బల్లి.. అమ్మో భయం! | How to get rid of House Lizards without Killing them

బల్లి ఎంత విషపూరితమో అందరికి తెలిసిందే. ఇవి గోడల మీద పాకుతుంటే ఒళ్ళు గగుర్పొడచనిది ఎవరికి? అయితే వీటిని నివారించాలంటే ఏమి చేయాలి? కొన్ని వంటింటి చిట్కాలు మీకోసం..
- బల్లులు తిరిగే ప్రదేశాల్లో నెమలి ఈకలను పెట్టి చూడండి.
- బల్లులకు కోడి గుడ్డు వాసన అసలు పడదు. గోడలపై అక్కడక్కడ గుడ్డు పెంకులను అమర్చితే సరి. ఎగ్ షెల్స్ కి చక్కని ఆకృతి, రంగులు అద్ది అలంకరించుకోవచ్చు.
-  ఘాటైన వాసన కలిగిన వెల్లుల్లి లేదా ఉల్లిపాయల  రసం స్ప్రే చేయడం వల్లకూడా బల్లులు పారిపోతాయి.
- కాఫీ పొడిని చిన్న కప్పులో కాని, ఉండలుగా చేసి కాని బల్లులు సంచరించే ప్రదేశంలో పెట్టాలి. కాఫీ గింజల వాసనకు కూడా బల్లులు, బొద్దింకలు ఇతర క్రిమీకీటకాలు మాయమవుతాయి.
- నాఫ్తలీన్ బాల్స్ ని కిచెన్ సెల్ఫ్స్, కప్ బోర్డ్స్, ఇతర ప్రదేశాల్లో ఉంచడం మూలంగా బల్లులు కనిపించవు.
 

No comments: