ఇంటి ముస్తాబు ఇలా.. సరైన ఉపకరణాలు, ఉత్పత్తులు | Good Housekeeping | Cleaning Tips and Tricks | Vantinti Chitkalu


సంక్రాంతి వచ్చింది. ఇల్లు, వాకిలి అంతా శుభ్రపరచుకోవాలి. తక్కువ సమయంలో, ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవాలంటే సరైన పనిముట్లను వినియోగించాలి. అలాగే క్లీనింగ్ పౌడర్, క్లీనింగ్ లిక్విడ్ లు సమయానికి సిద్ధంగా ఉండాలి.

ఇల్లు, పరిసరాలు శుభ్రం చేస్తున్నప్పుడు మిగతా విషయాలమీదికి దృష్టి మళ్ళకుండా ఉండాలంటే చక్కని ప్రణాళికతో పాటూ అవసరమైన అన్నీ వస్తువులను అందుబాటులో పెట్టుకోవాలి. సరిపోని సాధనాలు, నాణ్యత లేని ఉత్పత్తులతో సమయం అంతా వృథా అవుతుందని గమనించాలి.
- దుమ్ము దులపడం, శుభ్రపరచడం, పాలిష్ కోసం విడివిడిగా మూడు మైక్రో ఫైబర్ వస్త్రాలు ఉండాలి.
- గాజు సామాను, అద్దాలు, కిటికీల గ్లాస్ శుభ్రపరచడం కోసం ఒక మెత్తని గుడ్డను ఉపయోగించాలి.
- చీపురు, బ్రష్ లాంటి వాటితో సాధ్యపడదు అనుకున్నప్పుడు వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించడం ప్రయోజనకరం.
- క్రిమిసంహారక మందులు అవసరమున్న చోట వాడడానికి ఇది అనువైన సమయం అని గుర్తించాలి.
- రోజూ వాడే డస్ట్ బిన్ లతో పాటూ, ఎక్కువ చెత్త భర్తీ అయ్యేలాగ రీసైక్లింగ్ బ్యాగ్ లను రెడీ చేసుకోవాలి.
- సోఫా, టీవి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ కవర్స్, దివాన్, బెడ్ షీట్స్ తో పాటూ విండో, డోర్ కర్టెన్లు మార్చడానికి ముందుగానే సిద్దం చేసుకోవాలి.

ఇలా ఇల్లంతా శుభ్రపరచుకుని, అన్నీ వస్తువులు చక్కగా సర్దుకుంటే చార్మింగ్‌ లుక్‌ వస్తుంది. డెకరేటివ్ ఐటమ్స్ తో పాటూ కొన్ని మొక్కలను కూడా జత చేస్తే  ఇల్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
www.vantintichitkalu.com

No comments: