సమ్మర్ షురూ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం రోజు రోజుకు పెరిగిపోతోంది. పలు ప్రాంతాల్లో పగటి పూట 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగలు, రాత్రిపూట సాధారణంకన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆకాశంలో మేఘాలు లేనందున సూర్య కిరణాలు నేరుగా నేలను తాకుతుండడంతో భూ వాతావరణం త్వరగా వేడెక్కి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. గాలిలో తేమ బాగా తగ్గిం వడగాడ్పులు మొదలయ్యాయి. ఈ వేసవిలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. సో.. ఇక కూలర్లు, ఏసిలు దుమ్ముదులిపే కార్యక్రమం మొదలుపెట్టండి.
No comments:
Post a Comment