మహిళా రిజర్వేషన్ బిల్లు - మోక్షమెప్పుడు? | 8 March : International Women's Day

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి, 8) సందర్భంగా..
జనాభాలో సగం, ఓటర్లలో సగం ఉన్న మహిళలకు రాజకీయాల్లో మాత్రం సమాన వాటా లేదు. అందరూ మహిళల్ని ఉద్ధరిస్తామని చెప్పేవారే. తమకు ప్రయోజనం చేకూర్చే అంశాల్లో అధికార, విపక్షాలు తెలివిగా చేతులు కలుపుతాయి. అదే ప్రజా ప్రయోజనం ఉండేపక్షంలో అందరూ తలోమాటా చెప్పి చట్ట సభల్లో ఆ అంశం తొక్కి పెట్టేయడం ఆనవాయితీగా మారింది. మహిళా బిల్లు విషయంలోనూ ఏళ్ల తరబడిగా ఇదే తంతు జరుగుతోంది.

ఎన్నికల వేళ మహిళల ఓట్ల కోసం పార్టీలన్నీ నానా తంటాలు పడుతాయి. కానీ మన పార్లమెంటు ఉభయ సభల్లో మహిళల ప్రాతినిథ్యం రెండంకెలు ఉండదు. జనాభాలో సగమైన మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం లభించకపోతే దాన్ని నిజమైన ప్రజాస్వామ్యం అనలేం. మహిళా సాధికారతకు అతి ముఖ్యమైన మహిళా రిజర్వేషన్‌ బిల్లును పైకి మాత్రం అన్ని రాజకీయ పార్టీలూ సమర్ధిస్తున్నాయి. ఆచరణలో మాత్రం అడ్డు పడుతున్నాయనే చెప్పాలి.

ఎన్నికలు సమీపిస్తేనో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి, 8) రోజునో ఈ అంశం  తెరపైకి రావడం, మళ్ళీతెరమరుగవడం ఇన్నేళ్ళ స్వతంత్ర భారతంలో శోచనీయం. ప్రతీసారి ఈ రోజున మహిళా రిజర్వేషన్ బిల్లు పై కృషి సల్పుతామనే పార్టీలు ఇప్పటికైనా పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ అమోద ముద్రవేస్తాయేమో చూడాలి.
 
 

No comments: