మనం ఊపిరిపీల్చేటప్పుడు ముక్కు ద్వారా గాలిలోని ప్రాణవాయువుతో పాటు అనేక సూక్ష్మజీవులు, దుమ్మూధూళిలాంటి అవాంఛనీయమైన కణాలు లోపలికి వెళ్లిపోతాయి. అనవసరమైన వీటిని బయటికి పంపేంచే శరీర ప్రక్రియ తుమ్ము. నాసిక రంద్రాలలో ఏదైనా అడ్డు పడితే తుమ్ము వస్తుంది. ఒక్కసారిగా వెలుతురుని చూసినప్పుడు గాని, ఎక్కువ చలిలోకి వెళ్లినప్పుడు గాని తుమ్ములు వస్తాయి. ఇలా తుమ్మినప్పుడు నలబైవేలకు పైగా సూక్ష్మ జీవులు, సుమారు గంటకి 150 కిలోమీటర్ల వేగంతో గాలిలోకి రావడం జరుగుతుంది. ముక్కు, ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. అయితే చుట్టుపక్కల జనాలకు మాత్రం ఇబ్బంది తప్పదు. అందుకని తుమ్ము వచ్చినప్పుడు నోటికి, ముక్కుకి చేతులను అడ్డుగాపెడతాం. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ వెంటనే చేతులను శుభ్రపరచుకోకుండానే మిగతా పనుల్లో నిమగ్నమవుతాం, ఆహారాన్ని తీసుకోవడం, ఇతరులతో కరచాలనం చేయడం.. వగైరా కారణాల వల్ల కూడా బ్యాక్టీరియా విస్తరించడానికి కారణం అవుతుంది. కాబట్టి, తుమ్ము వచ్చే సమయంలో ఎల్లప్పుడూ చేతిరుమాలు కానీ టిష్యూ పేపర్ కానీ సిద్ధం చేసుకోవడం మరవద్దు.
No comments:
Post a Comment