ప్రమోదమా? ప్రమాదమా?
ప్రెషర్ కుక్కర్ ఎంత అత్యవసర గృహోపకరణమో చెప్పనవసరం లేదు. అయితే దీని వినియోగంలో ఏమాత్రం ఏమరుపాటు వహించినా వంటింటి ప్రమాదాలు తప్పవు. ఇది నీటి ఆవిరి ఆధారంగా పనిచేయడం వల్ల వంట త్వరగా పూర్తి అవుతుంది. ఆహార పదార్థాల పోషక విలువలు నష్టపోము. పదార్థాలు ఉడికే క్రమంలో పొంగడం, మాడడం.. వగైరా జరగదు. అలాగే వంట సమయంలో పాత్రలను, పదార్థాలను కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం లేకుండా విజిల్స్ ననుసరించి వంట ఇట్టే పూర్తి చేయవచ్చు.
స్టీమ్ కుక్కర్ వినియోగంలో దానిలో పోసే నీరు, విజిల్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసే మనం దాని విడి భాగాల పైన కూడా దృష్టి పెట్టాలి. నాణ్యమైనవి కాక లేదా కాలం చెల్లిన విడి భాగాల వల్ల ప్రమాదాలు సంభవిస్తాయి. రబ్బర్ గ్యాస్ కట్, వెంట్ వెయిట్ (విజిల్), వెంట్ ట్యూబ్ లిడ్, సేఫ్టి వాల్వ్.. మొదలైన స్పేర్స్ ప్రధానమైనవి. వీటిలో దేని పనితీరు సరిగా లేకపోయినా ఆవిరి లీక్ అయి, కుక్కర్ మూత, వేడి ఆహారపదార్థాలు పైకి ఎగిరి మనకు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది.
దీని కారణంగా కుక్కర్ పనితీరును కచ్చితంగా తరచూ పరిశీలిస్తూ విడిభాగాలను మార్చవలసిన అవసరం ఉంది. దీనితో వంట సమయం, వంట గ్యాస్ వృథాని కూడా అరికట్టవచ్చు. కుక్కర్ కొనేటప్పుడు మనకు అవసరమైన పరిమాణంతో పాటు నాణ్యత, వ్యారింటీ, గ్యారెంటీ.. విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే యూజర్ గైడ్ ను తప్పక చదివి కంపనీ సూచించినట్టుగానే కుక్కర్ ని వినియోగించాలి. స్పేర్స్ అండ్ రిపేర్స్ విషయానికి వస్తే కచ్చితంగా నాణ్యమైనవి, అనుభవం కలిగిన టెక్నిషియన్ ను మాత్రమే సంప్రదించాలి.

No comments:
Post a Comment