గోళ్ళు అందంగా.. | Tips for Healthy Nails | VantintiChitkalu

- గోళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే నెలలో రెండు మూడు సార్లు అయినా ఆలివ్ ఆయిల్‌తో మర్దన చేయాలి.

- గోళ్ళు అందవిహీనంగా తయారయితే నిమ్మరసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పది నిమిషాలు నానపెట్టాలి. ఆ తరవాత గోళ్ళను సాఫ్ట్ బ్రష్ తో క్లీన్ చేసుకోవాలి.


సోంపు.. గుబాళింపులు | సుగంధ ద్రవ్యమే కాదు..! | Health Benefits of Fennel Seeds | Saunf | VantintiChitkalu

సోంపు నోటిదుర్వాసన తరమడానికి, భుక్తాయసానికి విరుగుడుగానే కాకుండా చాలా సమస్యలకు ఔషధకారిణిగా ఉపయోగపడుతుంది. సోంపు గింజలనే శుభ్రపరచి నేరుగా తీసుకోవచ్చు. కాస్త రుచికి దోరగా వేయించి కూడా వాడుకోవచ్చు. అయితే పిల్లలకు సోంపు పొడిని, సోంపు వాటర్ ని ఇవ్వవచ్చు. సోంపును కాస్త వేయించి పొడి చేసుకోవాలి. ఇక సోంపు వాటర్ విషయానికి వస్తే నీళ్లలో సోంపును వేసి బాగా మరిగించి, చల్లార్చి వడకట్టాలి. లేదంటే అరగంట పాటూ మంచి నీళ్ళలో సోంపును వేసి బాగా నానినతర్వాత వడకట్టి సోంపు నీటిని వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు సోంపు వంటల్లోనే కాదు. సోంపు టీ కూడా ప్రాచూర్యంలోకి వచ్చింది.

- సోంపు మెదడులో ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా చేయడంతో డిప్రెషన్‌, ఎలాంటి మానసిక ఆందోళనలు దరిచేరవు.
- సోంపు తింటే జీర్ణశక్తి మెరుగుపడడమే కాక ఇతర జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం కూడా తగ్గిపోతాయి.
- ముఖ్యంగా కడుపునొప్పికి, విచేచనం సాఫీగా అవడానికి. నులి పురుగులు పడిపోవడానికి సహకరిస్తుంది.
- కఫం తరిమి దగ్గు, ఆయాసం నయం చేస్తుంది.
- రక్తహీనత ఉన్నవారు సోంపును తరచూ తీసుకోవడం మంచిది. రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది.
- శరీరంలో వేడిని నియంత్రించడంలో, మూత్ర విసర్జనలో వచ్చే మంటను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
- ఇందులోని ఫైటో ఈస్ట్రోజెన్‌ మెనోపాజ్‌ సమస్యల్ని నివారిస్తుంది. ఇందులోని ఫొలేట్‌ గర్భిణులకి ఎంతో మేలు చేస్తుంది.
- సోంపులో అధికంగా ఉండే జింక్‌, సెలీనియం, కాల్షియం వంటి ఖనిజాలు హార్మోన్లను సమన్వయం చేస్తాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
మరిన్ని వంటింటి చిట్కాలకు విజిట్..
 www.vantintichitkalu.com
OR
https://www.youtube.com/c/vantintichitkalu 

చుండ్రు మాయమవ్వాలంటే.. | How to Get Rid of Dandruff - Natural Treatments | Vantinti Chitkalu

తలలో దుమ్ముధూళి చేరకుండా వారానికి మూడు సార్లయినా తక్కువ ఘడత ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. అలాగే ఇంట్లో దొరికే పదార్థాలను వినియోగించి సహజసిద్ధంగా చుండ్రును తరిమేయవచ్చు. చుండ్రు నివారణలో ముఖ్యంగా నిమ్మకాయ రసం, పెరుగు, మెంతులు, వేపాకు పేస్ట్ వగైరా చెప్పుకోవచ్చు. చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారికి వంటింటి చిట్కాలు కొన్ని చూద్దాం.. - జుట్టుకు గోరువెచ్చని కొబ్బరినూనెతో మసాజ్ చేసి చుండ్రును అరికట్టవచ్చు. నూని పట్టించాక ఒక గంటపాటు టవల్ తలకు బాగా చుట్టేసి తరవాత హెయిర్ బాత్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- పెరుగులో నిమ్మరసం కానీ, ఉసిరికాయ పొడిని కానీ కల్పిన మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి అరగంట అయ్యాక గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి.
- కొన్ని వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి, ఓ పావుగంటయిన తరవాత షాంపూతో తలస్నానం చేయాలి.
- కలబంద ఆకుల నుంచి జెల్ ను తాజాగా సేకరించి తలకు రాసుకొని పూర్తిగా ఆరాక తలస్నానం చేయాలి.
- నువ్వుల నూనెలో కాసిని మందార పువ్వులను చేర్చి బాగా మరగనిచ్చి, చల్లారిన నూనెను జుట్టుకు పట్టించాలి.
- గోరువెచ్చని హెయిర్ ఆయిల్ లో కర్పూరం మిళితం చేసి తలకు పట్టించవచ్చు.
- మెంతులను నాన పెట్టి పెరుగుతో కలిపి పేస్ట్ చేసుకుని తలకు పట్టించినా మంచి ఫలితం ఉంటుంది.
for more Tips& Tricks in Telugu
https://www.youtube.com/c/vantintichitkalu 

క్లీనింగ్ టిప్స్ & ట్రిక్స్ | Best Tips to Make Your House Super Clean | ఇంటి శుభ్రత | VantintiChitkalu | వంటింటి చిట్కాలు

- బల్లలు, కుర్చీలు ఇతర చెక్క ఫర్నీచర్ శుభ్రం చేయడానికి టర్పెంటెయిన్ వాడాలి.
- నీలిమందు కలిపిన గోరువెచ్చని నీటితో ఇంట్లో అద్దాలు తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
- వెండి వస్తువులు ఎంత కడిగినా నల్లగా మారితూంటే విభూతి పొడితో తోమితే కాంతివంతంగా వస్తాయి.
- కిచెన్ లో వాడే ప్లాస్టిక్ కంటేనర్లు ఇట్టే వాసన వదలడానికి వెనిల్లా ఎసెన్స్ కలిపిన నీళ్లలో నానబెట్టి కడిగితే సరి.
- బంగారు నగలను పంచదార కలిపిన నీటిలో కాసేపు నానపెట్టి ఆ తరువాత సబ్బునీటితో కడిగి బాగా తుడిచేస్తే తళతళలాడుతాయి.
మరిన్ని చిట్కాలకు.. 
https://www.youtube.com/c/vantintichitkalu
 
 

చలిని తట్టుకునేలా - ఘరం.. ఘరం.. | Tips for Happy Winter | Vantinti Chitkalu | వంటింటి చిట్కాలు

- భోజనానికంటే ముందు ఘరం.. ఘరం.. సూప్స్ తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది.
- ప్రతి రోజు కనీసం రెండు పూటలా గ్రీన్ టీ తాగండి. జీర్ణక్రియ వేగవంతమవుతుంది. ఆరోగ్యంతో పాటు అందం కూడా ఇనుమడింపచేస్తుంది. మనం ఉల్లాసంగా ఉండేలా గ్రీన్ టీ దోహదం చేస్తుంది.
- బెల్లంలో ఐరన్‌ బాగా ఉంటుంది. ఇది శరీరంలోని హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. అంతేకాదు రక్తంలో ఆక్సిజన్‌ సరఫరా మెరుగుపరిచి ఫలితంగా కాలుష్య ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకోగలం.
- మెంతులను బాగా నానపెట్టి మెత్తగా రుబ్బి తలకు పట్టించి కాసేపాయ్యాక తలస్నానం చేస్తే చండ్రు సమస్య మటుమాయం అవుతుంది.

మీరు ఫ్రెష్ గా, యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా.. | Health Benefits of Sesame Seeds | Organic Facts | Vantinti Chitkalu

నువ్వులు - ఆరోగ్య ప్రయోజనాలు
నువ్వులు చిన్నవిగా ఉంటాయి, కానీ వీటి వల్ల భారీ ఆరోగ్య ప్రయోజనాలే చేకూరుతాయి. ఇవి పూర్తిగా నాణ్యమైన ప్రోటీన్ లతో నిండి ఉంటాయి. నువ్వుల గింజలు మెగ్నీషియం ఇతర పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. అందుకని మధుమేహం నివారించడానికి నువ్వుల నూనె ఉపయోగపడుతుంది. అలాగే రక్తపోటు తగ్గించడంలో సహాయకారి అని చెప్పవచ్చు. మనలోని మెగ్నీషియం లోపాన్ని నువ్వులు తరుముతాయి. అయితే ఎంత సేపు తెల్లనువ్వులే వాడకుండా నల్లవి కూడా వాడుకోవాలి. వీటిలో పోషక పదార్థాలు మరిన్ని ఎక్కువే అని చెప్పాలి. ఇందులోని ఫైతోస్తేరాల్స్ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నిరోధిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నువ్వులు అధికంగా ఫైబర్ కలిగి ఉండడంతో జీర్ణక్రియకు ఎంతో చక్కగా తోడ్పడుతాయి. వీటిలో అన్నీ రకాల గింజల్లో కంటే ఫైటోస్టెరాల్ కంటెంట్ సమృద్ధిగా ఉండడంతో పలురకాల క్యాన్సర్లను నిరోధిస్తాయి. ప్రధానంగా నల్లనువ్వుల్లోని ఇనుము రక్తహీనతను దరిచేరనివ్వదు. అందుకే బలహీనంగా ఉన్నవారు నువ్వుల నూనెతో పాటు, నువ్వులతో తయ్యారయ్యే ఆహారపదార్థాలు తరచూ తీసుకోవడం ఉత్తమం. వీటితో లభించే అధిక రాగి మూలకం వల్ల ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. పైగా ఎముకలు, కీళ్ళు, రక్త నాళాలు బలపడుతాయి.

పాలల్లోకంటే కూడా నువ్వులు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి. జింక్ కంటెంట్ కూడా ఎక్కువే. దీని కారణంగా ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతాయి. పిల్లల ఎదుగుదలకు నువ్వుల నూనెతో మర్థనా ఎంతో సహాయపడుతుంది. వారిలో చక్కని నిద్రను అందిస్తాయి. చర్మం పొడిబారకుండా, పలు సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. నువ్వుల్లోని ఒత్తిడి తగ్గించే ఖనిజాలు ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం శారీరకంగా ప్రయోజనాలు చేకూర్చడమే కాకుండా మానసిక ఆందోళనలను దూరం చేసి ప్రశాంతతను చేకూరుస్తాయి. నిద్రలేమిని తరిమికొడతాయి.

సహజ సౌందర్యంలోనూ నువ్వులు, నువ్వుల నూనె ఎంతో ప్రముఖమైనవి. ఆరోగ్యకరమైన స్కిన్ కోసం అధిక జింక్ కంటెంట్ ఉన్న నువ్వులు ఉపయోగపడ్తాయి. నువ్వల నూనెలో ఉన్న విటమిన్ - ఇ, విటమిన్ - బి లు దెబ్బతిన్న శరీర కణజాలాలను రిపేర్ చేస్తుంది. చర్మం మెరుపులీనేలా చూస్తుంది. రోజూ నువ్వుల నూనె వాడడం వల్ల చర్మ సంబంధ క్యాన్సర్లను తగ్గిస్తుంది. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాలను నిరోధించి చర్మాన్ని కాపాడుతుంది. చర్మం రంగు మారకుండా, ముడుతలు దరిచేరకుండా చేస్తుంది. అలాగే నిగనిగలాడే జుట్టుకోసం కూడా ఎన్నో అవసరమైన పోషకాలతో నిండిన నువ్వుల నూనెను వాడుకోవడం శ్రేష్టం. 

వంటింటి చిట్కాలు | What Kitchen Short Cuts Am I Missing? | Tips and Tricks in Telugu | Vantinti Chitkalu

వంటింట్లో చిన్న చిన్న చిట్కాలే సమయాన్ని, ఆహార పదార్థాలను వృధాకాకుండా చూస్తాయి. పైగా ఎంతో రుచిని, పోషక పదార్థాలను ఇనుమడింపచేస్తాయి. అలాంటి వంటింటి చిట్కాలు మచ్చుకు కొన్ని చూద్దాం..

నిమ్మ పండుని కోసేముందు బలంగా గట్టుపైన చేతులతో నలపాలి. ఆ తరువాత మధ్యలోకి కోసి పిండితే రసం సులువుగా వస్తుంది.

కరివేపాకుని బాగా కడిగి శుభ్రపరచుకుని, ఎండపెట్టి పొడి చేసి, బద్రపరుచుకుని నిత్యం కూరల్లో వేసుకుంటే కమ్మటి సువాసనలు వెదజల్లుతాయి.

తరిగిన బెండకాయ ముక్కల మీద కాస్త నిమ్మరసం చల్లితే వండేటప్పుడు జిగురు ఉండదు.

అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని తరిగాక మజ్జిగ కలిపిన నీటిలో వేయాలి.

వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఒక స్పూను పాలు వేసిన నీటిలోకి తరుగుకోవాలి.

క్యాబేజీ ఎంత ఉడికించినా వాసన వదలట్లేదా.. చిన్న అల్లం ముక్కను చేర్చి చూడండి.

సాంబార్లో ఉప్పు ఎక్కువైందా.. అందులో ఉడికించిన బంగాళ దుంపలు కలిపితే సరి.

మరెన్నో కిచెన్, హెల్త్, బ్యూటీ, క్లీనింగ్ వగైరా టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం vantintichitkalu యూట్యూబ్ ఛానల్ సబ్స్కైబ్ చేసుకోవాలసిందే.. 

అల్లం - వెల్లుల్లి : ఆరోగ్య ప్రయోజనాలు | Medicinal Foods: Garlic and Ginger | Telugu Health Tips | Vantinti Chitkalu | వంటింటి చిట్కాలు

అల్లం, వెల్లుల్లి.. ఇవి రోజూవారి వంటలో చేరితేనే రుచి. పైగా ఆరోగ్యకరం.
అల్లంతో పైత్యం వదలాల్సిందే
అల్లంలో పొటాషియం, మెగ్నీషీయం, మ్యాంగనీస్‌, ఫాస్పరస్‌, జింక్‌, విటమిన్‌-ఎ, విటమిన్‌-సి, విటమిన్‌-ఇ, విటమిన్‌-బికాంప్లెక్స్‌ వంటి ఎన్నో ఖనిజాలు, పోషక విలువలు వుంటాయి. ఇవి చాలారోగాలను నయం చేయడంతో పాటుగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఎన్నో ఆరోగ్యకరమైన పోషక విలువలను కలిగిన ఈ అల్లాన్ని రోజూ వాడగలిగితే మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.
- అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్ పెడుతుంది.
- అల్లం టీ తీసుకోవడంతో జీర్ణ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి.
- కడుపునొప్పి, శరీరంలో ఇతర నొప్పులు, జలుబు, దగ్గుకు అల్లం చక్కగా పనిచేస్తుంది.
- శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడంలో అల్లం సహాయకారి.

వెల్లుల్లితో గుండె పదిలం
వెల్లుల్లిలో అనేక రకాలైన విటమిన్లు, అయోడిన్, సల్ఫర్, ఆంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిని ఆహారంలో ప్రతి రోజు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చివెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్‌ను కరిగించి ఒబిసిటీ సమస్యను దూరం చేస్తుంది. జలుబు, చెవు నొప్పి, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు తదితర రుగ్మతలు దరిచేరవు. వెల్లుల్లి పేస్టు మొటిమలను నివారిస్తుంది.
for more health hacks in Telugu..
visit 
https://www.youtube.com/c/vantintichitkalu

పిల్లలు - జుట్టు | How to Care for a Child's Hair | Vantinti Chitkalu

What children should eat?
How can we stay healthy for kids?
...
for more Tips to Help Children Develop Healthy Habits
Visit : https://www.youtube.com/c/vantintichitkalu

మిరపకాయ్ - వంటింటిరాణి | What is Chillies good for? | Amazing Benefits of Mirchi | Cayenne Pepper | Vantinti Chitkalu

హెల్త్ టిప్స్
 
కారం చక్కని ఆరోగ్యానికి తప్పనిసరి. మిరప మేటి ఔషధకారిణి. పండు మిరప పచ్చడి, చల్ల మిరపకాయలు ఆధ్రుల అభిమాన ఆహారపదార్థాలు. మిరపకాయ కారంగా ఉండడానికి ప్రధాన కారణం కాప్సిసిన్ అనే ఆల్కలాయిడ్ మెండుగా ఉండడమే. మిరపకాయలో మాంసకృత్తులు, భాస్వరం, ఇనుము, కాల్సియం, మెగ్నీషియం - ఇతర ఖనిజలవణాలు తృణధాన్యాలలో కంటే హెచ్చుగా ఉంటాయి. ఎ, బి, సి, ఇ - విటమిన్లు కూడా మిరపలో పుష్కలంగా లభ్యమవుతాయి. ఎన్నో రకాల పోషక విలువలు, ఔషధ గుణాలు మిరపలో దాగి ఉన్నాయి. అలవాటుగా రోజూ పచ్చిమిరప, ఎండుమిరప, కారం పొడి, కూరమిరపకాయలను (కాప్సికమ్)  వాడటం పరిపాటి. మిరప మన ఆహారంలో కలవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదపడుతుంది. విటమిన్-బి, విటమిన్-ఇలు సమృద్దిగా లభించడం వల్ల పలు లైంగిక రగ్మతలకు దూరంగా ఉండవచ్చు. చర్మానికి, కంటికి చక్కని ఆరోగ్యం చేకూర్చడానికి విటమిన్-ఎ అవసరం ఉంటుంది. నరాలకు, కండరాలకు, రక్తవృద్ధికి, జుత్తుకు చక్కని పుష్టి కలిగించడంలో విటమిన్-బి పనిచేస్తుంది. విటమిన్-సి పళ్ళ చిగుళ్ళు, దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. అలాగే మిరపలో లభించే విటమిన్-ఇ చర్మసంబంధవ్యాధులను, కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించడంలోను,  కొన్ని రకాల హృద్రోగాలను నయంచేయడంలోను సహాయపడుతుంది. మిరపలో లభించే కాల్సియం, భాస్వరం లక్షణాలు ఎముకల నిర్మాణానికి, ఇనుము రక్తకణాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. కారణంగా మహిళలకు ఇవి అత్యవసరం అని చెప్పవచ్చు.

మిరపను ఆయుర్వేదంలోనూ, గృహ చికిత్సలలోనూ  విరివిగా వాడుతారు. యాన్టీ బ్యాక్టీరియా లా పనిచేస్తూ ఎలాంటి ఇన్ఫెక్షన్ లు దరిచేరకుండా చూస్తుంది. ఇందులో ఉండే ఎండోఫిన్స్ ఎలాంటి నొప్పులనైనా హరించివేసి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడుతాయి. ఇంత మేలు చేసే మిరపను మితంగానే తీసుకోవాల్సి ఉంటుంది.

చామంతి పువ్వు మోము | Amazing Health Benefits of Chamomile Flower | Chamanthi Puvvu | Vantinti Chitkalu

చలికాలం కూడా ముఖం పువ్వులాగా వికశించాలంటే చామంతి ఫేస్ ప్యాక్ వేసుకోవాల్సిందే. ఈ కాలంలో ఎన్ని మాయిశ్చరైజర్లు అప్లై చేసినా కొద్దిసేపటిలోనే చర్మం పొడిబారి ఇబ్బంది పెడుతుంది. మరి రోజంతా మృదువుగా ఉండాలంటే ఈ చిట్కా పాటించాలి. చామంతి ప్యాక్ ఇప్పటికిప్పుడు ఎలాగబ్బా అనేనా మీ ఆలోచన.. అదేలాగో చూద్దాం.

బాగా శుభ్రపరచి కొన్ని చామంతి పువ్వులను నీళ్లలో ఉడకపెట్టాలి. వడకట్టిన ఈ నీటిలోకి కొన్ని పాలు, కాస్త తేనే చేర్చి బాగా కలియపెట్టాలి. ఈ మిశ్రమమే మీ చామంతి ఫేస్ ప్యాక్...  శీతాకాలంలో రోజూ ఉదయం దీనితో ముఖంపై బాగా మర్దన చేసి, గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇక రోజంతా ముఖారవిందమే..

చలికాలం చిట్కాలు | Stay Healthy in this Winter | Prevention | vantinti Chitkalu

చలి - పులి : శీతాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని టిప్స్..
చలికాలం.. అందం, ఆరోగ్యం పై ప్రతీఒక్కరు శ్రద్ద పెట్టాల్సిన సమయం. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దుల ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే టీనేజర్స్ సైతం శీతాకాలంలో తీసుకునే ఆహారం, వేసుకునే దుస్తులు, స్నానం, నిద్ర.. ఇలా ప్రతీ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. జీర్ణక్రియ మందగించడం, రోగ నిరోధక శక్తి క్షీణించడం మూలంగా పలు రుగ్మతలకు దారి తీయకుండా ఉండాలంటే.. సమయానికి ఆహారం వేడిగా తీసుకోవడం తో పాటు తాజా పండ్లు, పండ్ల రసాలు తప్పనిసరి. నిత్యం నడక, వ్యాయామం, సరిపడా నిద్ర అవసరం. ఉదయం పూట సూర్యరశ్మి శరీరానకి చాలా అవసరం. అయితే ఎండను ఎదుర్కోవడానికి తగు మెళకువలు తప్పవు.  బయటికి వెళ్లేప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ తప్పక రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. పచ్చికూరలూ పళ్లూ అధికంగా తినాలి. 
Visit.... https://www.youtube.com/c/vantintichitkalu