మీకు కొన్ని చిట్కాలు తెలిస్తే నిజంగా వంటగదిలో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. మీకు కిచెన్ పనిపై ఆసక్తి పెరుగుతుంది. వంటింట్లో సులభంగా, సౌకర్యవంతంగా పనులు పూర్తి చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక చిట్కాలు మీకోసం..
- బాదం పప్పు తొక్క తీయడం సులభతరం కావాలంటే వాటిని నానపెట్టాలి. అయితే అత్యవసరమైతే పది నిమిషాలు వేడి నీటిలో బాదం నానబెడితే సరిపోతుంది.
- పంచదారకు చీమలు పట్టకుండా ఉండడానికి చక్కెర డబ్బాలో నాలుగు లవంగాలను వేయాలి.
- బిస్కెట్స్ నిలువ చేసే కంటేనర్ అడుగున బ్లాటింగ్ పేపర్ వాడితే చాలా కాలం వరకు బిస్కెట్లు తాజాగా ఉంటాయి.
- ఆపిల్ తొక్కతీసి కాని, సగం కోసి కాని పక్కన పెడితే రంగు మారుతుంది. ఇలా బ్రౌనింగ్ నివారించడానికి దాని పైన కాస్త నిమ్మరసం రాస్తే సరి.
- వంటింట్లో కాలిన గాయాలకు ఉపశమనంగా అరటి పండు గుజ్జును వాడుకోవాలి.
- వంట పదార్థాలు అడుగంటినా, మాడినా పాత్రలను సులభంగా క్లీన్ చేసుకోవడానికి అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి, వేడినీళ్ళు సరిపడా పోసి ఐదు నిమిషాల తరవాత శుభ్రపరచాలి.
- ఎండు మిరపకాయల కారం పొడికి ఎక్కువ కాలం ఫ్రెస్ నెస్ అలాగే ఉండాలంటే అ బాటిల్ లో కొంచం ఇంగువ ముక్కను వేయాలి.
- ఆకుకూరలు, కూరగాయలు తరగడానికి చెక్క చాప్ బోర్డ్ వాడుకోవాలి. దీనివల్ల వెజిటబుల్ చాక్ పదును కోల్పోదు. అయితే ప్లాస్టిక్ బోర్డ్ వాడడం ప్రమాదకరం అని గుర్తించాలి.
- వంటగదిలో అన్నీ మూలల్లో, కప్ బోర్డ్ లలో బోరిక్ పౌడర్ ని చిన్న గిన్నెలలోకి తీసుకుని ఉంచితే బొద్దింకలు దరిచేరవు.
- నాఫ్తాలిన్ ఉండలని కూడా ఇదే విధంగా ఉంచగలిగితే బల్లులు మాయమవుతాయి.

or
pc: internet
No comments:
Post a Comment