ఎండ వల్ల చర్మానికే కాక జుట్టుకు కూడా నష్టం వాటిల్లుతుంది. సూర్యరశ్మి వల్ల జుట్టుమీది పైపొర తొలగిపోవడం, వెంట్రుకల చివర్లు చిట్లి పోవడం జరుగుతుంది. పైగా తేమ పూర్తిగా తగ్గిపోయి జుట్టు నిర్జీవంగా తయారవవుతుంది. కురులు పట్టులా మెరవాలంటే ఎండకి ఎక్స్పోజ్ అవకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. తలలో ఎక్కువ చమట, చిరాకు కలిగిస్తుందని ప్రతిరోజూ షాంపులు ఉపయోగించి తలస్నానం చేయడం అంత మంచిది కాదు. రోజూ షాంపు వాడడం వల్ల జుట్టు, తల మీది చర్మంలోని తేమ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వారంలో రెండుసార్లు తలస్నానం చేస్తే చాలు. తలస్నానానికి ముందు కొబ్బరి నూనెను కాసేపు అప్లై చేయడం మరవద్దు. స్నానం తరవాత జుట్టు ఆరడానికి హేయిర్ డ్రయర్ కాకుండా సహజంగా ఆరిపోయేలా చూసుకోవాలి. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా జుట్టును స్కార్ఫ్‌తో కప్పుకోవడం అవసరం. అందువల్ల అతినీలలోహిత కిరణాల బారి నుంచి జుట్టును రక్షించుకోవచ్చు. అయితే స్కార్ఫ్ అవసరానికి తగ్గట్టుగానే ఉండాలి కానీ ఫ్యాషన్ వి ఎన్నుకుంటే స్కిన్ ఎలర్జీలు, జుట్టు మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.
No comments:
Post a Comment