కావేరీ పుష్కరాలు - విశేషాలు | Kaveri Pushkaralu | Dates : September 12 to 23 | Places, Pushkar Ghats, Temples in Karnataka, Tamilnadu | VantintiChitkalu | వంటింటి చిట్కాలు



పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవ గురువు బృహస్పతి ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు దానికి సంబంధించిన నదీ పుష్కరాలు వస్తాయి. అంటే మేషరాశిలో గంగకు, వృషభ రాశిలో నర్మదకు, మిథునంలో సరస్వతికి, కర్కాటకంలో యమునకి, సింహంలో గోదావరికి, కన్యలో కృష్ణకు, తులలో కావేరికి, వృశ్చికంలో భీమరథికి, ధనస్సులో బ్రహ్మపుత్రకు, మకరంలో తుంగభద్రకు, కుంభంలో సింధునదికి, మీనంలో ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో నదికి ఆధి దైవిక శక్తులు వస్తాయి. ఇప్పుడు స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి.
 
పన్నెండు సంవత్సరాలకొకసారి క్రమంగా ఈ నదులకు పుష్కరోత్సవాలు వస్తూ వుంటాయి. పుష్కర పర్వము ప్రతినదికి సంవత్సర కాలం ఉంటుంది. మొదటి 12 రోజులు ప్రధాన పుష్కర పర్వదినాలుగా పరిగణింపబడుతాయి. దేవగురువైన బృహస్పతి పుష్కరునితో కలిసి తులారాశిలో ఈ ఏడాది ప్రవేశిస్తుంది కావున కావేరీనదికి పుష్కరం వస్తుంది. కావేరీ పుష్కరాలు సెప్టెంబర్‌ 12న మొదలై 23 వరకు జరుగుతాయి. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణాలు చెప్తాయి.

ఈ సందర్భంగా తమిళనాడులోని కావేరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మహాపుణ్యక్షేత్రాలైన శ్రీరంగం, జంబుకేశ్వరం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచెందూరు, చిదంబరం, కుంబకోణం.. వగైరా, కర్నాటక రాష్ట్రంలోని పుణ్యతీర్థాలు అయిన చెన్నకేశవ స్వామి ఆలయం, భగందేశ్వర ఆలయం, విశ్వేశ్వరాలయాలతో పాటు శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, గంజాంలోని నిమిషాంబాలయం, మైసూరు, శ్రావణబెళగొళ, మంజునాథుడు కొలువుదీరిన ధర్మస్థల, వర్నాడు, కుక్కె సుబ్రమణ్యం, ఉడిపి, శృంగేరి శారదా పీఠము, గోకర్ణం లాంటి మహా పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

Festival of River Kaveri that normally occurs once in 12 years. This Pushkaram is observed for a period of 12 days from the time of entry of Jupiter into Tula rasi (Libra)

No comments: