కళ్ళమంట! | Essential Eye Care Tips During Summers

ఎండల్లో కళ్ళు ఎక్కువగా మంటలు పుడ్తాయి. దీనికి టివి, కంప్యూటర్ మానిటర్ కూడా కారణం కావచ్చు. కళ్ళకు సరయైన విశ్రాంతి అవసరం. తగినంత ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల అలసిన కళ్ళకు విశ్రాంతి దొరుకుతుంది. కళ్ళకు కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడతాయి. అతిగా ఐ మేకప్ సరికాదు. కళ్లు చాలా సున్నితమైనవి కావున
బజారులో దొరికే అన్నీ క్రీమ్‌లను ప్రయత్నించకూడదు. వీటి వల్ల అనేక ఇన్ఫెక్షన్‌ల బారిన పడే ప్రమాదం ఉంది. అలాగే కళ్ళ ఆరోగ్యానికి మరికొన్ని చిట్కాలు చూద్దాం..

- ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని నీళ్ళలో ఉసిరిపొడిని వేసి పెట్టుకోవాలి. మరునాడు ఉదయాన్నే ఈ నీళ్ళతో ముఖం కడుక్కుంటే కళ్ళు తాజాగా ఉంటాయి.
- ఆల్మండ్ నూనె లేదా ఆలివ్‌నూనెతో కంటి చుట్టూరా సున్మితంగా మర్దనా చేయడం వల్ల చర్మంలో తేమ ఏర్పడి మృదుత్వం సంతరించుకుంటుంది.
- అలాగే ఆల్మండ్ ఆయిల్ ని కనురెప్పల నొసలపై రాస్తే వెంట్రుకలు రాలిపోకుండా నిగనిగలాడుతాయి కూడా.
- కీరదోసకాయ రసం తీసుకుని అందులో కొంచం రోజ్‌వాటర్‌ను కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట తరవాత చల్లటినీటితో కడిగితే కళ్ళమంటలనుండి ఇట్టే ఉపశమనం దొరుకుతుంది.
 https://www.youtube.com/c/vantintichitkalu

No comments: