కల్తీ.. కల్తీ.. కల్తీ.. ఎక్కడ చూసినా డబ్బు సంపాదనే ధ్యేయంగా అంతా కల్తీమయమే అవుతోంది. మానవునికి రోజుకు ఒక పండు తినే భాగ్యం కూడా రానురాను కరవవుతోంది. సీజనల్ ఫ్రూట్స్ తో ఆరోగ్య ఫలం అటుంచితే అనారోగ్యమే మిగులుతోంది. సహజసిద్ధంగా పండాల్సిన పండ్లను విషపూరిత పదార్థాలతో మగ్గపెడుతున్నారు. చివరకి హైకోర్ట్, ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించినా దళారుల దాహానికి అడ్డుకట్టపడడం లేదు.
గతంలో పండ్లు కృత్రిమంగా పక్వానికి రావడానికి కాల్సియం కార్బైడ్ లాంటి ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నారని గుర్తించి వాటి వాడకం పై నిషేదం విధించారు. అయితే తాజాగా పండ్ల మార్కెట్ లో విషపూరిత ఇథైలిన్(హైడ్రోకార్బన్) ప్యాకెట్లను పండ్ల పక్వానికి వాడుతున్నట్టు గమనించి అధికారులు నివ్వెరపోయారు. ఈ సాచెట్స్ ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఒక పెట్టెలోని కాయలు త్వరితగతిన పక్వానికి రావడానికి అందులో ఆరు నుంచి ఎనిమిది వాడుతున్నారు. అయితే ఆరోగ్యానికి హానికరమైన ఈ విషపూరిత రసాయనాలు మన దేశంలోకి ఎలా చొరబడుతున్నాయనేది సామాన్యుడి ప్రశ్న!
ఇది ఇలా ఉండగా కృత్రిమంగా పక్వానికి వచ్చిన పండ్లు తినడం వల్ల కళ్లు, చర్మం, జ్ఞాపకశక్తి , ఊపిరితిత్తుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే శ్వాసకోశ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పలు క్యాన్సర్ లకు కూడా దారితీస్తుంది. చిన్న పిల్లల్లో నరాల బలహీనత, తలనొప్పి, కడుపులో తిప్పడం, వాంతులు, విరేచనాలు, పలు రకాల ఎలర్జీలకు దారితీసే ప్రమాదముంది. కొన్ని సార్లు ప్రాణాపాయం కూడా తప్పదు.

No comments:
Post a Comment