ఫ్రిజ్ లో ఇవి పెడితే విషమే! | These foods Never Keep In The Refrigerator | vantintichitkalu


మార్కెట్లో వభిన్న విశిష్ట లక్షణాలు,  పరిమాణాలు గల ఫ్రిజ్ లు లభ్యమవుతున్నా మనకు సరిపడే వాటిని మాత్రమే కొనుగోలు చేసుకోవడం ఉత్తమం.  ముందుగా సరియైన వోల్టేజి స్టబ్లైజర్ తో రిఫ్రిజిరేటర్ నియమంగా వాడుతున్నట్టైతే మనకు రక్షణ పైగా విద్యుత్ ఆదా రెండూ సాధించినట్టే.  అవసరానికి మించి ఒక్క క్షణం కూడా ఫ్రిజ్ తలుపు తెరిచి ఉంచకూడదు. దీని వల్ల బయటి వేడిగాలి లోపలికి చేరి మళ్ళీ చల్లదనం సంతరించుకోవడానికి ఎక్కువ శక్తి సామర్ధ్యాలు ఖర్చవుతాయి, మరికొంత సమయమూ పడుతుంది. నిల్వ చేయాల్సిన ఏ వస్తువునైనా ఫ్రిజ్ లోపల వెనకాల గోడకు తగలకుండా చూసుకోవాలి. లేదంటే శీతలీకరణకి ఎక్కువ సమయం పట్టడంతో పాటూ ఆ వస్తువులు పాడయ్యే ప్రమాదం ఉంది. గది ఊష్ణోగ్రతను మించి పదార్థాలు ఫ్రిజ్ లోపల పెట్టకూడదు. ఆ పదార్థాలు ఫ్రిజ్ లోపల వాతావరణాన్ని చెదరగొట్టి మన ఆరోగ్యానికి హాని కలిగించే బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి. 

 మండు వేసవిలోనూ చల్లని నేస్తం రిఫ్రిజిరేటర్ నిర్వహణలో ఈ మాత్రం మెలకువలు పాటిస్తూ బయటి వేడి లోపలకు, లోపలి చల్లదనాన్ని బయటకు వెల్లకుండా కాపాడే గ్యాస్ కట్, వెలుతురు బలుబులు మొదలైన ఉపకరణాలు చెడిపోయినప్పుడు మంచి ప్రమాణాలు గలవాటితో మార్చుకోవాలి. సరిగా శీతలీకరణ జరగనప్పుడు గ్యాస్ ఫిల్లింగ్, ఇతర మరమ్మతులకు వృత్తిపరమైన నైపుణ్యత ఉన్నవారిని మాత్రమే సంప్రదించాలి. లేదంటే డబ్బుతో పాటు సమయం ఇతర సమస్యలు తప్పవు.


# వేసవి నేస్తం: రిఫ్రిజిరేటర్ | Make Your Refrigerator More Efficient | Troubleshooting & Repairs | Organize Your Fridge This Summer | Save Electricity | Is Your Fridge Making You Sick? | Avoid Food Poisoning | How To Clean A Fridge | Food That Should Never store in the Fridge | ఫ్రిజ్ ఏ దిక్కులో ఉండాలి? | Fridge Vastu

No comments: