ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు. చక్కని రంగు, రుచికరమైన, ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే ఈ పువ్వులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు మెండు. ఇది అందానికి, ఆరోగ్యానికి చాలా మేలైనది. ఙాపకశక్తి పెరిగి ఎదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలం మనలో కలుగచేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల వృద్ధాప్యఛాయలు దరిచేరనివ్వదు. సాఫ్రాన్ బట్టతలను నివారించడమే కాక శరీరం తేజోవంతమవుతుంది. జన్యు పరంగా వస్తున్న వ్యాధులను సైతం నివారించటంలో కుంకుమ పువ్వు మంచి ఔషధం. అయితే నాణ్యమైన కుంకుమపువ్వు గోరువెచ్చని పాలల్లో వేసినా పావుగంటకుపైగా రంగు మారడానికి పడ్తుందని గమనించాలి. ఇలా చేసినప్పుడు వెంటనే రంగు మారుతోందంటే నకిలి కుంకుమ పువ్వు అని కచ్చితంగా చెప్పవచ్చు.
No comments:
Post a Comment