అమ్మప్రేమ కన్నా మించింది లేదు. తల్లిపాలకు మించిన పోషక పదార్థం సృష్టిలో మరొకటి లేదు. తల్లిపాలతో బిడ్డ ఆకలి కచ్చితంగా తీర్చాల్సిందేనని ఒకపక్క వైద్యనిపుణులు చెప్తున్నా కొన్ని అపోహలు, మూఢనమ్మకాలు ఇంకా సమాజంలో అలాగే ఉండిపోయాయి. వీటిని దూరం చేస్తూ బిడ్డకు బహిరంగంగా చనుపాలు పట్టిస్తే తప్పేంటి? ఇందులో సిగ్గుపడాల్సింది ఏముందంటూ ప్రముఖ మలయాళ మేగజీన్ ‘గృహలక్ష్మి’ చేపట్టిన ప్రచారంలో భాగంగా ఈ నెల సంచిక ముఖచిత్రం కోసం బిడ్డకు పాలిస్తున్నట్లు నటి, రచయిత, మోడల్ గిలు జోసెఫ్ ఇలా ఫొటోకు ఫోజిచ్చింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వ్యవహారం భిన్నస్పందనలను ఎదుర్కుంటోంది.
#Breastfeeding Model Gilu Joseph #Case filed against Malayalam Magazine Grihalakshmi
No comments:
Post a Comment