మీరు ఫ్రెష్ గా, యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా.. | Health Benefits of Sesame Seeds | Organic Facts | Vantinti Chitkalu

నువ్వులు - ఆరోగ్య ప్రయోజనాలు
నువ్వులు చిన్నవిగా ఉంటాయి, కానీ వీటి వల్ల భారీ ఆరోగ్య ప్రయోజనాలే చేకూరుతాయి. ఇవి పూర్తిగా నాణ్యమైన ప్రోటీన్ లతో నిండి ఉంటాయి. నువ్వుల గింజలు మెగ్నీషియం ఇతర పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. అందుకని మధుమేహం నివారించడానికి నువ్వుల నూనె ఉపయోగపడుతుంది. అలాగే రక్తపోటు తగ్గించడంలో సహాయకారి అని చెప్పవచ్చు. మనలోని మెగ్నీషియం లోపాన్ని నువ్వులు తరుముతాయి. అయితే ఎంత సేపు తెల్లనువ్వులే వాడకుండా నల్లవి కూడా వాడుకోవాలి. వీటిలో పోషక పదార్థాలు మరిన్ని ఎక్కువే అని చెప్పాలి. ఇందులోని ఫైతోస్తేరాల్స్ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నిరోధిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నువ్వులు అధికంగా ఫైబర్ కలిగి ఉండడంతో జీర్ణక్రియకు ఎంతో చక్కగా తోడ్పడుతాయి. వీటిలో అన్నీ రకాల గింజల్లో కంటే ఫైటోస్టెరాల్ కంటెంట్ సమృద్ధిగా ఉండడంతో పలురకాల క్యాన్సర్లను నిరోధిస్తాయి. ప్రధానంగా నల్లనువ్వుల్లోని ఇనుము రక్తహీనతను దరిచేరనివ్వదు. అందుకే బలహీనంగా ఉన్నవారు నువ్వుల నూనెతో పాటు, నువ్వులతో తయ్యారయ్యే ఆహారపదార్థాలు తరచూ తీసుకోవడం ఉత్తమం. వీటితో లభించే అధిక రాగి మూలకం వల్ల ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. పైగా ఎముకలు, కీళ్ళు, రక్త నాళాలు బలపడుతాయి.

పాలల్లోకంటే కూడా నువ్వులు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి. జింక్ కంటెంట్ కూడా ఎక్కువే. దీని కారణంగా ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతాయి. పిల్లల ఎదుగుదలకు నువ్వుల నూనెతో మర్థనా ఎంతో సహాయపడుతుంది. వారిలో చక్కని నిద్రను అందిస్తాయి. చర్మం పొడిబారకుండా, పలు సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. నువ్వుల్లోని ఒత్తిడి తగ్గించే ఖనిజాలు ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం శారీరకంగా ప్రయోజనాలు చేకూర్చడమే కాకుండా మానసిక ఆందోళనలను దూరం చేసి ప్రశాంతతను చేకూరుస్తాయి. నిద్రలేమిని తరిమికొడతాయి.

సహజ సౌందర్యంలోనూ నువ్వులు, నువ్వుల నూనె ఎంతో ప్రముఖమైనవి. ఆరోగ్యకరమైన స్కిన్ కోసం అధిక జింక్ కంటెంట్ ఉన్న నువ్వులు ఉపయోగపడ్తాయి. నువ్వల నూనెలో ఉన్న విటమిన్ - ఇ, విటమిన్ - బి లు దెబ్బతిన్న శరీర కణజాలాలను రిపేర్ చేస్తుంది. చర్మం మెరుపులీనేలా చూస్తుంది. రోజూ నువ్వుల నూనె వాడడం వల్ల చర్మ సంబంధ క్యాన్సర్లను తగ్గిస్తుంది. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాలను నిరోధించి చర్మాన్ని కాపాడుతుంది. చర్మం రంగు మారకుండా, ముడుతలు దరిచేరకుండా చేస్తుంది. అలాగే నిగనిగలాడే జుట్టుకోసం కూడా ఎన్నో అవసరమైన పోషకాలతో నిండిన నువ్వుల నూనెను వాడుకోవడం శ్రేష్టం. 

No comments: