ఎయిర్ కూలర్ నిర్వహణ | How to take care of your Air Cooler

ఎండలు మొదలయ్యాయి. ఇక కూలర్లు అటక మీదనుంచి దించాలి. కొత్తవి అయినా కొనాలి. పాత కూలర్లను శభ్రపరచడంలో, కొత్త కూలర్ కొనడంలో కచ్చితంగా కొన్ని మెలకువలవసరం.

- కొత్త కూలర్ కొనే సమయంలో బడ్జట్ తో పాటు నాణ్యత ముఖ్యం అని గమనించాలి.
- అవసరాన్ని బట్టి సరియైన సైజులో కూలర్ ని ఎంచుకోవలసి ఉంటుంది.
- పాత కూలర్ కి ప్రతి సంవత్సరం మూడు పక్కల ఉండే ప్యాడ్స్‌ కొత్తవి మార్చు కోవాల్సి ఉంటుంది.
- ఎంత ఫైబర్ కూలర్‌ అయినా లోపల ఇనుప పట్టీలు తుప్పు పట్టే అవకాశం ఎక్కువ. 
  తరచూ కూలర్లో నీటిని పూర్తిగా తీసి శుభ్రపరచుకోవాలి.
- ఇనుప పట్టీలు ఇట్టే పాడవకుండా పెయింట్‌ వేసుకోవాలి.
- గాలి తగ్గినా, కూలింగ్ తగ్గినా నీటి సరఫరా పైపులు ఏమైనా జామ్‌ అయ్యాయేమో సరి చూసుకోవాలి.
- ఎర్తింగ్ పాయింట్ ఉన్న ఎలక్ట్రికల్ ప్లగ్ ని మాత్రమే వాడాలి.
- పంప్, ఫ్యాన్ లను పూర్తిగా పవర్ ఆఫ్ చేసి కాని శుభ్రపరచడం, నీటిని పోయడం చేయకూడదు.

No comments: