నీటుగా సర్దేసుకుందాం | Easy way to Clean & Maintain Bookshelves | VantintiChitkalu

పుస్తకాలను మన ఇంట్లో కూడా శుభ్రంగా, అందంగా లైబ్రరీ లా ఉంచుకోవడం ఎలా అనుకుంటున్నారా.. పుస్తకాల్లోకి పురుగులు, క్రిములు దూరకుండా ఉండాలంటే కనీసం నెలకు ఒక్కసారైనా పుస్తకాలను బాగా దులిపి కాసేపు ఎండలో ఉంచడం మంచిది. పుస్తకాల లైబ్రరీని గాలి, వెలుతురు బాగా సోకే గదిలో ఏర్పాటు చేసుకోవాలి. చిరిగిపోయిన పాత పుస్తకాలు, చిత్తుకాగితాలు, తడిసిన పుస్తకాలు ఏవైనా ఉంటే వెంటనే లైబ్రరీ నుంచి వాటిని వేరు చేయాలి. పుస్తకాల అల్మారాల్లో నాఫ్తాలిన్ ఉండల్ని అక్కడక్కడ ఉంచడం వలన ఎలాంటి పురుగులు దరిచేరవు. కొద్దిపాటి నీటిలో కొంత నాఫ్తాలిన్ ఉండల పొడిని కలిపి పుస్తకాల అంచులకు, బైండింగ్ క్లాత్ కు రాయడం తప్పనిసరి.  పురుగులు ఆశ్రయించకుండా అల్మారాల్లో లవంగాలను అక్కడక్కడ ఉంచితే సరిపోతుంది. బాగా ఆరిన వేపాకులను కాని, కమలా పండు తొక్కలను కాని కప్‌బోర్డుల్లో ఉంచితే పుస్తకాలకు సిల్వర్ ఫిష్ లాంటి పురుగులు దరిచేరవు.  

No comments: