వాటర్ మెలోన్..కాయ నిండా నీరే, రంగు, రుచితో ఇట్టే అందరిని ఆకర్షిస్తుంది. తింటే దాహం తీరిపోతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌లు మెండు. విటమిన్ - ఎ, విటమిన్ - బి, విటమిన్ - సి.. పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ తిన్నా జ్యూస్ తాగినా సమృద్ధిగా ఎలక్ట్రోలైట్లు తక్షణమే అందుతాయి కనుక వడదెబ్బ బారినపడే అవకాశం లేదు. ఇందులోని లైకోపీన్ గుండె, ప్రొస్టేట్, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా పలు క్యాన్సర్ల భారిన పడకుండా చూస్తుంది. పుచ్చకాయ ఎండ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. కాలిన గాయాలకు కూడా ఉపశమనం కలుగుతుంది.
సరియైన ఖర్బూజ కొనేప్పుడు దాని ఎంపికలో తగు జాగ్రత్తలు తప్పనిసరి. పరిమాణంలో కాయ చిన్నదైనా, పెద్దదైనా దానికి తగ్గ బరువు ఉందనే అనుభూతి కలగాలి. మచ్చలు, దెబ్బలు లేకుండా నిగనిగలాడుతూ ఉండాలి. వాటర్ మెలోన్ చుట్టూ గమనిస్తే ఒక పక్క కొంచంగా పసుపు రంగు కన్పిస్తుంది. ఇది భూమిపై ఆనుకుని కాయ పెరగడం వల్ల ఏర్పడుతుంది. ఇలా ఉంటేనే పుచ్చకాయ సహజసిద్ధంగా పక్వానికి వచ్చిందని అర్థం. అలాగే దాన్ని తట్టినపుడు ధ్వని మోగుతుంది. పండనివి, మరీ ఎక్కువ పండినవి, పాడైన కాయలు ఎక్కువ మోత చేయవు.
https://www.youtube.com/c/vantintichitkalu
No comments:
Post a Comment