వృత్తి చేపట్టాలనే లక్ష్యం ఉండడమే. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో సగౌరవంగా 'టీచర్' పోష్టును చేపడుతూ నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం 'ఆకాశంలో సగాని'కి లభించడం అభినందనీయం. సర్వతోముఖాభివృద్ధికి కృషి సలపే 'టీచర్' విద్యార్ధుల మనస్సులలో చిరస్మరణీయం.


మీ పని మరింత సులభం కావాలా? సమయం కూడా వృథా కాకుండా .. | Amazing Kitchen Hacks | VantintiChtikalu | వంటింటి చిట్కాలు

ఒకప్పుడు వంటింట్లో కత్తిపీట, కొడవలి, చాకు, పప్పుగుత్తి, జల్లెడ, చాట.. వగైరా.  
మరి ఇప్పుడో.... ఒక లుక్ వేయండి..!

Knives and Peelers : ఎలాంటి హాని తలపెట్టకుండా కూరగాయలను కోయడం, పండ్లు, దుంపల తొక్క తీయడం లో ఈ చాక్ లు, పీలర్లు సహాయపడతాయి. ఎంతో సమయాన్ని కూడా ఆదా చేస్తాయి.





Kitchen Cutters & Scrapers : చిటికలో చాలా సరక్షితంగా అన్నీ రకాల కూరలను తరగాలనుకున్నా, పిండి వంటలను కావలసిన ఆకారంలోకి కట్ చేసుకోవాలన్నా ఎంతో అనువుగా ఉంటాయి.  వంటగదిలో తప్పక ఉంచుకోవలసిన కట్టర్స్,  స్క్రాపర్లు.. ఇవే.









Pineapple Cutters : క్యాన్సర్, గుండెజబ్బు వంటి జబ్బులు దరిచేరకుండా ఉండడానికి రోజుకు ఒక కప్పు అనాస (పైనాపిల్) ముక్కలు తినాల్సిందే అంటారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా పుష్కలమైనా విటమిన్-సి తో పైనాపిల్ రోగనిరోధకశక్తిని మనలో ఇనుమడింపచేస్తుంది. అయితే కట్ చేసుకోవడం ఎలా అనే కదా మీ ఆలోచన..







Orange and Lemon Juicer : నిమ్మకాయ, సంత్రా, బత్తాయి, కమలాలు... రసం సులభంగా తీయడం ఎలా అని సంసయం ఇక అక్కరలేదేమో.






ఆరోగ్య రహస్యాలేంటో.. | సెప్టెంబరు 2: ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం | World Coconut Day | Narali Purnima Festival




కొబ్బరికాయ లేని దైవకార్యం, శుభకార్యం ఉండదు అంటే అతిశయేక్తి కాదేమో. దేవుడికి కొబ్బరిని నైవేద్యంగా పెట్టి అందరికి ప్రసాదంగా పంచుతాం. కొబ్బరి బోండం లోని నీళ్ళు చాలా పౌష్టిక గుణాలు, ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కొబ్బరి నీళ్ళు అన్నీ కాలాల్లో దాహాన్నితీర్చడమే కాకుండా శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని కలిగాస్తాయి.  వీటిలో గ్లూకోజ్‌తోపాటు పొటాషియం, సోడియంలాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చెక్కెర, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి, క్రొవ్వులు అస్సలుండవు. శరీరంలో డీహైడ్రేషన్ కలగకుండా చూస్తాయి. .

జీర్ణకోశ వ్యాధులకు, చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారము, విరేచనాలు అయినపుడు ఓరల్ రి-హైడ్రేషన్ గా ఉపయోగపడుతాయి. ఇందులోని పొటాషియం గుండె జబ్బులకు మంచిది. కొన్ని రకాల పొట్టలోని పురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి. మూత్ర సంభంద, కిడ్నీలో రాళ్ళ సమస్యలలో ఇది మంచి మందు. పచ్చికొబ్బరిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి, రైబోఫ్లెవిన్, ఐరన్, కాలసియం, ఫాస్పరస్, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి నూనెలో యాబై శాతం లారిక్ ఆసిడ్ ఉంటుంది. దీన్ని వంటల్లో వినియోగించడం వల్ల గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కొవ్వు శాతము పెరగదు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొబ్బరి నూనెలో విటమిన్ - ఇ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కోమలంగా తయారు చేస్తుంది. రోజూ రెండు చెంచాలు నూనే తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు మెరుగుపడడమేకాక, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉండవు. శరీరానికి సరిపడా తేమ అందుతుంది, కొబ్బరి పాలు చర్మానికి పట్టిస్తే మృతకణాలు, మురికి తొలగిపోతాయి. ఇక చర్మం అంతా కాంతూలీనుతుంది. ఇది జుట్టుకు మేలు చేస్తుంది. కొబ్బరి నూనెతో కేశాలు నల్లగా, బలంగా, ఒత్తుగా పెరుగుతాయి.