సోంపు.. గుబాళింపులు | సుగంధ ద్రవ్యమే కాదు..! | Health Benefits of Fennel Seeds | Saunf | VantintiChitkalu

సోంపు నోటిదుర్వాసన తరమడానికి, భుక్తాయసానికి విరుగుడుగానే కాకుండా చాలా సమస్యలకు ఔషధకారిణిగా ఉపయోగపడుతుంది. సోంపు గింజలనే శుభ్రపరచి నేరుగా తీసుకోవచ్చు. కాస్త రుచికి దోరగా వేయించి కూడా వాడుకోవచ్చు. అయితే పిల్లలకు సోంపు పొడిని, సోంపు వాటర్ ని ఇవ్వవచ్చు. సోంపును కాస్త వేయించి పొడి చేసుకోవాలి. ఇక సోంపు వాటర్ విషయానికి వస్తే నీళ్లలో సోంపును వేసి బాగా మరిగించి, చల్లార్చి వడకట్టాలి. లేదంటే అరగంట పాటూ మంచి నీళ్ళలో సోంపును వేసి బాగా నానినతర్వాత వడకట్టి సోంపు నీటిని వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు సోంపు వంటల్లోనే కాదు. సోంపు టీ కూడా ప్రాచూర్యంలోకి వచ్చింది.

- సోంపు మెదడులో ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా చేయడంతో డిప్రెషన్‌, ఎలాంటి మానసిక ఆందోళనలు దరిచేరవు.
- సోంపు తింటే జీర్ణశక్తి మెరుగుపడడమే కాక ఇతర జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం కూడా తగ్గిపోతాయి.
- ముఖ్యంగా కడుపునొప్పికి, విచేచనం సాఫీగా అవడానికి. నులి పురుగులు పడిపోవడానికి సహకరిస్తుంది.
- కఫం తరిమి దగ్గు, ఆయాసం నయం చేస్తుంది.
- రక్తహీనత ఉన్నవారు సోంపును తరచూ తీసుకోవడం మంచిది. రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది.
- శరీరంలో వేడిని నియంత్రించడంలో, మూత్ర విసర్జనలో వచ్చే మంటను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
- ఇందులోని ఫైటో ఈస్ట్రోజెన్‌ మెనోపాజ్‌ సమస్యల్ని నివారిస్తుంది. ఇందులోని ఫొలేట్‌ గర్భిణులకి ఎంతో మేలు చేస్తుంది.
- సోంపులో అధికంగా ఉండే జింక్‌, సెలీనియం, కాల్షియం వంటి ఖనిజాలు హార్మోన్లను సమన్వయం చేస్తాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
మరిన్ని వంటింటి చిట్కాలకు విజిట్..
 www.vantintichitkalu.com
OR
https://www.youtube.com/c/vantintichitkalu 

No comments: