కుట్టుమిషన్ నేడు సర్వసాధారణమైన పరికరము. ఒకప్పుడు ఒక రకం కుట్టుతో మొదలై నేటి ఫ్యాషన్ కు అనుగుణంగా సాంకేతికతను సంతరించుకుంటూ కొన్ని వందల రకాల కుట్లను అందించడం తో పాటు పొర్టబుల్, హ్యాండీ ఫీచర్ లతో కుట్టుమిషన్ అంటే అప్పుడు-ఇప్పుడు ప్రతీఒక్కరికి అదే క్రేజీ. టెక్స్ టైల్స్, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాలు కొత్తపుంతలు తొక్కుతున్న సమయంలో ఫ్యాషన్ మేకింగ్ లో రకరకాల స్టిచ్ లు, ఎంబ్రాయిడరీ, పీకో తదితర సౌకర్యాలు సీయింగ్ మిషన్ లో లభ్యమవుతున్నాయి.
ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించాలన్న మహిళలకు రకరకాల అల్లికలు, బట్టలు కుట్టడం లాంటివి విశేషంగా చెప్పుకోదగ్గ అవకాశాలు. చాలా మంది మహిళలు ఇళ్ళల్లోనే వివిధ రంగుల్లో, కొత్తకొత్త మోడల్స్ లో డ్రస్సులు కుట్టి రెడీమేడ్ గార్మెంట్స్ షాపుల్లో అమ్ముతున్నారు. వీటికి విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. కుట్టు కూలీలు విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇళ్ళల్లోనే కుట్టుమిషన్ లు ఏర్పరచుకుని ఇంట్లో వారికి బట్టలు కుట్టుకుంటున్నారు. ప్రతి కూడలిలోను కుట్టు శిక్షణ కేంద్రాలు, కుట్టు కేంద్రాలు వెలిశాయి. రోజు రోజుకు మారిపోతున్న స్త్రీల ఫ్యాషన్ ల దుస్తులను స్త్రీలే కుట్టుకోగలరు. పైకి ఎంతో సరళంగా కనిపించే టైలర్ మోడల్ కుట్టు మిషన్ క్లిష్టమైన మెకానిజం తో కూడుకున్నది. ముఖ్యంగా కాలం చెల్లిన మిషన్లు, చాలా కాలంగా ఉపయోగించని మిషన్లతోనే సమస్యలు ఎదురవుతాయి. మిషన్ ను శుభ్రం చేసి, సరిగా ఆయిలింగ్ చేసుకుంటే ఎలాంటి లోపాలు రావు. ఒకవేళ సమస్యలు ఎదురైనా కొంత మిషన్ మెకానిజం పై అవగాహన ఉంటే మెకానిక్ గురించి కాచుకుని కూర్చునే అవసరం కానీ, డబ్బు వృధా కానీ ఉండదు. మిషన్ బాడి, ఫ్లైవీల్, ఫ్రేం, ఫ్రేం వీల్, ఫెడల్ లతో పాటు మిషన్ బాడీలో కొన్ని భాగాలు ధృడంగాను, చాలాకాలం మన్నేట్టుగాను (అరిగిపోకుండా) మిశ్రమ లోహాలతో తయారు చేస్తారు. పెడల్ ని తొక్కినప్పుడు మిషన్ లోని అన్ని భాగాలు నిర్దిష్ట సమయంలో కదలికలు ఉండాలి. మిషన్ భాగాల కదలికలు సక్రమంగా సమయపాలన లేకపోతే కుట్టు సరిగా ఉండకపోగా , సూది విరగడం, దారం ఎక్కువగా వచ్చి చిక్కుపడడం, బట్ట చిరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. బట్టలు కుట్టే మిషన్ లలో ఫ్లై వీల్ ను చేతితో తిప్పే విధంగా, విద్యుత్ మోటర్ అమర్చిన విధంగాను ఉంటాయి. చప్పుడు, లోహ భాగాలు అరిగిపోవడం, కదిలే భాగాలు బిగుసుకు పోవడం, మిషన్ వేగం తగ్గిపోవడం లాంటి ఇబ్బందులు ఆయిలింగ్ చేయకపోవడంతో వస్తాయి. రోజూ వాడే మిషన్ ను వారానికి ఒకసారి, వాడకంలో లేని మిషన్ ను నెలకు ఒకసారి విధిగా ఆయిలింగ్ చేయాలి. ప్రతి రెండు కదిలే లోహ భాగాల మధ్య గ్రీస్, ప్రత్యేకంగా చేయబడిన మిషన్ ఆయిల్ ను వేయాలి. మిషన్ ఆయిల్ గా కొబ్బరినూనె, కిరోసిన్ ల మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. తుప్పు పట్టే భాగాలకు కిరోసిన్ పూయాలి. ఫ్లై వీల్ రాడ్ అమర్చిన బుష్ లు చాలా కాలం విరామం లేకుండా వాడే మిషన్లలో అరిగిపోతాయి. బుష్ లు అరిగిపోవడంతో ఫ్లై వీల్ రాడ్ పట్టుసడలిస్తుంది. అనవసరపు కదలికలతో మిషన్ అన్ని భాగాలు పాడవుతాయి. ముందుగానే ఈ లోపాల్ని గుర్తించి రాడ్ ని గాని, బుష్ ను గాని మార్చుకోవాలి. మిషన్ ను చాలా కాలం మూలకు పెట్టేయడం వల్ల బుష్, రాడ్ ల మధ్య తుప్పు పట్టుకుంటుంది. దీనిని తొలగిస్తే రాడ్ , బుష్ ల మధ్య గ్యాప్ ఏర్పడవచ్చు. ముందుగానే కిరోసిన్ ను వేసి ఉంచితే ఆ సమస్య ఎదురవదు. మెయిన్ క్రాంక్ షాఫ్ట్ లో షటిల్ 'ఫీడ్ డాగ్, నీడిల్ బార్'ల చలనాలు ఏర్పడుతాయి. సూది లోపలికి బయటికి వెళ్ళడానికి అనుగుణంగా షటిల్ కదలికలు ఉండాలి. షటిల్ లో వృత్తాకారంగా ఉన్న లోహపు కొసలు విరిగిపోయినట్టయితే పైవైపు దారాన్ని షటిల్ పట్టుకోకుండా ఎక్కువగా వదులుతుంది. మిషన్ బాడి ముందు భాగంలో ఉన్న స్టిచ్ రెగ్యులేటర్ ను ఉపయోగించాలి. నీడిల్ బార్ పై ఉన్న స్ప్రింగ్ చెడిపోయినా, విరిగిపోయినా ప్రెస్సర్ ఫుట్, ఫీడ్ డాగ్ పళ్ళతో బట్టను అదిమిపట్టక బట్ట జరిగిపోతుంది. అలా జరిగితే స్ప్రింగ్ మార్చడం అవసరం. త్రెడ్ టెన్సన్ రెగ్యులేటర్ అమరికలో రెండు స్టీల్ రేకులు, రెండు తక్కువ టెన్సన్ స్ప్రింగ్ లు ఉంటాయి. దారం రెగ్యులేటర్ గుండా వదులుగా కాకుండా క్రమ పద్ధతిలో వస్తుంది. దీంతో కుట్టు గట్టిగా ఉంటుంది. సున్నా నుండి ఎనిమిది అంకెలు గల రెగ్యులేటర్ అవసరాన్నిబట్టి వాడుకోవాలి. వీటిపై ఆయిలింగ్ చేయకూడదు. అనవసరపు చోట్లలో ఆయిల్ వేయడం వల్ల దారం, గుడ్డలు నూనె మరకల మయమవుతాయి. ఒకసారి ఆయిల్ వేశాక మిషన్ ని నడపడం వల్ల ఆయిల్ మొత్తం సర్దుకుంటుంది. శుభ్రంగా తుడిచి మళ్ళీ కొన్ని ఆయిల్ చుక్కలు అక్కడక్కడ వేయాలి. మిషన్ లోపలి భాగాల్లో బ్రష్ తో శుభ్రం చేయడం మంచిది. స్క్రూలు, నట్లు బిగుతు సడలినప్పుడు సరిగా బిగించుకోవాలి. సూదిని మర్చుకునేప్పుడు సరియైన నంబరుని, అడుగు భాగం నీడిల్ బార్ లో ఉన్న స్టాప్ స్క్రూ వరకు సరిగా ఉందోలేదో చూసుకోవడం అవసరం. బాబిన్ చిన్నదిగా కనిపించినా ఎక్కువ దారం చుట్టగలగాలి. బాబిన్ కి దారం చుట్టేప్పుడు రకరకాల వైండర్ని ఉపయోగించడం వల్ల దొంతర దొంతరలుగా దారం చుట్టుకుని క్రమ పద్ధతిలో వాడకానికి ఇస్తుంది. కొన్ని కుట్టు మిషన్ స్పేర్ పార్ట్స్ తో పాటు బాబిన్లను కూడా కొని పెట్టుకోవాలి. బాబిన్ కి దారం చుట్టడానికి ముందు ఫ్లై వీల్ రిలీజ్ మరను వదులు చేసి మిషన్ ఫ్లై వీల్ వేరు చేయాలి. ఇలా చేయడం వలన ఫ్లైవీలు ఒక్కటే తిరుగుతుంది తప్ప మిషన్ అంతా పనిచేయదు. ఒకసారి ఫ్లైవీలు తిరిగితే బాబిన్ ఎనిమిది చుట్లు తిరుగుతుంది. ఇది త్వరగా బాబిన్ కు దారం చుట్టే పద్దతి. బాబిన్ లకు దారం పక్కరేకులకు మించి చుట్టకుండా షటిల్ ఉన్న బాబిన్ కేసులో పెట్టాలి. దారం కొస కాస్త పైకి వచ్చి ఉండడం చాలా అవసరం.
రాత్రి వేళల్లో మిషన్ దగ్గరగా వెలుతురు సోకడానికి మిషన్లలోనే ప్రత్యేకమైన ఏర్పాట్లు చెయబడి ఉన్నాయి. ఈ ఏర్పాట్లతో బట్టలు కుట్టే వారికి కొలతలు, సూదిలో దారం, బాబిన్ స్పష్టంగా కనిపడతాయి. తక్కువ శక్తిగల 1/20 హెచ్. పి మోటరును కుట్టుమిషన్ ను నడపడానికి ఉపయోగిస్తారు. లెదర్ బెల్ట్ ను తొలగించి చేత్తో నడిచే లేదా పెడల్ తో నడిచే మిషన్లకు మోటారులు అమర్చుకోవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప విద్యుత్ బల్బులు, మోటార్లకు వాడకూడదు. ఇక ఎలక్ట్రానిక్, ఆటోమెటిక్ సీయింగ్ మిషన్ల వాడకంలో, నిర్వహణలో యూజర్ మ్యాన్యువల్ లో ఉన్న సూచనలు తు.చ తప్పక పాటించాలి.
నిత్య జీవితంలో కుట్టుమిషన్ అవసరాన్ని గుర్తించి 1790వ సంవత్సరంలో థామస్ సేన్ రూపకల్పన చేశాడు. ఇప్పుడు సాధారణంగా ప్రతి ఇంట్లో కుట్టు మిషన్ ఉంది. స్పేర్ పార్ట్స్ కొనుగోలు విషయంలో కంపనీ పేరు, కొలతలు, నాణ్యత దృష్టిలో పెట్టుకోవాలి. నాసిరకం, సరిపడని విడి భాగాలు వాడడం వలన పూర్తి మిషన్ పాడయిపోయే ప్రమాదముంది. కాలక్షేపానికే కాక, డబ్బు సంపాదించుకునేందుకు ఉపయోగపడే మిషన్ సంరక్షణలో ఈపాటి జాగ్రత్తలు అవసరం.
రాత్రి వేళల్లో మిషన్ దగ్గరగా వెలుతురు సోకడానికి మిషన్లలోనే ప్రత్యేకమైన ఏర్పాట్లు చెయబడి ఉన్నాయి. ఈ ఏర్పాట్లతో బట్టలు కుట్టే వారికి కొలతలు, సూదిలో దారం, బాబిన్ స్పష్టంగా కనిపడతాయి. తక్కువ శక్తిగల 1/20 హెచ్. పి మోటరును కుట్టుమిషన్ ను నడపడానికి ఉపయోగిస్తారు. లెదర్ బెల్ట్ ను తొలగించి చేత్తో నడిచే లేదా పెడల్ తో నడిచే మిషన్లకు మోటారులు అమర్చుకోవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప విద్యుత్ బల్బులు, మోటార్లకు వాడకూడదు. ఇక ఎలక్ట్రానిక్, ఆటోమెటిక్ సీయింగ్ మిషన్ల వాడకంలో, నిర్వహణలో యూజర్ మ్యాన్యువల్ లో ఉన్న సూచనలు తు.చ తప్పక పాటించాలి.
నిత్య జీవితంలో కుట్టుమిషన్ అవసరాన్ని గుర్తించి 1790వ సంవత్సరంలో థామస్ సేన్ రూపకల్పన చేశాడు. ఇప్పుడు సాధారణంగా ప్రతి ఇంట్లో కుట్టు మిషన్ ఉంది. స్పేర్ పార్ట్స్ కొనుగోలు విషయంలో కంపనీ పేరు, కొలతలు, నాణ్యత దృష్టిలో పెట్టుకోవాలి. నాసిరకం, సరిపడని విడి భాగాలు వాడడం వలన పూర్తి మిషన్ పాడయిపోయే ప్రమాదముంది. కాలక్షేపానికే కాక, డబ్బు సంపాదించుకునేందుకు ఉపయోగపడే మిషన్ సంరక్షణలో ఈపాటి జాగ్రత్తలు అవసరం.
No comments:
Post a Comment