- విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండడానికి, ఎలాంటి ప్రమాదాలకు తావులేని వైరింగ్ పద్ధతులను అవలంభించాలి. హౌజ్ వైరింగ్ చేసే విధానం ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ కు అనుగుణంగా ఉండాలి.
- సూర్యరశ్మి, వర్షం, తేమ లాంటి వాతావరణ పరిస్థితులకు తట్టుకుని ఎక్కువకాలం మన్నేవిధంగా విద్యుత్ తీగలను ఎన్నుకోవాలి. రాపిడి వల్ల కాని, దెబ్బలనుండి కాని చెక్కుచెదరని ఇన్సులేషన్ కలగి ఉండాలి.
- అయిదు ఆంపియర్లకు మించిన ఫ్యూజ్ లను విద్యుత్ దీపాల సర్క్యూట్ లో వాడకూడదు. సర్క్యూట్ లోని స్విచ్ లన్నింటినీ విద్యుత్ ప్రవహించే (ఫేజ్) వైరులోనే బిగించాలి.
- వైర్లు కిందకి వెళ్లాడకుండా చూసుకోవడమే కాక, చైల్డ్ సేఫ్టీ బ్లాంకింగ్ ప్లగ్ లని వాడుకోవాలి. ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు పిల్లలకు అందనంత ఎత్తులో ఉండాలి.
- ఒక ప్లగ్ పాయింట్ వద్ద ఒకే ఉపకరణం వాడాలి. ఎక్కువగా వాడితే వేడి అతిగా పెరిగి అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి.
- వేర్వేరు సబ్ సర్క్యూట్ లను ఏర్పాటు చేసుకుని లోడ్ డిస్ట్రిబ్యూషన్ సమానంగా ఉండేలా చూసుకోవాలి.
- సరియైన ఎర్తింగ్ పద్ధతిలో భాగంగా ప్లగ్ లు, సాకెట్లు తప్పకుండా మూడు పిన్నులు కలవి వాడుకోవాలి.
- గృహవిద్యత్ మొత్తం సరఫరా నిలిపేందుకు మేయిన్ స్విచ్ ను ప్రవేశద్వారం దగ్గర బిగించుకోవాలి. నాణ్యతగల ఫ్యూజ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డును మెయిన్ బోర్డుకు దగ్గరలోనే అమర్చాలి. ప్రతి విద్యుత్ ప్రసారానికి ఒక కటౌట్ ఉండాలి.
- ఐ ఎస్ ఐ మార్కుగల, నాణ్యమైన విద్యుత్ పరికరాలను మాత్రమే వాడాలి.
ఈ జాగ్రత్తలతో పాటూ విద్యుత్ వినియోగదారుడికి, సరఫరాదారుడికి విద్యుత్ రూల్స్ 1956 ప్రకారం ప్రమాదాలు, విద్యుత్ అంతరాయం విషయాల్లో సమాన బాధ్యతలున్నాయని గమనించండి. వినియోగదారుడు ఏ విషయాన్ని గురించైనా విద్యుత్ బోర్డు వారిని వెంటనే సంప్రదించవచ్చు. నిర్లక్ష్యం తగదు.
No comments:
Post a Comment