స్నానానికి స్వచ్ఛమైన నీటిని వాడాలి. అంటే స్నానాల గది, నీటిని సరఫరా చేసే పైపులు శుభ్రంగా ఉండాలి. లేదంటే అనారోగ్యం పాలవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షవర్ స్నానం వల్ల నీటి వృథా అని తెలుసు. అంతేకాదు అనర్థాలు కూడా ఉన్నాయంటున్నారు. సాధారణ నీటి కుళాయిలు కట్టేయగానే కాసేపటిలో చక్కగా ఆరిపోతాయి. అదే షవర్ లో అలా జరిగే అవకాశం లేదు. నీళ్ళు జల్లులా పడేందుకు ఉన్న ఏర్పాటులో కుళాయి కట్టేసినా రోజుల తరబడి పూర్తిగా తడి ఆరదు. దానితో నిరంతరం చల్లదనం చోటుచేసుకోవడం కారణంగా ఆ ప్రాంతంలో సూక్ష్మక్రిములు శాశ్వత నివాసం ఏర్పరచుకుంటాయి. చిన్నచిన్న పురుగులు, చీమలు కూడా చేరే అవకాశం ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో స్నానం చేయడానికి షవర్ ఉపమోగిస్తే సూక్ష్మక్రిములు మన శరీరాన్ని ఆశ్రయించి, అనేక రకాల జబ్బులకు కారణం అవుతాయి. బాత్ రూం నీట్ గా, పొడిగా ఉంచుకోవడంతో పాటు సరియైన వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్త పడాలి. లేదంటే ప్రమాదాలు జరుగుతాయి. అలాగే నీటి సరఫరాకి వినియోగించే సంప్, ఓవర్ హెడ్ ట్యాంక్ తరచూ శుభ్రపరచాలి. అలాగే ప్రతీ కుళాయికి తప్పక నెట్ ఫిల్టర్ ఉండాలి. గీజర్ పవర్ స్విచ్ ఆన్ చేసేటప్పుడు, స్నానానికి ఉపక్రమించే ముందు కుళాయిల్లో నీరు సరిగా వస్తున్నాయో లేదో విధిగా చూసుకోవాలి. కుళాయి తిప్పగానే నీటిని వెంటనే వినియోగించకుండా కొన్ని నీటిని వదిలెయ్యాలి. అలాగే షవర్ ద్వారా కూడా వీలైతే వేడి నీటిని కొన్ని వదిలెయ్యడం వల్ల సూక్ష్మ క్రిముల బెడద తప్పుతుంది.

No comments:
Post a Comment