పెసర దినుసులు రుచితో పాటు చక్కని ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. పెసరలో బి, సి విటమిన్ లతో పాటు పలు ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా పెసర చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తుంది. సూర్యుని నుంచి వెలువడే ఆల్ట్రావయిలెట్ కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యలను ఇట్టే అదిగమించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జుట్టు సొంతమవుతుంది. సున్నిపిండి తయారీలో పెసర పప్పుని వినియోగిస్తారు. దీనివల్ల చర్మం మృదుత్వం సంతరించుకుంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల హైబిపి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడ్తాయి. తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. వీటిలోని ఐరన్ మూలకం రక్తహీనతను దూరం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి పెసలు అద్భుతం అని చెప్పవచ్చు. పెసర మొలకలు వచ్చిన తర్వాత పోషకాలు, ఫైబర్, ప్రోటీన్ లు తదితర పోషకాలు రెండింతలు అవుతాయి. డయాబెటీస్, అధికబరువు, కొలెస్ట్రాల్ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్న ఎవరికైనా పెసరపప్పుతో చేసే ఆహారపదార్థాలు, ముఖ్యంగా స్ప్రౌట్స్, పెసరట్టు ఎంతో మంచిది. ఉల్లిపాయ ముక్కలు, కాస్త జీలకర్ర, అల్లం ముక్కలు పెసరట్టుకి తోడైతే ఇష్టం ఉండని వారెవ్వరు ఉంటారు. చెప్పండి..!
No comments:
Post a Comment