సెప్టెంబర్ 16: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం | International Day for the Preservation of the Ozone Layer | World Ozone Day | VantintiChitkalu | వంటింటి చిట్కాలు


ఓజోన్‌ పొర మానవాళికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుని నుండి వెలువడే కిరణాల్లో అత్యంత ప్రమాద‌క‌ర‌మైన అతినీలలోహిత కిరణాలు కూడా ఉంటాయి. ఇవి భూమిపై నేరుగా పడితే జీవులలోని అతి సున్నితమైన జీవకణాలు నాశనమై కేన్సర్‌, కంటి వ్యాధులు, చర్మరోగాల లాంటివి కలుగుతాయి. దీని వల్ల ఉష్ణోగ్రతలు కూడా పెరిగి పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలను ఓజోన్‌ పొర అడ్డుకుంటుంది. కానీ మనం వాడే రసాయనిక పదార్థాలు వాతావరణంలోకి వ్యాపించడం వల్ల ఓజోన్‌ పొర ధ్వంసం అవుతోంది. దీన్నే ఓజోన్‌ పొరకు రంధ్రం పడడం, ఓజోన్ పొర క్షీణత అంటున్నాం. కాబట్టి ఓజోన్‌ పొరను కాపాడుకోవాల్సిన చర్యలు ఇప్పటికైనా చేపడితేనే జీవరాశికి మనుగడ.
 
ఓజోన్‌ పొర దెబ్బతినడానికి మనం వాడే ఏసీలు, రిఫ్రిజరేటర్లు, కాస్మిటిక్, టాయిలెట్లకు వినియోగించే పదార్థాలే కారణం. ఇలా క్లోరో ప్లూరో కార్బన్‌ (CFCs) లను ఉత్పత్తి చేసే  వీటిని మితంగా వాడాల్సి ఉంది. పర్యావరణ కాలుష్యం, పరిశ్రమల నుంచి వెలువడే విషపూరిత వాయువులను అదుపు చేయాల్సి ఉంది.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ సమష్టిగా సహజ సిద్ధ సంపదను పరిరక్షించుకోవాలి. లేదంటే మానవుడు కాలుష్య కోరల్లో చిక్కి అంతరించిపోయే ప్రమాదం ఉంది. మొక్కలను విరివిగా పెంచాలి.  ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం అయినప్పుడే పర్యావరణ సమతూల్యతను కాపాడుకోవచ్చు.



No comments: