మిరపకాయ్ - వంటింటిరాణి | What is Chillies good for? | Amazing Benefits of Mirchi | Cayenne Pepper | Vantinti Chitkalu

హెల్త్ టిప్స్
 
కారం చక్కని ఆరోగ్యానికి తప్పనిసరి. మిరప మేటి ఔషధకారిణి. పండు మిరప పచ్చడి, చల్ల మిరపకాయలు ఆధ్రుల అభిమాన ఆహారపదార్థాలు. మిరపకాయ కారంగా ఉండడానికి ప్రధాన కారణం కాప్సిసిన్ అనే ఆల్కలాయిడ్ మెండుగా ఉండడమే. మిరపకాయలో మాంసకృత్తులు, భాస్వరం, ఇనుము, కాల్సియం, మెగ్నీషియం - ఇతర ఖనిజలవణాలు తృణధాన్యాలలో కంటే హెచ్చుగా ఉంటాయి. ఎ, బి, సి, ఇ - విటమిన్లు కూడా మిరపలో పుష్కలంగా లభ్యమవుతాయి. ఎన్నో రకాల పోషక విలువలు, ఔషధ గుణాలు మిరపలో దాగి ఉన్నాయి. అలవాటుగా రోజూ పచ్చిమిరప, ఎండుమిరప, కారం పొడి, కూరమిరపకాయలను (కాప్సికమ్)  వాడటం పరిపాటి. మిరప మన ఆహారంలో కలవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదపడుతుంది. విటమిన్-బి, విటమిన్-ఇలు సమృద్దిగా లభించడం వల్ల పలు లైంగిక రగ్మతలకు దూరంగా ఉండవచ్చు. చర్మానికి, కంటికి చక్కని ఆరోగ్యం చేకూర్చడానికి విటమిన్-ఎ అవసరం ఉంటుంది. నరాలకు, కండరాలకు, రక్తవృద్ధికి, జుత్తుకు చక్కని పుష్టి కలిగించడంలో విటమిన్-బి పనిచేస్తుంది. విటమిన్-సి పళ్ళ చిగుళ్ళు, దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. అలాగే మిరపలో లభించే విటమిన్-ఇ చర్మసంబంధవ్యాధులను, కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించడంలోను,  కొన్ని రకాల హృద్రోగాలను నయంచేయడంలోను సహాయపడుతుంది. మిరపలో లభించే కాల్సియం, భాస్వరం లక్షణాలు ఎముకల నిర్మాణానికి, ఇనుము రక్తకణాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. కారణంగా మహిళలకు ఇవి అత్యవసరం అని చెప్పవచ్చు.

మిరపను ఆయుర్వేదంలోనూ, గృహ చికిత్సలలోనూ  విరివిగా వాడుతారు. యాన్టీ బ్యాక్టీరియా లా పనిచేస్తూ ఎలాంటి ఇన్ఫెక్షన్ లు దరిచేరకుండా చూస్తుంది. ఇందులో ఉండే ఎండోఫిన్స్ ఎలాంటి నొప్పులనైనా హరించివేసి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడుతాయి. ఇంత మేలు చేసే మిరపను మితంగానే తీసుకోవాల్సి ఉంటుంది.

No comments: