ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి | Health Screening Tests all Women should have

ఒకప్పుడు సినిమాలో సెంటిమెంట్ బాగా పండాలంటే హీరోహీరోయిన్లలో ఎవరో ఒకరికి కేన్సర్ సోకేది. లేదంటే గుండెజబ్బు వచ్చేది. రానురానూ సమాజంలో కొత్త కొత్త వ్యాధులు విస్తరించినట్లుగానే సినిమాల్లోనూ వెరైటీ వ్యాధులు రంగప్రవేశం చేశాయి. అవే కథలుగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. సినిమాలు ఎలాగున్నా వెండి తెర వేలుపులను రకరకాల వ్యాధులు వరుసగా కబళించడం అభిమాన కోటిని కలచివేస్తోంది.

ఇటీవల అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మిక మరణం అందరిని షాక్ కు గురిచేసింది. షడన్ గా ఇలా కొలాప్స్ అవడానికి ఆరోగ్యంపై అశ్రద్ధకూడా కారణం కావచ్చని వైద్యనిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం విషయంలో ఏడాదికోసారి శారీరకంగా పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. వయసు, కుటుంబ ఆరోగ్య చరిత్ర, రిస్క్‌ఫ్యాక్టర్లను బట్టి క్రమం తప్పకుండా అవసరమైన స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఎదురయ్యే ముప్పును అంచనా వేయొచ్చంటున్నారు. మహిళలు కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కనబరిచిన శ్రద్ధ వారిపై చూపకపోవడం వల్ల అనర్థాలు తలెత్తుతాయి. పురుషుల కన్నా స్త్రీలల్లోనే మానసిక సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. సో.. మధ్యమధ్యలో మానసిక నిపుణుల సలహాలు కూడా తప్పనిసరి. ఏదో సమస్య ముంచుకొచ్చినప్పుడే డాక్టర్‌ దగ్గరకు పరుగెత్తడం కాకుండా, వయసుని బట్టి కనీస ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం అవసరం అని గుర్తించండి.

1 comment:

Anu Diwan said...

Mam could you please give me some advice for new bloggers