హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆసఫ్‌జా VII చే 1918లో స్థాపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విజయవంతగా నూరు వసంతాలు పూర్తి చేసుకుంది. మూడు రోజుల పాటు జరిగే ప్రారంభ ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సుందరంగా అలంకరించిన క్యాంపస్‌ను ప్రతీఒక్కరు చూసి తరించాల్సిందే. క్యాంపస్‌లోని కళాశాలలు, కార్యాలయాలు, హాస్టల్స్ విద్యుద్దీపాల కాంతుల్లో మెరిసిపోతున్నాయి. ఈ రోజు.. ఏప్రిల్ 26న ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలినాళ్ల నుంచి నేటి వరకు దేశవిదేశాల నుంచి విద్యార్థుల రాకతో వందేండ్లు పూర్తి చేసుకున్నా ఉస్మానియా ఇంకా నిత్య నూతనంగానే కనిపిస్తున్నది.
ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని 1917వ సంవత్సరంలో స్థాపించారు. తొలుత దీనిని అబిడ్స్‌లోని అద్దె భవనంలో ప్రారంభించి అక్కడే తరగతులు నిర్వహించేవారు. నిజాం పరిపాలనా కాలంలో హైదరాబాద్‌లో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజ కుటుంబీకులకు.. సంపన్నవర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశ్యంతో బ్రిటీష్ ప్రభుత్వం 1913లో తమ పాలనలో ఉన్న ప్రాంతాలనేగాక సంస్థానాలలో కూడా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని తీర్మానించింది. ఆ విధంగా పాట్నా, బనారస్, మైసూర్, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి.
No comments:
Post a Comment