ఈ కల్తీ కాలంలో వినియోగదారుడే తెలివిగా వ్యవహరించి సరియైన సరుకులు, సేవలు పొందాలి. రాయితీలు, తక్కువ ధరకు ఇస్తున్నారని చెప్పి, సరైన బిల్లులు లేకుండా ఏ వస్తువునూ మార్కెట్లో కాని, ఆన్ లైన్ లో కాని కొనుగోలు చేయకూడదు. ఏ వస్తువును కొన్నా దానికి సంబంధించిన బిల్లులు, వారంటీ, గ్యారంటీ విషయంలో, కార్డులను బధ్రపరిచే విషయంలో జాగ్రత్త వహించాలి. ఔషధాలు, ఆహార వస్తువులైతే తయారీ తేదీ, కాలం తీరే తేదీలను చూశాకే కొనుగోలు చేయాలి. మనం తినే ఆహారం కల్తీ అయితే మన ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకున్నవాళ్లమవుతాం. మనం నిత్యం వాడే ఆహార పదార్థాలపై అవగాహనతో వాటిల్లో కల్తీ పాలు ఎంతో కనిపెట్టాలి. మచ్చుకి కొన్ని చూద్దాం..
పాలు: సాధారణంగా డిటర్జెండ్ పౌడర్, యూరియా, సింథటిక్ మిల్క్‌తో కల్తీ చేస్తారు. కొద్దిపాలలో అంతే మొత్తం నీళ్లు కలిపితే డిటర్జంట్ కలిపిన విషయం తేలుతుంది. పాలను కాచినప్పుడు పసుపు రంగులోకి మారినా, తాగుతున్నప్పుడు కాస్త చేదుగా అనిపించినా అవి సింథటిక్ పాల కల్తీ జరిగినట్టే.
టీ పొడి: చక్కటి రంగుకోసం బొగ్గు కలిపే అవకాశాలున్నాయి. తెల్లటి బ్లాటింగ్ పేపర్‌పై టీపొడి జల్లి కాసేపు తరువాత చూస్తే దానిపై రంగు మచ్చలు ఏర్పడితే అది కల్తీదే అని గుర్తించాలి.
ఉప్పు: సాధారణ ఉప్పులో సుద్దపొడి, అయొడైజ్డ్ ఉప్పులో సాధారణ ఉప్పు కలిపి కల్తీ చేస్తారు. ఉప్పు కలిపిన నీళ్లను వేడిచేస్తే సుద్దపొడి పైకి తేలుతుంది. బంగాళదుంప ముక్కపై అయొడైజ్డ్ ఉప్పు జల్లి, కొద్దిగా నిమ్మరసం పిండి వేచిచూడాలి. ఆలుగడ్డ ముక్కపై నీలిమచ్చలు ఏర్పడితే అది కల్తీ జరగనట్లే.
మిర్చిపొడి: కర్రపొట్టు, నిషేధిత రంగు, ఇటుకల పొడి కలిపి కారంపొడిని కల్తీ చేస్తారు. స్పూన్ మిర్చిపొడిని గాజు గ్లాసు నీళ్లలోవేస్తే కాసేపటికి ఇటుకల పొడి నీటి అడుగుకి చేరుతుంది. రంగు కలిసిపోతుంది. అసలు కారం నీళ్లపై తేలుతుంది.
మిరియాలు: ఇవి కల్తీ చేయడానికి ఎండబెట్టిన బొప్పాయి గింజలు కలుపుతారు. డిస్టిల్డ్‌వాటర్‌లో ఈ గింజలు వేస్తే కొద్దిసేపటికి బొప్పాయి గింజలు పైకి తేలుతాయి. మిరియాలు అడుగుకు చేరతాయి.
తేనె: తేనెను పంచదార పాకం, బెల్లం పాకం కలిపి కల్తీ చేస్తారు. పట్టు వస్త్రంపై తేనె చుక్క వేస్తే అంటుకోకుండా జారిపోవాలి.

No comments:
Post a Comment