ముక్కు జాగ్రత్త! | How to Stop a Nosebleed Fast | Epistaxis

ముక్కు రంధ్రాలు తేమగా ఉన్నప్పుడే ముక్కు ఆరోగ్యంగా ఉంటుంది. ఏ కాలంలో అయినా వాతావరణంలో తేమ తగ్గినప్పుడు ముక్కు రంధ్రాలు పొడిబారి అందులోకి చేరిన దుమ్ము, ధూళి అంతా కలిసి పొక్కుల్లా ఏర్పడతాయి. అవి డిస్ట్రబ్ కావడం వల్ల రక్తస్రావం జరుగుతుంది. వేసవిలో సాధారణంగా కనిపించే డీహైడ్రేషన్ సమస్యతో పాటుగా ముక్కు నుంచి రక్తస్రావం కూడా ఎక్కువే.
ఇలా జరిగినప్పుడు కాసేపు ముక్కును చేతి వేళ్లతో నొక్కిపట్టుకోవాలి. ఇంకా రక్తస్రావం ఆగిపోకపోతే తలను కాస్త ముందుకువంచి నోటితో గాలి పీల్చుకుంటూ ఇంకాసేపు కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. చల్లని నీటిలో ముంచిన గుడ్డతో కాని, అయిస్ క్యూబ్ తో కాని కొద్దిసేపు ముక్కుపైన మర్దన చేసినా ఫలితముంటుంది. అయితే దీన్ని అశ్రద్ధ చేయకపోవడమే మంచిది. ఇతర వ్యాధుల వల్ల కూడా రక్తస్రావం జరిగే ప్రమాదమున్నందున ఒకసారి డాక్టరుకు చూపిచ్చి చికిత్స చేయించుకోవడం చాలా అవసరం.

 pc:internet

No comments: