సంవత్సరం పొడవునా అవసరమే అయినా మండే ఎండలను సైతం మనం సమర్థంగా ఎదుర్కోవాలంటే మజ్జిగ ఉండాల్సిందే. దీనికి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం, జీలకర్ర, వాము, నిమ్మరసం.. ఏదైనా ఒకటి కాస్త చేరితే మజ్జిగకు మించిన ఆహారమే ఈ కాలంలో ఉండదు. మండువేసవిలో డీహైడ్రేషన్ రాకుండా ఇది మంచి ఎలక్ట్రోలైట్‌లా పనిచేస్తుంది. చక్కని ఆరోగ్యంతో పాటు సౌందర్యసాధనంగానూ మజ్జిగ ఉపయోగపడుతుంది.
- శరీరవేడిని నియంత్రించడంలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. పైగా ఒక గ్లాస్ మజ్జిగ తాగామంటే మనకు కావలసిన పోషకాలు ఆ పూటకు అందినట్టే.
- కేలరీలు తక్కువగా ఉండే మజ్జిగలో విటమిన్ బి12, క్యాల్షియం, ఫాస్పరస్, రెబోఫ్లావిన్ ఉన్నాయి. ఇవన్నీ కలసి ఎముకల ఆరోగ్యం. చర్మ సంరక్షణ, రోగనిరోధక శక్తికి కృషి చేస్తాయి.
- రోగాలను కలిగించే బ్యాక్టీరియాని తరిమి కావాలసిన బ్యాక్టీరియాను పెంచి మనలో రోగనిరోధక శక్తిని కలుగచేసి జలుబు, జ్వరం, ఇన్‌ఫెక్షన్లను రాకుండా నివారిస్తుంది.
- జీర్ణవ్యవస్థకు మేలుచేయడమే కాక గుండెల్లో మంట, ఎసిడిటి లాంటి సమస్యలను సైతం తగ్గిస్తుంది. మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో వచ్చే వేడి ఆవిర్లను తగ్గిస్తుంది.
- మజ్జిగలో ప్రొటీన్లూ, పొటాషియం, బి-కాంప్లెక్స్ విటమిన్లూ పుష్కలంగా ఉండటంతో మంచి నిద్రపట్టేలా చేస్తాయి. కొలెస్ట్రాల్, బీపీ, క్యాన్సర్లూ రాకుండా నియంత్రిస్తుంది.

No comments:
Post a Comment