పసుపు.. నిత్యం మన ఆహార పదార్థాల్లోనే కాక సౌందర్యసాధనలో ఉపయోగిస్తాం. అలాగే యాంటిబయాటిక్ గా కూడా వాడతాం. రక్తాన్ని శుభ్రపరిచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి పసుపు నలుగు పెట్టుకుని స్నానం చేస్తే శరీర కాంతిని ఇనుమడింప చేస్తుంది. ఇలా అద్భుత గుణాలను కలిగి ఉన్న పసుపు క్షయవ్యాధిని సైతం నిర్మూలిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ పదార్థం మానవ శరీరంలోని మ్యాక్రోఫేజేస్ రోగ నిరోధక కణాలను ఉత్తేజపరుస్తుంది. దీనికి క్షయవ్యాధికి కారణమయ్యే మైక్రోబ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ను తొలగించే శక్తి ఉంటుంది. నొప్పి నివారణకు, అనేక ఆరోగ్య సమస్యలు, పలు రుగ్మతల నుంచి ఉపశమనం పొందేందుకు పసుపును ఇప్పటికే వినియోగిస్తున్నాం. పసుపులో క్యాన్సర్ వ్యాధిని తగ్గించే గుణాలు కూడా ఉన్నాయని అధ్యయనాలు వెళ్ళడించాయి.
No comments:
Post a Comment