సమ్మర్ ఎక్సర్‌సైజెస్ - జర జాగ్రత్త! | Cool Tips for a Summer Workout | VantintiChitkalu

వేసవిలో అలసట కారాణంగా వ్యాయామం మానేయడానికి చూస్తారు. చమటలు కూడా చిరాకు పుట్టిస్తాయి. కానీ నిజానికి ఫిట్ నెస్ కి ఇదే సరియైన సమయం అంటున్నారు నిపుణులు.
చిన్నపాటి వర్కవుట్లతో మంచి ఫలితం ఉంటుంది. అయితే వేసవి వ్యాయామంలో కనీస జాగ్రత్తలు అవసరం, అలాగే నిపుణుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
- ఈ కాలంలో ఎంత వీలైతే అంత ఉదయాన్నే వ్యాయామం మొదలుపెట్టాలి.
- తేలికపాటి , శరీరానికి హాయిని కలిగించే వస్ర్తాలు ధరిచాలి. అవి చెమటను త్వరగా పీల్చుకోవడమే కాదు కూల్‌గా ఉన్నట్టు అనుభూతిని కలిగించాలి.
- వ్యాయామంలో చమట ఎక్కువ పట్టేసి త్వరగా అలసిపోతూ ఉంటాం. ఇలా కాకుండా ఉండాలంటే దాహం వేయకపోయినా మంచి నీరు తాగుతూనే ఉండాలి.
- శరీరానికి అధిక వేడి నుంచి ఉపశమనం ఇచ్చే పదార్థాలను తీసుకోవాలి. ప్రధానంగా కొబ్బరి బోండాలు, లస్సీలు, బార్లీ వంటివి మంచిది.
- వీలైతే ఎలక్ట్రోల్ పౌడర్ కలిపిన నీళ్లు తాగితే శరీరానికి సరిపడా లవణాలు అంది అలసట దరిచేరదు.
- ఎక్సర్‌సైజ్‌ లకు చల్లటి గాలులు వీచే పార్క్ లు అనువైన స్థలం అని చెప్పాలి. అలాగే చన్నీళ్ల స్నానం కూడా మనసుకు ప్రశాంతత, హాయి కలిగిస్తుంది.

No comments: