పువ్వులు.. సువాసనలు, పరిమళాలు వెదజల్లుతాయి. ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అందుకే మగువలకు పూలంటే అమితమైన ఆనందం. ఇలా నాలుగు పూలు కనబడగానే అలా అల్లుకుని కొప్పు సింగారించుకుంటారు. అయితే ఈ పూలకు తోడు మరువం, మాచీపత్రి చేరితే మరింత మానసికానందాన్ని సొంతం చేసుకోవచ్చు. చూడ చక్కని ఆకారంలో ఆకులు పచ్చని రంగులో ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటికి ఆయుర్వేదంలోనూ మంచి స్థానమే ఉంది. ఎలాంటి వాతావరణంలోనూ కాసిని నీళ్ళు పోస్తుంటే చక్కగా కుండిల్లోనే ఈ మొక్కలను పెంచుకోవచ్చు.
మాచీపత్రం: కడుపులోని నులి పురుగులను, కుష్టును, బొల్లిని, దప్పికను పోగొడుతుంది. ఆస్త్మా నియంత్రణకు, గాలిని శుద్ధి చేయడంలో ఉపకరిస్తుంది. మాచీపత్రిని కళ్లపై కొంచెం సేపు పెట్టుకొని పడుకుంటే కళ్ల దోషాలు ఇట్టే తొలగిపోతాయి. మాడుపై పెట్టుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటే తలనొప్పులు తగ్గుతాయి. మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడుతుంది.
మరువం: మరువక పత్రం మంచి సువాసనలు వెదజల్లుతూ పరిసరాలను ఆహ్లాదకరంగా మారుస్తుంది. శ్వాసకోశ రోగాలు, హృద్రోగాలను తగ్గిస్తుంది. విషపురుగులు కుట్టినప్పుడు మరువం ఆకులను నలిపి తీసిన రసం వేసి కట్టు కడితే నొప్పి మాయమవుతుంది.
#Machipatri #Maruvam #Davanam #FlowerGarlands #VantintiChitkalu
No comments:
Post a Comment