సమయానికి తినండిలా.. | What are the best times to Eat food?

సమయపాలన రోజువారి విధుల్లో ఎంత అవసరమో అందరికి తెలిసిందే. అదే ఆహారం సమయానికి తీసుకోవడంలో అజాగ్రత్త వహిస్తే అనర్థాలు తప్పవు అంటున్నారు నిపుణులు. ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం, సాయంకాలం స్నాక్స్.. ఇలా అన్నిటికి రోజూ నిర్ధిష్టమైన సమయం ఉండాల్సిందే! అలాగే రుచి, ఆకలి మీద కాక పోషకాహారం పై దృష్టిపెట్టాలి.

బ్రేక్ ఫాస్ట్
- ఉదయం 7 నంచి 8 గంటల మధ్యలో బ్రేక్ ఫాస్ట్ ముగించాలి.
- 10 గంటల తరవాత టిఫిన్ చేయడం మంచిది కాదు.
- ఉదయం నిద్రలేచాక అర గంట నుంచి గంటలో ఫలహారం ఉత్తమం అని నిపుణుల సూచన.

లంచ్
- మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల మధ్యలో భోజనం చేయడం ఉత్తమం.
- సాయంత్రం 4 తరవాత భోజనం ఏమంత మంచిది కాదు ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ కి మధ్యాహ్నభోజనానికి మధ్య సమయం నాలుగు గంటలకు మించి ఉండకూడదు.

డిన్నర్
- రాత్రిభోజనం 7 నుంచి 9 గంటల మధ్యలో చేయాలి. రాత్రి పది గంటలు దాటాక భోజనం పనికిరాదు అంటారు. 
- కారణం నిద్రకు కనీసం మూడు గంటల ముందే భోజనం ముగించాలి.

No comments: