జుట్టు ఆరోగ్యానికి గురివింద గింజలు | Prevent Head Lice | Abrus precatorius | Rosary Pea | VantintiChitkalu

గురివింద గింజలను అరగ దీసి తలకు పట్టిస్తే పేలు మాయమయిపోతాయి. పేను కొరుకుడు నివారిస్తుంది.  రోజూ రెండుసార్లు ఇలాచేస్తుంటే త్వరలోనే మంచి ఫలితం కనపడుతుంది.
Click here & Subscribe for More Tips

చుండ్రు మాయం! | Get rid of Dandruff with Natural Home Remedies | హెల్త్ టిప్స్ | VantintiChitkalu

- చుండ్రు నివారణకు తరచూ తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. షాంపూ పూర్తిగా వదిలే వరకు మంచినీటితో శిరోజాలను శుభ్రపరచుకోవాలి.
- తలపై శిరోజాలు ఎక్కువ సేపు తడిగా ఉంటే చుండ్రు సమస్య తీరదు. అందుకనే వెంట్రుకలను వెంటనే తుడిచి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తరవాతే దువ్వడం, నూనెలు రాయడం చేయాలి.
- మెంతులను నానబెట్టి మెత్తగా రుబ్బి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఇది తలకు బాగా పట్టించి కొంత సేపు అయ్యాక తేలికపాటి షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చుండ్రు సమస్య నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
https://www.youtube.com/c/vantintichitkalu
 

నీటుగా సర్దేసుకుందాం | Easy way to Clean & Maintain Bookshelves | VantintiChitkalu

పుస్తకాలను మన ఇంట్లో కూడా శుభ్రంగా, అందంగా లైబ్రరీ లా ఉంచుకోవడం ఎలా అనుకుంటున్నారా.. పుస్తకాల్లోకి పురుగులు, క్రిములు దూరకుండా ఉండాలంటే కనీసం నెలకు ఒక్కసారైనా పుస్తకాలను బాగా దులిపి కాసేపు ఎండలో ఉంచడం మంచిది. పుస్తకాల లైబ్రరీని గాలి, వెలుతురు బాగా సోకే గదిలో ఏర్పాటు చేసుకోవాలి. చిరిగిపోయిన పాత పుస్తకాలు, చిత్తుకాగితాలు, తడిసిన పుస్తకాలు ఏవైనా ఉంటే వెంటనే లైబ్రరీ నుంచి వాటిని వేరు చేయాలి. పుస్తకాల అల్మారాల్లో నాఫ్తాలిన్ ఉండల్ని అక్కడక్కడ ఉంచడం వలన ఎలాంటి పురుగులు దరిచేరవు. కొద్దిపాటి నీటిలో కొంత నాఫ్తాలిన్ ఉండల పొడిని కలిపి పుస్తకాల అంచులకు, బైండింగ్ క్లాత్ కు రాయడం తప్పనిసరి.  పురుగులు ఆశ్రయించకుండా అల్మారాల్లో లవంగాలను అక్కడక్కడ ఉంచితే సరిపోతుంది. బాగా ఆరిన వేపాకులను కాని, కమలా పండు తొక్కలను కాని కప్‌బోర్డుల్లో ఉంచితే పుస్తకాలకు సిల్వర్ ఫిష్ లాంటి పురుగులు దరిచేరవు.  

గోధుమ గడ్డి - ఆరోగ్య విలువలు | Amazing Wheatgrass Benefits | VantintiChitkalu

గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని అని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఆహారంలో గోధుమ గడ్డి రసాన్ని ఒక పోషక పదార్థంగా ఉపయోగించడం మంచిది. అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు.
- గోధుమ గడ్డిలో ప్రొటీన్స్, ఎంజైమ్స్‌, విటమిన్స్, మినరల్స్‌ పుష్కలంగా ఉన్న కారణంగా ఈ రసాన్ని సేవించిన వారికి వెంటనే శక్తి చేకూరుతుంది.
- ఇందులోని క్లోరోఫిల్‌, బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతనోత్తేజం కలిగిస్తుంది.
- గోధుమ గడ్డిలో పీచు ఉన్నందున జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చెక్కర శాతం, కొలెస్ట్రాల్, మల బద్దకాన్ని నివారిస్తుంది.
- గోధుమ గడ్డిలో బి12, ఫోలిక ఆసిడ్‌, ఐరన్‌ సమృద్దిగా ఉండడంతో రోగ నిరోధక శక్తి పెరగడమే కాక ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
- గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు.
- ఈ రసంలోని యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైటో న్యూట్రియంట్స్‌, బీటా కెరోటిన్‌, బయో ఫ్లావో నాయిడ్‌, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ .. వగైరా క్యాన్సర్‌ రోగులకు రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇది క్యాన్సర్‌ కణాలను సైతం నశింపచేస్తుంది.
- ఇది చర్మానికి మంచి టానిక్ అని నిపుణులు చెఫ్తున్నారు. చర్మం పై ముడుతలు మటుమాయ మవడమే కాక చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ముఖం వర్చస్సు పెరగడమే కాక కళ్ళ కింద నల్లని వలయాలు తొలగిపోతాయి.

అయితే గోధుమ గడ్డి రసం ఎంత పరిమాణంలో తీసుకోవాలి? ఎప్పుడు, ఎలా తీసుకోవాలి అనే విషయాలకు న్యూట్రిషియన్‌ ఎక్సపర్ట్‌ సలహా తీసుకోవాల్సిఉంటుంది.

కంటి నిండా నిద్ర లేదంటే..! | Consequences of Insufficient Sleep | vantintichitkalu

మరుసటి రోజుకి సరిపడా శారీరక, మానసిక శక్తి సమకూరాలంటే కంటి నిండా నిద్ర కావాలి అని గమనించాలి. అంటే కనీసం 8 గంటలు తప్పక విశ్రాంతి తీసుకోవాలసిన అవసరం ఉంది. ఈ రోజుల్లో ఉదయం నుంచే ఉరుకులు పరుగులు తప్పవు కనుక రాత్రి ఎంత వీలైతే అంత ముందుగా పక్కపైకి చేరుకోగలగాలి. నిద్రలేమికి గురి కాకుండా రోజూ ఒకే సమయంలో నిద్రపోవటం అలవర్చుకోవాలి. అయితే పడకగదికి కంప్యూటర్‌, సెల్‌ ఫోన్‌, టీవీ... గట్రా ఆమడ దూరం ఉండాలి. లేదంటే నిద్రలేమి తప్పదు. దీని వల్ల రోగ నిరోధక శక్తి సన్నగిల్లి క్రమంగా అనారోగ్యం పాలవుతారు. 
www.vantintichitkalu.com
or
https://www.youtube.com/c/vantintichitkalu

బిజీ లైఫ్ లో ఫ్రెష్ లుక్..| How to look Fresh Faced All Day | VantintiChitkalu

- కొన్ని ఐస్ క్యూబ్ లను ఒక పల్చటి క్లాత్ లో తీసుకుని ముఖంపై మెల్లగా రుద్దాలి. కళ్లపై కొద్దిసేపు అలాగే ఉంచితే అలసట తగ్గుతుంది.
- ఓట్ మీల్ మంచి నేచురల్ స్కిన్ స్క్రబ్బర్ గా పనిచేస్తుంది. ముఖంపై దీనితొ రుద్ది చల్లని నీళ్లతో కడిగితే చర్మంపై మృతకణాలు తొలిగిపోయి కాంతివంతంగా తయారవుతుంది.
- గంధాన్ని ఫేస్ ప్యాక్ లా వేసి, కాసేపయ్యాక చల్లని నీటితో కడిగేస్తే ముఖంలో ఉండే అలసట ఇట్టే మాయమవుతుంది.
vantintichitkalu - a Youtube Channel  
https://www.youtube.com/c/vantintichitkalu

రేగు పండు | బదరీ ఫలం | Mind-blowing Benefits of Jujube Fruit | Apple Ber Fruit | Ganga regi | vantintichitkalu

పేదవాడి ఆపిల్ 'రేగి పండు' లో పుష్కలమైన పోషకాలెన్నో ఉన్నాయి. రేగిపండ్లలో ముఖ్యంగా విటమిన్‌ సి, విటమిన్‌ ఎ, పొటాషియం అధికంగా లభిస్తాయి. అందుకని రేగిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి మానసిక ఒత్తిడిని ఇట్టే దూరం చేస్తాయి. రేగిపళ్లలోని యాంటీఆక్సిడెంట్లు  శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపుతాయి. కాలేయం పని తీరును మెరుగుపడుతుంది. మలబద్ధకం ఉన్నవారు వీటిని ఎంత తింటే అంత మంచిదంటారు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ పండులో లభించే క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి అందడం వల్ల కండరాలు, దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి. రక్తం కూడా శుద్ధి పడుతుంది. చర్మం కాంతిలీనుతుంది. క్యాన్సర్‌ కారకాలను దూరంగా ఉంచుతుంది. అందుకని ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ఏ రకమైన రేగిపండ్లనైనా రోజూ తినొచ్చు. అన్ సీజన్ లో కూడా ఈ లాబాలతో పాటూ ఫ్రెష్ నెస్ మీ సొంతం అవ్వాలంటే వీటితో వడియాలు, షర్బత్ పౌడరు చేసి పెట్టుకోవాలసిందే..!
www.vantintichitkalu
or
https://www.youtube.com/c/vantintichitkalu
 

ఇంటి ముస్తాబు ఇలా.. సరైన ఉపకరణాలు, ఉత్పత్తులు | Good Housekeeping | Cleaning Tips and Tricks | Vantinti Chitkalu


సంక్రాంతి వచ్చింది. ఇల్లు, వాకిలి అంతా శుభ్రపరచుకోవాలి. తక్కువ సమయంలో, ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవాలంటే సరైన పనిముట్లను వినియోగించాలి. అలాగే క్లీనింగ్ పౌడర్, క్లీనింగ్ లిక్విడ్ లు సమయానికి సిద్ధంగా ఉండాలి.

ఇల్లు, పరిసరాలు శుభ్రం చేస్తున్నప్పుడు మిగతా విషయాలమీదికి దృష్టి మళ్ళకుండా ఉండాలంటే చక్కని ప్రణాళికతో పాటూ అవసరమైన అన్నీ వస్తువులను అందుబాటులో పెట్టుకోవాలి. సరిపోని సాధనాలు, నాణ్యత లేని ఉత్పత్తులతో సమయం అంతా వృథా అవుతుందని గమనించాలి.
- దుమ్ము దులపడం, శుభ్రపరచడం, పాలిష్ కోసం విడివిడిగా మూడు మైక్రో ఫైబర్ వస్త్రాలు ఉండాలి.
- గాజు సామాను, అద్దాలు, కిటికీల గ్లాస్ శుభ్రపరచడం కోసం ఒక మెత్తని గుడ్డను ఉపయోగించాలి.
- చీపురు, బ్రష్ లాంటి వాటితో సాధ్యపడదు అనుకున్నప్పుడు వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించడం ప్రయోజనకరం.
- క్రిమిసంహారక మందులు అవసరమున్న చోట వాడడానికి ఇది అనువైన సమయం అని గుర్తించాలి.
- రోజూ వాడే డస్ట్ బిన్ లతో పాటూ, ఎక్కువ చెత్త భర్తీ అయ్యేలాగ రీసైక్లింగ్ బ్యాగ్ లను రెడీ చేసుకోవాలి.
- సోఫా, టీవి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ కవర్స్, దివాన్, బెడ్ షీట్స్ తో పాటూ విండో, డోర్ కర్టెన్లు మార్చడానికి ముందుగానే సిద్దం చేసుకోవాలి.

ఇలా ఇల్లంతా శుభ్రపరచుకుని, అన్నీ వస్తువులు చక్కగా సర్దుకుంటే చార్మింగ్‌ లుక్‌ వస్తుంది. డెకరేటివ్ ఐటమ్స్ తో పాటూ కొన్ని మొక్కలను కూడా జత చేస్తే  ఇల్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
www.vantintichitkalu.com

నిరంతరంగా కూర్చోవద్దు..! | Serious Health Issues from Sitting Too Long | Vantinti Chitkalu


ఇల్లు, కార్యాలయం, ఎక్కడైనా గంటల తరబడి ఒకే స్థలంలో కూర్చోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరంతరంగా ఒకేచోట ఏ కదలిక లేకుండా కూర్చోవడం వల్ల జీవక్రియ తగ్గుతుంది. అంతేకాకుండా కండరాలను బలహీనం చేస్తుంది. కనీసం రెండు గంటలకు ఒకసారైనా లేచి నిలపడానికి ప్రయత్నం చేయాలి. వీలైతే నాలుగు అడుగులు వేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు.
Visit for more videos
https://www.youtube.com/c/vantintichitkalu

అందం - ఆరోగ్యం : ఆలీవ్ ఆయిల్ | Olive Oil Health Benefits | Vantinti Chitkalu

ఆలీవ్ ఆయిల్ ను వంటల్లో ఉపయోగించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ నివారింపబడుతుంది. తద్వారా గుండెకు రక్షణగా పని చేస్తుంది. ఈ మోనోశాచురేటెడ్‌ ఆయిల్ క్యాన్సర్ కారకాలను నియంత్రిస్తుంది. అలాగే సౌందర్యపోషణలోనూ ఆలీవ్ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా జుట్టు ఒత్తుగా నిగనిగలాడడానికి, చర్మకాంతికి, పెదవులు తాజాగా ఉండడానికి .. మరి ఆలీవ్ నూనెను ఎలా ప్రయోగించాలో చూద్దామా..!
- ఒక్కో టేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసం, కోడిగుడ్డు సొన తీసుకుని అన్నిటిని బాగా కలియపెట్టాలి. దీనిని కాస్త ఆలీవ్ ఆయిల్ తో మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి పూర్తి జుట్టుకు పట్టించాలి. అరగంట ఆగాక తలస్నానం చేస్తే జట్టు పట్టుకుచ్చులా మారిపోతుంది.
 
- తేనె, శనగ పిండి, పాలు సరిపడా తీసుకుని చక్కగా కలిపిపెట్టుకోవాలి. దీనికి కాస్త ఆలీవ్‌ ఆయిల్‌ చేర్చుకుని మిక్స్‌ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేసుకుని గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల కాంతిహీనంగా మారిన చర్మం మృదుత్వం సంతరించుకుంటుంది.  

- పెదవులు సహజ సిద్ధంగా మెరుస్తూ ఉండాలంటే కాస్త ఆలీవ్ ఆయిల్ తీసుకుని ఇందులో కొంచం తేనె, పంచదార కలపండి. ఈ మిశ్రమాన్ని పెదాలు బాగా శుభ్రంగా కడుక్కున్న తరువాత రబ్ చేసిచూడండి.
visit & subscribe
https://www.youtube.com/c/vantintichitkalu

తృణధాన్యాలతోనే సైజ్ జీరో..! | Why Is Cereal Important in the Diet? | Vantinti Chitkalu

బరువు ఒక సమస్యా..!
శరీర బరువు తగ్గాలంటే ముందు దానికి తగ్గ కమిట్మెంట్ ఉండాలి.  తీసుకునే ఆహారంలో కాలరీలు, కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండేవిధంగా చూసుకోవాలి. ఇలా డైట్ లో జాగ్రత్తలతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం ఉండాలి.
రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు.. ఇవి తృణధాన్యాలే కదాని చిన్నచూపు తగదు. ఇవి మనకు కావలసిన పోషకాలు, శక్తిని అందించడంతోపాటు శరీర బరువును నియంత్రిస్తాయని నిఫుణులు సూచిస్తున్నారు. పైగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులనుంచి కాపాడతాయి. గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వవు.
- బరువు తగ్గాలనుకునేవారికి రాగులు మంచి ఆహారం. దీనిలో ఫైబర్‌, ఇనుము ఎక్కువగా ఉంటాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది.
- కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు అధిక రక్తపోటును అదుపుచేయగల గుణం సజ్జలకుంది. ఇందులో ఉండే బీ కాంప్లెక్స్‌, విటమిన్స్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పొటాషియమ్‌, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులోని ఫైబర్‌ మలబద్ధక సమస్యను పోగొడుతుంది. ఆస్తమాతో బాధపడే పిల్లలకు సజ్జలతో చేసిన ఆహారం పెట్టడం మంచిది.
- కొర్రల్లో యాంటీయాక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర దారుఢ్యానికి మంచి ఆహారం. అంతేకాకుండా ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేసి మధుమేహాన్ని కట్టడి చేస్తుంది.
- జొన్నలలోని ఫైబర్‌ ఇతర పోషకాలు గుండె సంబంధిత జబ్బులను అదుపు చేస్తాయి. తక్షనం శక్తితో పాటు శరీర ఎదుగుదలకు జొన్నలు ఎంతో మేలు చేస్తాయి. మధుమేహం, గుండెజబ్బులు, కొలెస్ట్రాల్, మలబద్ధకంతో ఇబ్బందిపడేవారు జొన్నలు వాడడం ఎంతో మంచిది.
for more videos 
https://www.youtube.com/c/vantintichitkalu 

కొత్త సంవత్సర శుభాకాంక్షలతో.. | Best New Year 2018 Resolution Idea | Happy New Year! | VantintiChitkalu

నూతన సంవత్సర శుభాకాంక్షలతో..
టెలీఫోన్, టైం వాచ్, క్యాలిక్లేటర్, క్యాలెండర్, అలారం, mp3 ప్లేయర్, వీడియే ప్లేయర్, కెమేరా, ఇంటర్నెట్.. ఏదైనా ఇప్పుడు అరిచేతులోనే... అంటే సెల్ ఫోన్. ఇది ఇప్పుడు మనిషికి నిద్ర, ఆహారాలను కూడా దూరం చేస్తోంది. నేడు అందరికి రోజులో ఎక్కువ సమయం మొబైల్ లో టెక్స్టింగ్, సోషల్ మీడియా, గేమ్స్.. వగైరాతోనే సరిపోతోంది. ఫోన్ కాల్, SMS.. రాకపోయినా అదే పనిగా సెల్ తో కాలం గడిపేస్తుంటారు. ఎలాంటి అలర్ట్స్ లేనప్పుడు అవసరం అయితేనే సెల్ వాడాలని నిర్ణహించుకోవాలి.

ప్రత్యేకించి భోజనం చేసే సమయంలో, ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు తప్పకుండా సెల్ ఫోన్ ని దూరంగా ఉంచడం ఎంతైనా అవసరం. నిద్ర సమయం కూడా కుచించుకుపోకుండా పడకగదికి మొబైల్ ని దూరంగా ఉంచాలి.

మొబైల్ ఫోన్ ని ఎన్ని సౌకర్యాలకు వాడుతున్నా సమయపాలన ముఖ్యమని గమనించాలి. అప్పుడే విలువైన సమయం వృధా కాకుండా ఉంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది.

Wish You A Happy New Year 
from
http://www.vantintichitkalu.com