వేసవికాలం ఎండలకు బెంబేలెత్తి అధిక సమయం ఇంట్లోనే ఉండడం, పైగా విద్యాసంస్థలకు సమ్మర్ హాలీడేస్ కారణంగా పిల్లలు కూడా చేరడం.. విద్యుత్ గృహోపకరణాల వినియోగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనివల్ల విద్యుత్ బిల్లు అధికమవ్వడమేకాక తగు జాగ్రత్తలు పాటించకపోతే విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఏర్పడుతూ అవాంతరాల వల్ల ఎంతోవిలువైన ఎలక్ట్రికల్ పరికరాలు, ఎలక్ర్టానిక్ గ్యాడ్జెట్స్.. పాడయ్యేప్రమాదముంది.
- ఒకప్పుడు టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వీటితో పాటు వాల్ మౌంట్ ఫ్యాన్, పెడస్టల్ ఫ్యాన్ వగైరా వచ్చాయి. అలాగే ఇంట్లోని వేడిగాలిని బయటికిపంపే ఎక్జాస్ట్ ఫ్యాన్ వినియోగం కూడా పెరిగింది. వీటిలో ఏ ఫ్యాన్ అయినా బ్రాండెడ్ వి ఎన్నుకోవడమే ఉత్తమం. ఫ్యాన్ రెగ్యులేటర్, బేరింగ్‌లు కొన్ని సంవత్సరాల వినియోగం తరవాత మొరాయించవచ్చు. అవి తిరిగి ఆయా కంపనీల స్పేర్స్ తోనే మార్చుకోవాలి. ఫ్యాన్ తక్కువగా తిరగడం, పూర్తిగా తిరగకపోవడం సమస్యలు తలెత్తినప్పుడు కండెన్సర్, వైడింగ్ లను మార్చవలసి ఉంటుంది. దీనికోసం అనుభవం ఉన్న సర్వీస్ ఇంజనీర్లనే సంప్రదించాల్సి ఉంటుంది.
- తక్కువ ధరకు వస్తున్నాయని నాసిరకం అసంబుల్డ్ ఎయిర్ కూలర్ లను ఎన్నుకోకూడదు. బ్రాండెడ్ కంపనీల కూలర్లలో నాణ్యమైన విడిభాగాలు వాడడం చేత అధిక వేడిని సైతం తట్టుకోగలుగుతాయి. చక్కని చల్లని గాలిని ప్రసరిస్తూ విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. కూలర్లలో నీటిని రోజూ మార్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే దోమలు విజృంభించడం, పలురకాల శ్వాసకోస వ్యాధులు తప్పవు. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా కూలర్ లో నీటిని మార్చడం అత్యంత ప్రమాదకరం. చెప్పులు వేసుకొని మాత్రమే కూలర్‌లను ముట్టుకోవడంతో పాటు పిల్లల విషయంలోనూ తగు జాగ్రత్తలు అవసరం.
- మండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలను ఆశ్రయించక తప్పడం లేదు. అయితే వీటి ఎన్నిక, ఇన్స్టలేషన్, నిర్వహణలో పలు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎయిర్ కండిషనర్‌లు సరిగా పనిచేయకపోగా కరెంట్ చార్జీలు పెరగడం, హౌస్ వైరింగ్ కాలిపోవడం వగైరా సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ చల్లదనం కోసమని 16 డిగ్రీల ఉష్ణోగ్రతను వాడడం కంటే ఎంత అవసరమో గుర్తించాలి. లేదంటే విద్యుత్ అధికంగా ఖర్చు అయి కంప్రెషర్ పాడవుతుంది.
- ఇక వేసవిలో మరో నేస్తం రిఫ్రిజిరేటర్. ఫ్రిజ్ ని ఎట్టిపరిస్థతిల్లోనూ ఎండకు నేరుగా లేదా వంటింట్లో అమర్చుకోకూడదు. కచ్చితంగా వోల్టేజ్ స్టబ్లైజర్ వినియోగించడంతో పాటు దాని చుట్టూ, ముఖ్యంగా వెనక భాగంలో గాలి ప్రసరించేలా చూసుకోవాలి. అలాగే ఎక్కువ సార్లు డోర్స్ తీయకూడదు. ఏమాత్రం అజాగ్రత్త వహించినా విద్యుత్ వినియోగం పెరగడం, కంప్రెషర్ కాలిపోయే ప్రమాదం తప్పవు.
- వేసవిలో ఐటి పరికరాలపైనా దృష్టి పెట్టాలి. లేదంటే అధిక ఉష్ణోగ్రతలతో అవి పాడవడం, మనకు అనారోగ్యం, ఒక్కో సారి ప్రాణహాని తప్పకపోవచ్చు. ఎలక్ట్రికల్ షాట్ సర్క్యూట్ కానీ, అధికవేడి వల్ల కానీ పరికరాలు పేలడం తద్వారా అగ్నిప్రమాదాలు సంభవించనూవచ్చు. మొబైల్ ఫోన్ తో పాటు ఏ ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి అయినా ఆయా పరికరల ఛార్జర్లను మాత్రమే విధిగా వాడాలి. అవసరానికిమించి ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీల లైఫ్ టైం తగ్గడంతో పాటు కాలిపోయే అవకాశం ఉంది. ఇక డెస్క్ టాప్, ల్యాప్ టాప్ కంప్యూటర్లు వినియోగిస్తున్నప్పుడు అధిక వేడి లేకుండా చల్లని గాలి ప్రసరించే లా చూసుకోవాలి. లేదంటే హ్యాంగ్ అవడం, విలువైన సమాచారం పోగొట్టుకోవడం జరుగుతుంది. మధ్యాహ్న సమయంలో టీవీ, మానిటర్ లను అదేపనిగా వీక్షించకపోవడమే ఉత్తమం.

No comments:
Post a Comment