ఊబకాయం, వృద్ధాప్య ఛాయలు.. నియంత్రించడం ఎలా ? | Amazing Health benefits of Drinking Water from Copper Vessels

మన పూర్వీకులు వాడినంతగా రాగి పాత్రలను మనం వాడడం లేదు. పూజా మందిరలో ఒకటి అరా ఇంకా ఉన్నా అవి పండగలకో పబ్బాలకో కానీ తీయం. అయితే రానురాను మళ్ళీ రాగి పాత్రల వినియోగం పెరుగుతోందనే చెప్పాలి. దీనికి స్టేటస్ సింబల్, కార్పోరేట్ కంపనీల తయారీ.. కారణం ఏదైనా కావచ్చు. ఇది శుభపరిణామం అంటున్నారు వైద్యనిపుణులు. ఎందుకంటే రాగి పాత్రలు వాడడం వల్ల అనేక ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు దాగి ఉండడమే.

మంచినీళ్ళకు కాపర్ బిందెలు, చెంబులు, గ్లాసులు వాడడం వల్ల జీర్ణ వ్యవస్థను సరైన మార్గంలో నడిచేలా చేసి, కొవ్వు, ఇతర చెడు బాక్టీరియాను శరీరం నుండి తీసేస్తుంది. అసిడిటీ, గ్యాస్, అజీర్ణం వగైరా సమస్యలు తలెత్తకుండా చూడడమే కాక కడుపుకి హాయి కలిగించి, ప్రాణాంతకరమైన బాక్టీరియాను కూడా శరీరం నుండి నిర్మూలిస్తుంది. కిడ్నీ, లివర్ చురుకుగా పనిచేయడంలో రాగి పాత్రల్లో నిల్వ నీరు ఎంతగానో తోడ్పడుతుందంటున్నారు.

రాగి మూలకంలో సహజంగా ఉండే యాంటీబాక్టీరియాతత్వం శరీరంలోని అనేక గాయాలను నయం చేయడంతోపాటు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా వృధ్ధాప్య ఛాయలను దరిచేరకుండా చేస్తుంది. రాగిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన రోగాల నుండి సైతం కాపాడుతాయి.


అయితే రాగి పాత్రలను శుభ్రపరచడమెలాగాననేనా మీ సందేహాం. ఈ వంటింటి చిట్కాలు మీకోసం..- సగంకోసిన నిమ్మకాయ ముక్కపై ఉప్పు వేసి రాగిపాత్రలను తోమితే అవి తళతళా మెరుస్తాయి.
- అరకప్పు వెనిగర్‌లో పెద్ద చెంచా ఉప్పు వేసి బాగా కలిపి, ఈ మిశ్రమంతో రాగిపాత్రల్ని తోముకోవచ్చు.
- వంటసోడాతో తోమినా రాగి పాత్రలు శుభ్రమవుతాయి.
 

No comments: