పిల్లలు చాక్లెట్స్ అడిగిన ప్రతీసారి ఇలాగే కదా చెప్తాం. నిజానికి చాక్లెట్ ఎమంత అనారోగ్యం కాదు. పిల్లలకు చాక్లెట్లు దూరం చేసేకంటే వారి నోటి శుభ్రతకు తగిన జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు పిల్లల వైద్య నిపుణులు.
ఏదైనా ఆహారం తీసుకున్న తరవాత పళ్ళు శుభ్రపడకపోతే పుచ్చిపోవడమే కాకుండా నోటి నుంచి దుర్వాసన కూడా అధికంగా వస్తుంది. పంటికి బాగా అతుక్కుపోయే పేస్టీలు, మిఠాయిలు.. ఇతర తినుబండారాలు తీసుకున్నాక కచ్చితంగా నోటిని వీలైనన్ని సార్లు నీటితో పుక్కిళించి ఉమ్మివేయాలి. పిల్లలకు కనీసం రోజుకు రెండుసార్లు దంత ధావనం అలవాటు చేయాలి. పంటిపై, పళ్ళ సందుల్లో ఏమాత్రం శుభ్రత లోపించకుండా బ్రష్ చేయడం నేర్పించాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే పిల్లలు చాక్లెట్‌లు తినే విషయంలో భయపడాల్సిన పనిలేదు.
No comments:
Post a Comment