ఉప్పు నీటితో.. | Is it good to wash vegetables with Salt Water?

పచ్చికూరగాయలు, ఆకుకూరలు తింటే ఆరోగ్యం అంటారు. కానీ అలాగే ఆరగించామంటే అనర్థమే. కారణం అవి పండించే క్రమంలో వాడిన పురుగు మందుల ప్రభావంతో సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తాయి. అందుకని పచ్చి కూరగాయలు, ఆకులను తినే ముందు వాటిని తప్పనిసరిగా ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడగాలి. పొడిగుడ్డతో తుడిచి తినాలి. క్యారట్, బీట్ రూట్, ముల్లంగి లాంటి దుంపల విషయంలోనూ తగు జాగ్రత్తలు తప్పని సరి. క్రిమిసంహారక మందుల అవశేషాలతో పాటు పొలం నుంచి మన చేతికి చేరే వరకు వాటినాశించిన రకరకాల క్రిమికీటకాలు, దుమ్ముధూళి విషయంలో ఏమాత్రం ఎమరుపాటు వహించినా ప్రాణాపాయం తప్పదు. అందుకని వీటిని కాసేపు ధారగా వస్తున్న నీటితో కడిగి, కాస్త ఉప్పు చేర్చిన గోరువెచ్చని నీటిలో పూర్తిగా మునిగేలా ఉంచి ఐదు నిమిషాలయినా నానపెట్టి కడగాలి.

No comments: