మనిషి స్వార్థం కోసం చేస్తున్న విధ్వంసం, పారిశ్రామికీకరణ పేరుతో విచ్ఛలవిడిగా అడవులు నరకటం.. విద్యుత్ ఉత్పాదన పేరిట కాలుష్యం వెదజల్లటం.. ఇలా కారణాలు ఏవైతేనేం భూగోళం వేడెక్కిపోతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు. అందుకే ఈ నెల 24న రాత్రి 8.30 గంటల నుంచి 9.30 వరకు జరిగే ఎర్త్ అవర్ (ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ దినోత్సవం) లో మనమందరం పాల్గొనాలి.
వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు సేవ్ ఎర్త్ పేరిట విశ్వ వ్యాప్తంగా ది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) చేపడుతున్న కార్యక్రమమే ‘ఎర్త్ అవర్-2018’. ఎర్త్ అవర్ అంటే ఓ గంట పాటు విద్యుత్ వినియోగాన్ని ఆపేయడమే. కరెంట్ బల్బులు, టీవీలు, కంప్యూటర్లు... కరెంటుతో నడిచే ఉపకరణాలన్నీకాసేపు స్విచ్ ఆఫ్ చేయాల్సిందే. ఇలా విద్యుత్ ఆదా చేస్తే ఆ మేరకు భూ వాతావరణాన్ని పరిరక్షించినట్లే. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దీన్ని మొదలు పెట్టారు. ప్రతి సంవత్సరం మార్చి ఆఖరి శనివారం రాత్రిపూట ఒక గంట విద్యుత్ ఉపకరణాలు అన్నింటినీ ఆపివేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటూ ఈ పదేళ్ళలో ప్రజలు స్వచ్చందంగా ఎర్త్ అవర్ పాటించే విధంగా చైతన్యం తీసుకురాగలిగారు. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలు కరెంట్ కట్ చేస్తే బోలెడు ఆదా అవుతుంది. సోషల్ మీడయా, మోబైల్ ఫోన్ల ద్వారా విస్త్రుత ప్రచారం సాగుతోంది. స్వచ్చంద సంస్థలు బాధ్యతగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసే యువతరం దీన్ని భుజానికెత్తుకుంటున్నారు. రేపటి భారతం అంధకారం అవకుండా ఉండాలంటే ఈరోజు కాసేపైనా చీకటి అనుభవించక తప్పదు. మన చేతుల్లోనే మన భూగోళం... ఎర్త్ అవర్ కోసం ఓ గంట పాటు విద్యుత్ పరికరాలన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి. సాధ్యమైనంత ఎక్కువ మందిని ఎర్త్ అవర్ లో భాగస్వాముల్ని చేయండి.

No comments:
Post a Comment