ఆరోగ్య రహస్యాలేంటో.. | సెప్టెంబరు 2: ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం | World Coconut Day | Narali Purnima Festival




కొబ్బరికాయ లేని దైవకార్యం, శుభకార్యం ఉండదు అంటే అతిశయేక్తి కాదేమో. దేవుడికి కొబ్బరిని నైవేద్యంగా పెట్టి అందరికి ప్రసాదంగా పంచుతాం. కొబ్బరి బోండం లోని నీళ్ళు చాలా పౌష్టిక గుణాలు, ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కొబ్బరి నీళ్ళు అన్నీ కాలాల్లో దాహాన్నితీర్చడమే కాకుండా శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని కలిగాస్తాయి.  వీటిలో గ్లూకోజ్‌తోపాటు పొటాషియం, సోడియంలాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చెక్కెర, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి, క్రొవ్వులు అస్సలుండవు. శరీరంలో డీహైడ్రేషన్ కలగకుండా చూస్తాయి. .

జీర్ణకోశ వ్యాధులకు, చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారము, విరేచనాలు అయినపుడు ఓరల్ రి-హైడ్రేషన్ గా ఉపయోగపడుతాయి. ఇందులోని పొటాషియం గుండె జబ్బులకు మంచిది. కొన్ని రకాల పొట్టలోని పురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి. మూత్ర సంభంద, కిడ్నీలో రాళ్ళ సమస్యలలో ఇది మంచి మందు. పచ్చికొబ్బరిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి, రైబోఫ్లెవిన్, ఐరన్, కాలసియం, ఫాస్పరస్, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి నూనెలో యాబై శాతం లారిక్ ఆసిడ్ ఉంటుంది. దీన్ని వంటల్లో వినియోగించడం వల్ల గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కొవ్వు శాతము పెరగదు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొబ్బరి నూనెలో విటమిన్ - ఇ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కోమలంగా తయారు చేస్తుంది. రోజూ రెండు చెంచాలు నూనే తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు మెరుగుపడడమేకాక, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉండవు. శరీరానికి సరిపడా తేమ అందుతుంది, కొబ్బరి పాలు చర్మానికి పట్టిస్తే మృతకణాలు, మురికి తొలగిపోతాయి. ఇక చర్మం అంతా కాంతూలీనుతుంది. ఇది జుట్టుకు మేలు చేస్తుంది. కొబ్బరి నూనెతో కేశాలు నల్లగా, బలంగా, ఒత్తుగా పెరుగుతాయి.





No comments: