చిన్న చిట్కా - పెద్ద నీటి ఆదా | Best ways to Save Water | VantintiChitkalu

మనకు తెలుసు. అయినా ఎన్నో సహజవనరులను వృథా చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా నీటి విషయంలో అజాగ్రత్త పనికిరాదు. ఉదయం కాలకృత్యాల నుంచి మళ్ళీ పడుకునే వరకు నీళ్ళ ఆవశ్యకత తెలియంది కాదు. అడుగంటుతున్న భూగర్భ జలాల వేళ వ్యక్తిగతంగా ప్రతీరోజు కొంత జాగ్రత్త పడినా సంవత్సరానికి కొన్ని వేల లీటర్లను ఆదా చేసినవాళ్లమవుతాం. ఆదా చేస్తేనే భవిష్యత్తు తరాలకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. నీటి వృథా.. ఆపుదాం ఇలా..

- టూత్ బ్రష్ నోట్లో పెట్టుకున్నప్పటి నుంచి దంతధావనం పూర్తి అయ్యేవరకు వాషింగ్ బేసిన్ లో కుళాయి తిప్పి ఉంచకూడదు.
- అలాగే పాత్రలు, దుస్తులు శుభ్రపరిచే సమయంలో నీరు వృథా కాకూడదు.
- టాయలెట్లో డ్యూయల్ ఫ్లష్ ఏర్పాటు కచ్చితంగా ఉండాలి.
- స్నానానికి సరిపడా నీటిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అనవసరంగా వేడి నీళ్ళు, చన్నీళ్ళు సమపాళ్ళలో కాకుండా ఎక్కువ, తక్కువ అంటూ బకెట్లో నీళ్ళు పారబోయకూడదు.
- టబ్ బాత్ విషయం అసలు మరిచిపోతే బాగుంటుంది. షవర్ బాత్ తో కూడా ఎక్కువ నీటిని ఖర్చు చేసిన వాళ్ళం అవుతాం.
- కుళాయిలు, పైప్‌లైన్‌లలో ఒక చుక్క లీకేజీ ఉన్నా కూడా వెంటనే అరికట్టాలి.
- ఓవర్‌హెడ్ ట్యాంకుల నుండి నీరు వృథా కాకుండా జాగ్రత్త వహించాలి.
-  ప్రతి ఇంటిలో, అపార్ట్ మెంట్ లో ఇంకుడు గుంతలను తప్పక ఏర్పాటు చేసుకోవాలి.
- కిచెన్ సింక్, బాత్ రూం వాటర్ వృథా కాకుండా మొక్కలకి చేరేలా చూసుకోవాలి.

 
మార్చి 22: ప్రపంచ జల దినోత్సవం | World Water Day

No comments: