ఊబకాయం, వృద్ధాప్య ఛాయలు.. నియంత్రించడం ఎలా ? | Amazing Health benefits of Drinking Water from Copper Vessels

మన పూర్వీకులు వాడినంతగా రాగి పాత్రలను మనం వాడడం లేదు. పూజా మందిరలో ఒకటి అరా ఇంకా ఉన్నా అవి పండగలకో పబ్బాలకో కానీ తీయం. అయితే రానురాను మళ్ళీ రాగి పాత్రల వినియోగం పెరుగుతోందనే చెప్పాలి. దీనికి స్టేటస్ సింబల్, కార్పోరేట్ కంపనీల తయారీ.. కారణం ఏదైనా కావచ్చు. ఇది శుభపరిణామం అంటున్నారు వైద్యనిపుణులు. ఎందుకంటే రాగి పాత్రలు వాడడం వల్ల అనేక ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు దాగి ఉండడమే.

మంచినీళ్ళకు కాపర్ బిందెలు, చెంబులు, గ్లాసులు వాడడం వల్ల జీర్ణ వ్యవస్థను సరైన మార్గంలో నడిచేలా చేసి, కొవ్వు, ఇతర చెడు బాక్టీరియాను శరీరం నుండి తీసేస్తుంది. అసిడిటీ, గ్యాస్, అజీర్ణం వగైరా సమస్యలు తలెత్తకుండా చూడడమే కాక కడుపుకి హాయి కలిగించి, ప్రాణాంతకరమైన బాక్టీరియాను కూడా శరీరం నుండి నిర్మూలిస్తుంది. కిడ్నీ, లివర్ చురుకుగా పనిచేయడంలో రాగి పాత్రల్లో నిల్వ నీరు ఎంతగానో తోడ్పడుతుందంటున్నారు.

రాగి మూలకంలో సహజంగా ఉండే యాంటీబాక్టీరియాతత్వం శరీరంలోని అనేక గాయాలను నయం చేయడంతోపాటు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా వృధ్ధాప్య ఛాయలను దరిచేరకుండా చేస్తుంది. రాగిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన రోగాల నుండి సైతం కాపాడుతాయి.


అయితే రాగి పాత్రలను శుభ్రపరచడమెలాగాననేనా మీ సందేహాం. ఈ వంటింటి చిట్కాలు మీకోసం..- సగంకోసిన నిమ్మకాయ ముక్కపై ఉప్పు వేసి రాగిపాత్రలను తోమితే అవి తళతళా మెరుస్తాయి.
- అరకప్పు వెనిగర్‌లో పెద్ద చెంచా ఉప్పు వేసి బాగా కలిపి, ఈ మిశ్రమంతో రాగిపాత్రల్ని తోముకోవచ్చు.
- వంటసోడాతో తోమినా రాగి పాత్రలు శుభ్రమవుతాయి.
 

నిద్ర 'పోతోందా'? | How to Sleep Better | VantintiChitkalu


నిద్ర బాగా పట్టటానికి కొన్ని చిట్కాలు | Simple Tricks for you to Fall Asleep
- ఉదయంపూట ఎక్కువ నీటిని తాగుతూ సాయంత్రానికి తగ్గించాలి.
- సాయంత్రం నుంచి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవద్దు.
- ముఖ్యంగా భోజనం చేయగానే నిద్రపోవద్దు.
- రాత్రి పది నుండి తెల్లావారి నాలుగు గంటల వరకు చక్కని నిద్ర సమయం అని గమనించాలి.


మానసిక ఒత్తిడి దరిచేరనీయద్దు | Can depression cause Heart Attacks? | VantintiChitkalu

మానసిక ఒత్తిడికి లోనై నెగెటివ్‌ ఎమోషన్స్‌ పెరిగితే యాంగ్జయిటీ, డిప్రెషన్‌ కలిగి క్రమేపి హృద్రోగ సమస్యలొస్తాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఒత్తిడి దరిచేరకుండా పాజిటివ్‌ థింకింగ్‌ ని మనలో డెవలప్ చేసుకోవాలి. ఇందులో మానసిక ఉల్లాసం కల్గించే అభిరుచులను అలవర్చుకోవడం అత్యంత ప్రధానమైనది. సృజనాత్మకత ఉన్న ఏ పనైనా ఒత్తిడిని దూరం చేస్తుందనడంలో సందేహం లేదు. తద్వారా హార్మోన్ల సమతుల్యం ఏర్పడి గుండె పదికాలాలు పదిలపడుతుంది. 
https://www.youtube.com/c/vantintichitkalu
 

జ్ఞాపకశక్తి పెంచండిలా.. | Lack of sleep can affect your thinking, efficiency at work and mood | Vantintichitkalu

చక్కని నిద్రతో అందం, ఆరోగ్యం మన సొంతమవుతాయి. అంతేకాకుండా తెలివితేటలు, భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి వంటి కీలకమైన విధులను నిర్వర్తించే సెరిబ్రల్‌ కార్టెక్స్‌ బాగా పనిచేయాలంటే తగినంత నిద్ర తప్పనిసరని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  మరి కమ్మని నిద్రకి ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.
- రోజూ ఒకే సమయానికి పడుకోవడానికి ప్రయత్నించాలి.
- నిద్రకు ముందు ఏ ఒత్తిడికి లోనవ్వకుండా జాగ్రత్తపడాలి.
- అనువైన పరిసరాలు, శరీరానికి సౌకర్యవంతమైన దుస్తులు తప్పనిసరి.
- మెదడును ఉత్తేజపరిచే కాఫీ, టీలకు రాత్రి వేళ దూరంగా ఉండాలి.
- తక్కువ కాంతినిచ్చే బెడ్ ల్యాంప్ లను వాడుకోవడం శ్రేయష్కరం.
- క్రమం తప్పని వ్యాయామం, జాగింగ్, యోగ నిద్రలేమిని దరిచేరనివ్వవు. 

సునాయసంగా వంట చేయడమెలా.. | Time Saving Cooking Tips | VantintiChitkalu

వంట చేయడం కొందరికి సరదా, మరికొందరికి చిరాకు. కిచెన్ లో ఎక్కువ సమయం వృధాకాకుండా రుచిగా, శుచిగా వంటకాలు చేయడం ఎలాగోననే కదా మీ సందేహం. వంట చేయడం వరకు సులువే అనిపించినా దానికి ముందు, వెనుక పనులు చూస్తుంటేనే భయం వేస్తుంది కదా!. కారణం వంటకు సిద్ధం చేసుకోవాల్సిన వాటిలో, ఆ తరవాత శుభ్రపరచడంలో మెళకువలు అవలంభించకపోవడమే. - వంట పనిలో గృహణి మాత్రమే కాకుండా జీవిత భాగస్వామి, పిల్లల సహాయం తీసుకోవాలి.
- సమయానికి హైరానా పడకుండా కుకింగ్ స్టవ్, ప్రెజర్ కుక్కర్, ఇతరత్రా సామాగ్రి బాగానే ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి.
- ఆహారపదార్థాల తయారీలో నాణ్యమైన సరుకులు, సరియైన పాత్రల ఎంపిక చాలా ముఖ్యం అని గమనించాలి.
- ముందస్తు ప్రణాళిక ప్రకారం, ఖాళీ సమయాల్లో కూరగాయలను కట్ చేసి పెట్టుకోవాలి.
- కూరగాయలు, ఆకుకూరలు ముందుగానే శుభ్రపరచి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.
- వంట పూర్తవుతూనే క్లీనింగ్ తో పాటూ ఎక్కడి వస్తువులు అక్కడికి చేర్చాలి.
- గిన్నెలు, డైనింగ్ టేబుల్ పని పూర్తయిన వెంటనే శుభ్రపరచడం మరవద్దు.
- వంట సమయంలో మరేఇతర పనులు పెట్టుకోకపోవడమే ఉత్తమం.

పగలు ఎండ - రాత్రి చలి | Hot and Cold | Extreme Temperature Safety | VantintiChitkalu

పగలు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నా రాత్రి చలి మాత్రం వదలడం లేదు. పగటి వేళ ఎండ మండిపోతోంది. ఉదయం చలి గజగజమనిపిస్తోంది. దీనితో తగు జాగ్రత్తలు వహించకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు. 
 

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో.. | International Mother Language Day

ఈ చిత్రంలో ఉన్న ఆ నలుగురు బెంగాలీ యువకులు - 1952 ఫిబ్రవరి 21న ఢాకాలో మాతృభాష కోసం జరిగిన ఉద్యమంలో కాల్పులకు బలైయ్యారు. మాతృభాష కోసం ప్రాణాలర్పించిన ఆ రోజును ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా 1999 నవంబరు 17న ప్రకటించింది. ఆ బలిదానానికి గుర్తుగా ఢాకా విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఙాపక చిహ్నం ఈ నాటికి చెక్కుచెదరలేదు. బహుభాషాతనాన్ని, భాషా-సాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు, అవగాహన పొందేందుకు ఈ రోజు ఎంతగానో దోహదపడుతుంది.  భాష ప్రతిష్టను గుర్తిస్తేనే మనుగడసాధ్యమని గుర్తించిన ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కూడా 2008ని అంతర్జాతీయ భాషా సంవత్సరంగా ప్రకటించింది.

మాతృభాషపై మమకారం పెంచుకున్న ఎందరో మహనీయులు మన తెలుగును కాపాడేందుకు అహర్నిశలూ శ్రమించారు. ఆంగ్లేయుల పాలనలో మన విద్యార్థులకు కొత్తభాష అవసరమైంది. శతాబ్దాలుగా పుస్తకాల్లో వాడే కట్టుదిట్టమైన భాషలో రాయాలని కొందరన్నారు. వాళ్లకు చిన్నయసూరి నాయకుడయ్యారు. ప్రజల భాషలో రాయడం ప్రపంచం అంతటా ఉన్న పద్ధతి. కాబట్టి మాట్లాడే భాషలోనే రాయాలని కొందరన్నారు. వాళ్లకు గిడుగు రామ్మూర్తి పంతులు నాయకుడయ్యారు. గిడుగు రామ్మూర్తి పంతులు కారణంగా 1906నుంచి వాడుక భాషలో రాయాలన్నది ఒక పెద్ద ఉద్యమమైంది. వాడుక భాష ప్రజల్లో బలంగా నాటుకుంటూ నూరేళ్లలో అత్యున్నతస్థాయికి చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

గతంలో మనం మాట్లాడే తెలుగుభాషలోనే పరిపాలన సాగాలని, అందుకు ప్రత్యేక రాష్ట్రం అవసరమని 1913లో ఆంధ్ర మహాసభ తీర్మానించింది. ఉద్యమం ప్రారంభమైన 40 ఏళ్ల అనంతరం పొట్టి శ్రీరాములు బలిదానంతో 1953లో ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. వావిలాల గోపాలకృష్ణయ్య తెలుగుభాషాభివృద్ధికి చేసిన పోరాటం తెలుగు ప్రజలు మరువలేనిది. దాని ఫలితంగా తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ 1964లో చట్టం చేశారు. ఆగస్టు 29న - 'శిష్ట వ్యవహారిక' రూప శిల్పి గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు -మాతృభాషా దినోత్సవంగా పాటిస్తున్నాం.

ఏ జాతైనా తమ భాష ప్రతిష్టను గుర్తించినప్పుడే ఆ భాష అభివృద్ధి చెంది, మనగలుగు తుంది. 2020 నాటికి చాలా భాషలు కనుమరుగవుతాయని యునెస్కో హెచ్చరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడే 6000 భాషలలో 43% భాషలు, అంతరించిపోయే భాషల జాబితాలో చేరాయంటోంది. ఇది ఇలాగే కొనసాగితే మున్ముందు మిగిలే భాషలు 600 అని ఒక అంచనా… ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష కోసం ఉద్యమం ఉదృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

గ్యాస్‌ వృధా కాకుండా.. | How to Save Cooking Gas | VantintiChitkalu

వంటింటి చిట్కాలు
- వంటకు అన్ని వస్తువులను సిద్ధం చేసుకున్న తర్వాతే గ్యాస్‌ స్టౌవ్‌ను వెలిగించాలి.
- సరియైన మంట, తగినంత నీరు, సరిపడిన పాత్ర ఇలా చిన్నచిన్న విషయాలపై కూడా దృష్టి పెట్టాలి.
- ఉడికే సమయంలో విధిగా పాత్రలపై మూతలను వాడాలి. దీని వల్ల పదార్థాలు త్వరగా తయారవడమే కాక పోషకాలు వృధాకావు. 
- ఎక్కువ నీటితో పప్పులు, కూరగాయలు ఉడికించి పారపోయటం వల్ల పోషకాలే కాకుండా గ్యాస్‌, సమయం కూడా వృధా అని గమనించాలి.
- వంటకు ప్రెషర్‌ కుక్కర్‌ వాడడం వల్ల గ్యాస్‌ను బాగా ఆదా చేసుకోవచ్చు.
- గ్యాస్‌ స్టౌవ్‌ నాబ్, బర్నర్‌ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

ఆరోగ్యమే మహాభాగ్యం | పెరటి మొక్కలు | How to Garden Flowers & Vegetables Together

సరదాగా  పెంచే మొక్కలు  ఇంటికి శోభని మనకు ఎంతో ఆహ్లాదాన్నీస్తాయనడంలో అతిశయోక్తి లేదు. మొక్కలకు నీటిసదుపాయంతో పాటు ఆరోగ్యంగా పెరగడానికి ఎరువులు సరిగా వాడాలి. చీడ దరిచేరకుండా మొక్కలను కాపాడాలి. అలా జాగ్రత్తగా చూసుకుంటూ కాలక్షేపానికో, అందానికో పెంచే  ఈ మొక్కలు మన శరీరానికి వ్యయామంతో పాటుగా మానసికోల్లాసం కలిగిస్తాయి. 

www.vantintichitkalu.com
or

నైపుణ్యం ఉండాలే కాని.. | My Journey with Colours | VantintiChitkalu

ఆటలు, పాటలు, డాన్సులు ఇలా రకరకాల అంశాల్లో పిల్లలు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తారు. ఊహకు రూపాన్నిచ్చి, ఎన్నో పదాలతోనూ చెప్పలేని విషయాన్ని కొద్దిపాటి రేఖలతో చెప్పగలిగే గొప్పకళ.. చిత్రకళ. ఇది అన్నా పిల్లలకు మక్కువే! అటువంటి కళకు అద్దం పడ్తుంది My Journey with Colours.. మీరు ఒక సారి వీక్షించడి..!

వావ్.. వావిలాకు - నొప్పుల నివారణకు | Health Benefits of VITEX NEGUNDO | Vavilaku | VantintiChitkalu

- ఎలాంటి నొప్పులకైనా తక్షణ ఉపశమనం కోసం నీటిలో వావిలాకు వేసి ఉడికించి ఆ నీటిని బాధ కలిగించే శరీర భాగం మీద ధారగా పోస్తే ఎంతో ఫలితం ఉంటుంది.
- వావిలాకు వేసి వేడినీళ్లు కాచి బాలింతలకు స్నానం చేయిస్తే వారి ఒంట్లో వుండే వాతం, నొప్పులు ఇట్టే తగ్గుతాయి.
- తలనొప్పిగా ఉంటే దీని ఆకులను నూరి తలకు పట్టిస్తే సరి. పంటి నొప్పిని కూడా నివారిస్తుంది.
- సింధువార పత్రం ఆకులు, బెరడు కషాయం జ్వరాలకు, జ్వర దోషాలకు చక్కటి విరుగుడు.
- మూర్ఛవ్యాధి ఉన్న వ్యక్తికి వావిలాకు రసం ముక్కులో వేస్తే చక్కని ఫలితముంటుందంటారు.
- చలిజ్వరం నివారణకు అరకప్పు వావిలాకు రసానికి రెండు చెంచాల తేనె కలిపి నిపుణుల సలహామేరకు తీసుకోవాలి.
- వావిలాకు కషాయాన్ని అన్ని రకాల పంటల్లో వచ్చే పురుగును నియంత్రించేందుకు విరివిగా వాడుతారు.

for more Health & Beauty Tips in telugu
Visit 
www.vantintichitkalu.com
&
Subscribe
https://www.youtube.com/c/vantintichitkalu

మెడ నొప్పికి కారణాలేమిటి? | బ్యాక్ పెయిన్ రిలీఫ్ ఎలా? | Common Causes of Back Pain and Neck Pain | VantintiChitkalu


నిలబడటం, కూర్చోవటం, నడవటం, చివరకు నిద్రలో సైతం సరైన విధానాలను అవలంభించకపోవటం చేతనే మెడ నొప్పి, వెన్నునొప్పి భాదిస్తాయి. వీటి నివారణకు తలదిండు, పరుపుల ఎంపిక, బరువులు ఎత్తడంలో జాగ్రత్తలవసరం అంటున్నారు వైద్యనిపుణులు.  

- తలదిండు మరీ పలుచగా, మరీ ఎత్తుగా లేకుండా మెత్తది అయివుండాలి.
- గట్టిగా ఉండే పరుపు ఉపయోగించకూడదు. వెన్నెముక నిటారుగా ఉండేలా పడుకోవాలి.
- వంగి కాకుండా మోకాళ్ళపై కూర్చుని బరువులు ఎత్తడం  మంచిది.
- అదేపనిగా ఎక్కువసేపు కూర్చొకుండా మధ్య మధ్యలో లేచి కాస్త అటూ ఇటూ తిరిగితే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ల నుంచి ఉపశమనం ఉంటుంది.
- కార్ డ్రైవింగ్‌ చేసే సమయంలో సీటు వెనుక భాగంపై వీపును అనించి కూర్చోవాలి.
- ద్విచక్రకవాహనాలపై ప్రయాణంలో వెన్నెముక తిన్నగా ఉండేలా చూసుకోవాలి. 
pc : Internet

తొక్కేం కాదు! | Fruit & Vegetable Peel Benefits | Vantintichitkalu

వంటింటి వ్యర్థాలతో..

- ఉల్లిపాయ పొట్టును కొన్ని నీళ్లలో వేసి మరగపెట్టి, వడకట్టి ఈ నీటిని తలస్నానం చేసిన తరువాత తలపై పోసుకుంటే జుట్టు పట్టుకుచ్చులా మెరుపులీనుతుంది.
- మొటిమలు తగ్గడానికి అరటితొక్కను వాటిపై రుద్ది చూడండి. ఇలా చేస్తే పులిపిర్లు కూడా మటుమాయమే.
- నారింజ పండు తొక్కలు మన చర్మం సహజసిద్ధంగా మారుస్తాయి. నారింజ పండు తొక్కలను నీటిని కలుపుతూ మెత్తగా పేస్ట్ లా చేసుకుని ఫేస్ మాస్క్ వేసుకోవాలి.
- ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసనలను తరమాలంటే కమలాపండు తొక్కల్ని వినియోగించాలి. ఎండబెట్టిన కమలాపండు తొక్కల పొడి కూడా మంచి ఫలితం ఇస్తుంది.

ఫిబ్రవరి 14 : ప్రేమికుల రోజు | Valentine's Day Proposals Dos and Don'ts | VantintiChitkalu

ప్రేమపేరుతో మోసపోకుండా..
- అందచందాలను వర్ణిస్తుంటే ఏ అమ్మాయైనా ఇట్టే బుట్టలో పడాల్సిందేనని కొందరి నమ్మకం. వాస్తవాలను గ్రహించి అమ్మాయిలే అప్రమత్తంగా ఉండాలి.
- ప్రేమంటూ దరిచేరేవారి ప్రవర్తనపై ఆరాతీయాలి. మీతో వ్యవహరిస్తున్న తీరులో మరియేతరులతోనైనా ఉన్నారేమో గమనించాలి. వారి ప్రేమలో నిజాయితీ పాలు ఎంతో లెక్కకట్టిఅడుగేయ్యాలి.
- చదువు, ఉద్యోగం, కుటుంబనేపథ్యం ఇలా పూర్తి వివరాలు రాబట్టగలగాలి.
- పబ్బులు, పార్టీలు ఇలా వేటికైనా ఒంటరి ప్రయాణం అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి. ఒకే అమ్మాయిని ఆహ్వానించడంలో దుర్బుద్ధిదాగుందని పసిగట్టాలి.
- కారణమేదైనా బాయ్ ఫ్రెండంటూ ఒకే హొటల్ గదిలో ఉండడం, కొత్త ప్రంతాలకు వెళ్లడం, రాత్రివేళల్లో కలవడం అన్నీ అత్యంత ప్రమాదకరమే.
- డ్రింకులు, ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి. మత్తుపనీయాల జోలికి వెళ్లకపోవడం శ్రేయస్కరం.
- అన్నీ వేళలా వారితో కలిసే ప్రదేశం నలుగురు అందుబాట్లో ఉండేదై ఉండాలి. నిర్జన ప్రదేశం, ఎత్తైన కొండలు, సెలయేరులంటూ ఎకాంతం మంచిదికాదు.

ఈ విషయాలే కాకుండా యువత భారతదేశంలో పెళ్ళి, కుటుంబ వ్యవస్థలు బలీయమైనవని, ఆదర్శప్రయమైనవని ఎల్లప్పుడూ గుర్తెరగాలి. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు అందగాడా, ధనవంతుడా అని చూసుకోవడం కంటే, గుణానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మంచిది. 




హరహర మహాదేవ | మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో.. | VantintiChitkalu

అనంత వ్రత కోటీనాం.. ఏకబిల్వం శివార్పణం..

ఒక్క ఆకుతో పూజించినా కోటి కోర్కెలనైనా తీర్చే దేవుడు శివుడు. ఆదిదేవుడు నిర్వికారుడు.. నిరాండంబరుడు... ఆ పార్వతీపతిని పూజించాలంటే భక్తులు కూడా ఆర్భాటాలకు, ఆడంబరాలకు పోనక్కరలేదు. పుష్పం, పత్రం, తోయం...ఇందులో పువ్వులు లేకపోయినా ఆకులు, నీళ్లూ ఉంటే చాలు శివుడు సంతృప్తి చెందుతాడు. బిల్వం.. అంటే మారేడు పత్రాలు శంకరుడికి ఎంతో ప్రీతి. అలాగే జలాభిషేకంతోనే ఆయన కరుణ పొందవచ్చు.

బిల్వదళం మూడు ఆకులతో ఉంటుంది. అందుకే త్రిమూర్తుల రూపమని ప్రతీతి. అందులో ఎడమ వైపునున్నది బ్రహ్మ, కుడి వైపునున్నది విష్ణు, మధ్య ఉన్న ఆకు శివుడి రూపమని విశ్వాసం. మూడాకులున్న బిల్వదళాన్ని మాత్రమే సమర్పించాలి. ఇది త్రిశూలానికి సంకేతం. మారేడుని శ్రీఫలం అంటాం. అంటే లక్ష్మీదేవికి ప్రతిరూపం. అందుకే శివానుగ్రహం కోసం కోటి బిల్వ పత్రాలతో పూజించాలనే విశ్వాసం వ్యాప్తిలోకి వచ్చింది. కానీ మోక్షం పొందడానికి ఒక్క బిల్వ పత్రమున్నాచాలు.

సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉండే మారేడుతో వేనవేల లాభాలున్నాయి. మారేడు వృక్షం నుంచి గాలి సోకితేనే ఆరోగ్యం. అందులో సూర్య శక్తి, తేజస్సు ఉంటుంది.శరీరంలోపలా, బయటా చెడును హరిస్తుంది. మారేడు ఆకుల కషాయం తాగితే అరుచి దూరమవుతుంది. జఠరాగ్నిని బాగా రగులుస్తుంది కాబట్టి ఆకలి పుడుతుంది. శ్లేష్మాన్ని, అతిసారాన్ని పోగొడుతుంది. మారేడు ఆకులను నూరి శరీరానికి రాసుకుంటే చర్మసంబంధ వ్యాధులు దూరమవుతాయి. 

# Maha Shivratri - Celebration And Significance

# Necessity of Fasting and Jagaran in Shivratri

తినగ తినగా కాకర తీయగానుండు.. | Best health benefits of Bitter Gourd | करेला | VantintiChitkalu

కాస్త చేదైనా కమ్మని రుచులను అందించేది కాకరకాయ. ఇది అనేక రకాల వంటలతో పాటు సౌందర్యపోషణలోనూ ఉపయోగపడుతుంది. ఆయుర్వేద తదితర సంప్రదాయ చికిత్సా పద్ధతుల్లో వివిధ వ్యాధులను నయం చేయడం కోసం కాకరను వినియోగిస్తారు. కాకరకాయలతో రకరకాల కూరలు, పులుసులు, సూప్స్, సలాడ్స్‌, వడియాలు, పచ్చళ్ళు వగైరా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఎ, బి1, బి2, సి, ఇ, కె ఇలా పలు విటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.

కాకరలోని హైపోగ్లెసీమిక్‌ పదార్థం ఇన్సులిన్‌ స్థాయిని నియంత్రించి, డైయాబెటీస్ ను అదుపు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కాకరకాయ జ్యూస్‌ బాగా ఉపకరిస్తుంది. ఇది ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొవడంలోనూ, రక్తంలోని మలినాలను తొలగించడంలోనూ తోడ్పడుతుంది. అనవసర బరువు తగ్గి అందమైన శరీరాకృతి కోరుకునే వారు చేదుగా ఉన్నా కాకరగాయ రసం తాగాల్సిందే. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి. కాకరకాయ జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే ఎలాంటి అనారోగ్యం దరిచేరదనేది తీపికబురు. 

చిలుగడదుంపని కాల్చుకుని తింటే.. | The health benefits of Sweet Potato | VantintiChitkalu

మహా శివరాత్రి అనగానే జాగారం, ఉపవాసం గుర్తుకొస్తాయి. అలాగే వీటితో పాటు చిలుగడదుంప కూడా. అయితే స్వీట్ పొటాటో తినడం ఏ ఒక్కరోజుకో పరిమితం చేయకుండా తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకపదార్థాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు. సునాయసంగా జీర్ణమయ్యే చిలుగడదుంపతో పిల్లలకు రకరకాల స్నాక్స్ చేసిపెట్టవచ్చు. శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో చిలకడ దుంపది ప్రత్యేక స్థానం. పిండి పదార్థాలు, పీచు, చక్కెరలతో పాటూ అద్భుతమైన పోషకాలు కలిగిన ఈ కందగడ్డ ఎంతో రుచిగా ఉంటుంది. శుభ్రపరచి పచ్చివి, కాల్చి, ఉడికించి.. ఎలా తీసుకున్నా ఎంతో బాగుంటుంది. వీటిని వంటల్లో వాడడంతో కొన్ని కూరలకు రుచిని సంతరిచిపెడతాయి. చిలుగడదుంపలను ముక్కలుగా కోసి అందులో బెల్లం చేర్చి ఉడికిస్తే నిమిషాల్లో ఘుమఘుమలాడే స్వీట్ రెడీ అవుతుంది. 

- జీర్ణశక్తిని పెంచడంలో ఇందులోని పిండి పదార్థాలు బాగా పనిచేస్తాయి.
- స్వీట్ పొటాటోలో ఫైబర్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
- వీటితో సి, డి, ఇ - విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
- రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
- వీటిని కాల్చుకుని తినడం వల్ల ప్రొటీన్లు, ఖనిజాలు రెట్టింపవుతాయి.
- ఇందులోని బీటా కెరటిన్‌ చర్మ సంరక్షణలోను, కంటి చూపు మెరుగుపడడంలోనూ సహకరిస్తుంది.

ముక్కు మీద మచ్చలకు.. | How to remove spectacle marks | VantintiChitkalu

కళ్లజోడు పెట్టుకోవడం వల్ల ముక్కు మీద, పక్కన ఏర్పడే మచ్చలు కనిపించకుండా కొన్ని చిట్కాలు..

- రోజూ రాత్రి నిద్రకుపక్రమించే ముందు బాదం నూనెను ముక్కుకిరువైపులా రాసి నెమ్మదిగా మర్ధన చేయాలి.
- కీరదోస, టమాట, బంగాళాదుంపల రసం కలిపి మచ్చలపై పట్టించి కాసేపటి తరువాత కడిగేసుకోవాలి.
- ఓట్స్ ని పాలతో కలిపి పేస్ట్ లా చేసుకుని కళ్లజోడు నొక్కుకునే ప్రాంతంలో మాస్క్ లా వేసుకోవాలి.

Kitchen and Cooking Tips, Tricks & Secrets in Telugu | వంటింటి చిట్కాలు | VantintiChitkalu

ఇంటి చిట్కా
- పచ్చిమిర్చీ ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలనుకున్నప్పుడు తొడిమలు తీసి ఫ్రిజ్‌లో పెడితే సరి.
- క్యాబేజీ కూర కమ్మని సువాసనలు వెదజల్లడానికి ఉడికించేటప్పుడు చిన్న అల్లం ముక్క వేయండి.
- పిండి వంటలు వండేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే కొద్దిగా చింతపండు వేసి చూడండి.
 
 

సమయం లేదు మిత్రమా! | How to Prepare Public Exams | AP & TS | VantintiChitkalu

'పరీక్షా' కాలం తస్మాత్ జాగ్రత్త!
పరీక్షలకు సిద్ధం కావడం ఎలా..
టీవీ, కంప్యూటర్, ఇతర ఎలాక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు దూరం ప్లీజ్!
పరీక్ష అయ్యాక..
పరీక్షల సమయంలో ఏం తినాలి..
పరీక్షకు ముందు రోజు ఏం చేయాలి..
కంబైండ్ స్టడీస్ జాగ్రత్త గురూ!
కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లు ప్రిపరేషన్ అవ్వాలి ఇప్పుడే..
 



AP SSC | TS SSC | 10th Class Public Examination | Board of Intermediate Education | Telangana State | Andhra Pradesh | Public Examinations | Time Table | Hall Tickets | Results

ప్రధాని నోట TOP కూరగాయలు | PM Modi Says Farmers TOP Priority | Tomato-Onion-Potato | VantintiChitkalu

T for Tomato

O for Onion

P for Potato

టమాట, ఉల్లిపాయ, బంగాళదుంప.. ఇవి దేశం నలుమూలలా విరివిగా వాడతారు. వీటిలో పోషకాలు పుష్కలం

టమాటలలోని లైకోపిన్‌ అనే పదార్థం శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ గా పనిచేస్తుంది. ఎసిడిటితో బాధపడేవారు టమాటతో తయారు చేసిన వంటకాన్ని తింటే ఉపశమనం కలుగుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువ కారణంగా ఇవి ఉత్తమమైన ఆహారంగా పరిగణించవచ్చు. టమాటల్లో ఉండే విటమిన్‌-ఏ కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. జీర్ణశక్తిని పెంచడమేకా కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, పక్షవాతం, గుండె జబ్బులు తగ్గడానికి టమాట దోహదపడుతందని ఆరోగ్యనిపుణుల సూచన.

ఉల్లిగడ్డలో శరీరానికి అవసరమైన పోషకాలు, కొవ్వు తక్కువే అయినా కేలరీలు పుష్కలంగా అందుతాయి. ఆనియన్ రసంలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఉల్లిరసాన్ని, నెయ్యిని సమభాగాలుగా కలిపి ఒక స్పూన్‌ చొప్పున మూడుపూటలా కొన్ని రోజుల పాటు తీసుకుంటుంటే శారీరక బలహీనత దూరమవుతుంది.

బంగాళదుంప పిండి పదార్థాల సమూహం. ఆలుగడ్డలో వివిధ విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీర పోషణకు అవసరమైన పొటాషియం, థయామిన్‌, రైబోఫ్లావిన్‌, ఫోలేట్‌, నియాసిన్‌, మెగ్నీషియం, ఐరన్‌, జింక్‌ వంటి పదార్ధాలు ఎక్కువగానే లభిస్తాయి.

# Karnataka Assembly Elections  # Narendra Modi # TOP # Tomato-Onion-Potato

కళ్ళు కలువల్లా.. | Simple Tips for Healthy Eyes | VantintiChitkalu

ఎప్పుడూ టెలీవిజన్, కంప్యూటర్‌ మానిటర్ చూస్తూండడం, స్మార్ట్‌ఫోన్‌ వాడకం బాగా పెరగడం వల్ల కళ్ళు పొడిబారి మంట, దురదగా అనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఎలాక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు కాస్త దూరం అని చెప్పడం సులువే కాని అలా కుదరనప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం అంటున్నారు కంటి నిపుణులు.
- కళ్ళకు మధ్యమధ్యలో విశ్రాంతి కలిగించాలి. ఆల్మండ్‌ ఆయిల్‌ కాని విటమిన్‌ ఇ ఆయిల్‌గానీ కంటిచుట్టూ రాయాలి.
- కళ్లు తడి ఆరిపోకుండా చుట్టూ కొబ్బరినూనె పూస్తే మంచిది. 
- దూది పింజల్ని చల్లని నీళ్లలో తడిపి తరచూ తుడవడం వల్ల కళ్ళు తడి ఆరిపోకుండా ఉంటాయి.
- చిక్కటి స్వచ్ఛమైన పాలలో దూదిని ముంచి కళ్ళచుట్టూ సున్నితంగా రాస్తే చర్మానికి తగినంత తేమ అందుతుంది.
- కీరా, ఆలు ముక్కలని కళ్ళపై కాసేపు పెట్టుకుని సేదతీరవచ్చు.
- ఐస్‌ముక్కతో కళ్ళ చుట్టూ తుడిస్తే కళ్ళకింద నల్లనిచారలు, ముడతలు ఇట్టే మాయమవుతాయి. 
 

తలస్నానానికి తప్పనిసరిగా.. | Prevent Hair Loss due to Hard Water | VantintiChitkalu

చర్మం నల్లబడడానికి, జుట్టు ఊడిపోవడానికి కారణం అనేక కారణాల్లో ఉప్పు నీరు వాడకం ఒకటి. మనం తాగడానికి రుచి, శుచి ఉన్న నీటినే ఎంచుకుంటాం. అలాగే స్నానానికి కూడా కఠిన జలం వాడకూడదు. మనం వాడుతున్న నీటిలో రసాయనాలు ఏ మేరకు ఉన్నాయనేది సులభంగా తెలుసుకోవచ్చు. అదేలాగంటే ఒక మగ్గు నీళ్ళలో సబ్బు వేసి బాగా కలియతిప్పాలి. నురగ బాగా వస్తే ఆ నీరు కఠిన జలం కాదు. నురగ అంతగా రాకపోతే మాత్రం ఆ నీటిని ముఖ్యంగా తలస్నానానికి వాడకూడదు. ఈ నీటిలో ఉండే కొన్ని రకాల ఖనిజ లవణాలు తల వెంట్రుకలను బలహీనపరుస్తాయి. దీంతో పొడిబారడం, చివర్లు చిట్లి క్రమంగా వూడిపోవడం, నెరవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
మరిన్ని... వంటింటి చిట్కాలు
 

కాలుష్యంలోనూ చర్మం నిగారింపుగా.. | Easy ways to Protect your Skin from Pollution | VantintiChitkalu

ఈ రోజుల్లో బయటికి వెళ్లగానే చర్మం మురికిపట్టడం సహజం. పైగా పొల్యూషన్ కారణంగా కళ్ళు, ముక్కు మంటలు మొదలవుతాయి. అందుకనే బయటికెళ్ళే ప్రతీసారి తగు జాగ్రత్తలు తప్పనిసరి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ముఖం కాంతిహీనంగా తయారయితే తరచూ చల్లని నీటితో శుభ్రపరచుకోవడంతో పాటు రోజుకొకసారి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దీనికి మన కిచెన్ లో లభించే పదార్థాలు ఎంతగానో ఉపకరిస్తాయి. బాగా మగ్గిన టమాటోల గుజ్జును ముఖానికి రాసుకుని కాసేపటి తరవాత కడిగేసుకుంటే మెరుపులీనుతుంది. అలాగే కీరదోస రసం, గ్లిజరిన్‌, రోజ్ వాటర్ లను కలిపి కాని, విడిగా కాని వాడుకోవచ్చు. సరిపడా ఓట్స్‌ను మజ్జిగలో వేసుకుని పేస్ట్ చేసుకుని మురికిపట్టిన ప్రదేశంలో సున్నితంగా మర్దన చేసి కూడా శుభ్రపరచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కళ్ళు, ముక్కులకు సాంత్వన చేకూరడంతో పాటూ చర్మం తాజాగా ఉంటుంది.